Darling re release advance bookings: రెబల్ స్టార్ ప్రభాస్(Rebel Star Prabhas) కెరీర్ లో కల్ట్ క్లాసిక్ గా నిల్చిన చిత్రం ‘డార్లింగ్'(#Darling4K). అప్పటి వరకు ప్రభాస్ కి కేవలం యాక్షన్ హీరో గా , మాస్ ఆడియన్స్ మాత్రమే భారీ ఫాలోయింగ్ ఉండేది. కానీ ఈ సినిమాతో ఆయన యూత్ ఆడియన్స్ లో మంచి క్రేజ్ ని సంపాదించుకున్నాడు. ఇక్కడి నుండే ప్రభాస్ శకం మొదలైంది అని కూడా చెప్పొచ్చు. అప్పటి వరకు ఎన్నో అద్భుతమైన లవ్ స్టోరీ మూవీస్ వచ్చాయి కానీ, డార్లింగ్ వంటి డిఫరెంట్ కథాంశం, స్క్రీన్ ప్లే తో ఒక్క మూవీ కూడా రాలేదు. ఆ రోజుల్లో ఈ సినిమా ఇంటర్వెల్ లో వచ్చే ట్విస్ట్ ఆడియన్స్ కి మైండ్ బ్లాక్ అయ్యినంత పని చేసింది. అలా ప్రభాస్ కెరీర్ లో కల్ట్ క్లాసిక్ గా నిల్చిన ఈ చిత్రాన్ని , ఈ నెల 23 న విడుదల చేయబోతున్నారు.
సరికొత్త 4K టెక్నాలజీ విత్ డాళ్బీ అట్మాస్ సౌండ్ తో ఈ చిత్రాన్ని మరో మూడు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. అయితే ఈ సినిమా కచ్చితంగా ఇప్పటి వరకు విడుదలైన అన్ని రీ రిలీజ్ సినిమాల రికార్డ్స్ ని బద్దలు కొడుతుందని అంతా అనుకున్నారు. కానీ అది జరగడం అసాధ్యం అని అనిపిస్తోంది. మొదటి రోజు రికార్డు ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ‘గబ్బర్ సింగ్’ ఖాతాలో ఉంది. దాదాపుగా 8 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను ఈ చిత్రం మొదటి రోజు రాబట్టింది. ఇప్పటి వరకు ఒక్క సినిమా కూడా ఈ గ్రాస్ కి దరిదాపుల్లోకి కూడా వెళ్ళలేదు. ఖలేజా , అతడు వంటి చిత్రాలు ‘గబ్బర్ సింగ్’ రికార్డు ని బద్దలు కొడుతుందని అనుకున్నారు కానీ , అది సాధ్యం అవ్వలేదు. ఇప్పుడు ‘డార్లింగ్’ కి కూడా అదే పరిస్థితి ఎదురయ్యేలా అనిపిస్తోంది.
ప్రస్తుతానికి వరల్డ్ వైడ్ గా ఈ చిత్రానికి అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా 1 కోటి 85 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు నమోదు అయ్యాయి. రీసెంట్ గా విడుదలైన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ‘రేసు గుర్రం’ ఫుల్ రన్ కలెక్షన్స్ ని కేవలం అడ్వాన్స్ బుకింగ్స్ తోనే దాటేసింది ఈ చిత్రం. ఇది కచ్చితంగా అద్భుతమైన ట్రెండ్ , అందులో ఎలాంటి సందేహం లేదు , కానీ ఈ సినిమాతో రికార్డ్స్ పెడుతామని అనుకున్న ప్రభాస్ ఫ్యాన్స్ కాస్త నిరాకు గురయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతానికి ఉన్న ట్రెండ్ ప్రకారం చూస్తే ఈ చిత్రానికి కేవలం 4 నుండి 4.2 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు మాత్రమే మొదటి రోజు నమోదయ్యే అవకాశం ఉంది. ఫుల్ రన్ లో కచ్చితంగా 8 కోట్ల రూపాయిల రేంజ్ లో గ్రాస్ వసూళ్లను రాబట్టొచ్చు ఈ చిత్రం. చూడాలి మరి విడుదల రోజు ఎలా ఉండబోతుంది అనేది.