నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా నిరుద్యోగులకు తీపికబురు అందించింది. వేర్వేరు ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం ఈ సంస్థ నుంచి తాజాగా మరో జాబ్ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా డిప్యూటీ మేనేజర్ ఉద్యోగ ఖాళీల భర్తీ జరగనుండగా నిరుద్యోగులకు ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా ప్రయోజనం చేకూరనుంది. నోటీఫికేషన్ ద్వారా డిప్యూటీ మేనేజర్ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు.
కంప్యూటర్ టెస్ట్, ఇంటర్వ్యూ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన ఎంపిక ప్రక్రియ జరగనుంది. పరీక్ష పార్ట్1, పార్ట్2 పేపర్లలో మొత్తం 100 ప్రశ్నలు ఉండగా మెరిట్ మార్కులు సాధించిన అభ్యర్థులను మాత్రమే ఉద్యోగ ఖాళీల కొరకు ఎంపిక చేయడం జరుగుతుంది. జనరల్ అభ్యర్థులకు 500 రూపాయలు దరఖాస్తు ఫీజు కాగా ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 300 రూపాయలు దరఖాస్తు ఫీజుగా ఉండనుందని తెలుస్తోంది.
ఎవరైతే ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపికవుతారో వాళ్లకు 56,100 రూపాయల నుంచి 1,77,500 రూపాయల వరకు వేతనం లభించనుంది. 2021 సంవత్సరం నవంబర్ నెల 29వ తేదీ ఆన్ లైన్ దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీగా ఉండనుందని సమాచారం. https://nhai.gov.in/#/ వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించి పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు.