Darling Re Release Collections: రెబల్ స్టార్ ప్రభాస్(Rebel Star Prabhas) కెరీర్ లో ఆల్ టైం క్లాసిక్ చిత్రం గా నిల్చిన లవ్ స్టోరీ ‘డార్లింగ్'(Darling4K) ని లేటెస్ట్ 4K క్వాలిటీ కి మార్చి , డాల్బీ అట్మాస్ సౌండ్ తో నిన్న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా రీ రిలీజ్ చేశారు. ఈ రీ రిలీజ్ కి కచ్చితంగా సెన్సేషనల్ ఓపెనింగ్స్ వస్తాయని అందరూ బలంగా నమ్మారు. ఆ నమ్మకానికి తగ్గట్టుగానే ప్రతీ సెంటర్ లోనూ సెన్సేషనల్ ఓపెనింగ్స్ నమోదు అయ్యాయి. ఉత్తరాంధ్ర ప్రాంతం లో ఏకంగా ‘గబ్బర్ సింగ్’ రీ రిలీజ్ గ్రాస్ రికార్డు ని కూడా దాటేసి సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఓవరాల్ వరల్డ్ వైడ్ గా గబ్బర్ సింగ్ ఓపెనింగ్ రికార్డు ని కొట్టలేకపోయింది కానీ, టాప్ 2 ఓపెనింగ్ ని మాత్రం సొంతం చేసుకుంది. మహేష్ బాబు ‘ఖలేజా’ రీ రిలీజ్ రికార్డు గ్రాస్ ని చాలా తేలికగా దాటేయడం గమనార్హం.
నైజాం ప్రాంతం 1 కోటి 90 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టిన ఈ చిత్రానికి, ఉత్తరాంధ్ర ప్రాంతం నుండి 62 లక్షలు , గుంటూరు జిల్లా నుండి 20 లక్షలు, సీడెడ్ ప్రాంతం నుండి 40 లక్షలు , తూర్పు గోదావరి జిల్లా నుండి 35 లక్షలు , పశ్చిమ గోదావరి జిల్లా నుండి 28 లక్షలు , కృష్ణ జిల్లా నుండి 25 లక్షలు , నెల్లూరు జిల్లా నుండి 20 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. అదే విధంగా కర్ణాటక + రెస్ట్ ఆఫ్ ఇండియా నుండి 50 లక్షల రూపాయిల రేంజ్ లో గ్రాస్ వసూళ్లను రాబట్టిన ఈ చిత్రానికి , ఓవర్సీస్ నుండి 42 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టి సంచలనం సృష్టించింది. ఓవరాల్ గా ఈ చిత్రానికి ప్రపంచవ్యాప్తంగా 4 కోట్ల 92 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టింది.
ఇది కేవలం మొదటి రోజు గ్రాస్ గ్రాస్ వసూళ్లు మాత్రమే , ప్రీమియర్ షోస్ నుండి మరో పాతిక లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. అంటే ఓవరాల్ గా ఈ చిత్రానికి ప్రీమియర్స్ + మొదటి రోజు కలిపి 5 కోట్ల 17 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రానికి టాప్ 2 రేంజ్ ఓపెనింగ్ వచ్చింది కానీ , ఓవర్సీస్ , రెస్ట్ ఆఫ్ ఇండియా లో మాత్రం అనుకున్నంత రేంజ్ ఓపెనింగ్ గ్రాస్ రాకపోవడం తో , కేవలం 5 కోట్ల 17 లక్షల రూపాయిల గ్రాస్ తో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఈ సమ్మర్ లో కొత్త రిలీజ్ లు ఫ్లాప్ అయ్యి, థియేటర్స్ మూత పడుతున్న సమయం లో , ‘డార్లింగ్’ ఇచ్చిన జోష్ వేరే లెవెల్ అనే చెప్పాలి.