
‘బాహుబలి’ తర్వాత ప్రభాస్ రేంజ్ ప్రపంచ స్థాయికి చేరింది. ఈ సినిమా తర్వాత ప్రభాస్ ప్యాన్ ఇండియా సినిమాలు చేస్తూ తన క్రేజ్ ను మరింత పెంచుకుంటున్నాడు. బాహుబలి.. సాహోలతో ప్రభాస్ రేంజ్ టాలీవుడ్ నుంచి బాలీవుడ్.. హాలీవుడ్ రేంజ్ కు పెరిగింది. ప్రస్తుతం ప్రభాస్ పలు ప్రతిష్టాత్మకమైన మూవీల్లో నటిస్తున్నాడు.
ప్రభాస్ తాజాగా నటిస్తున్న చిత్రం ‘రాధేశ్యామ్’. ఈ మూవీలో ప్రభాస్ కు జోడిగా బుట్టబొమ్మ పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది.ఇక ఈ మూవీలో సీనియర్ హీరోయిన్ భాగ్యశ్రీ ఓ కీలక పాత్రలో కన్పించనుంది. చిత్రసీమలో సల్మాన్ ఖాన్ తర్వాత మొస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ గా ప్రభాస్ పేరే విన్పిస్తూ ఉంటుంది. దీంతో ప్రభాస్ పెళ్లి.. ప్రేమ.. క్రష్ లపై అభిమానుల్లో నిత్యం చర్చ జరుగుతూనే ఉంటుంది.
తాజాగా ప్రభాస్ క్రష్ గురించి సీనియర్ హీరోయిన్ భాగ్యశ్రీ ఓ ఇంటర్య్వూలో వెల్లడించింది. రాధేశ్యామ్ చిత్రీకరణ సమయంలో ప్రభాస్ తన వద్దకు వచ్చి క్రష్ ఉందని చెప్పాడని తెలిపింది. అయితే ఇదంతా జస్ట్ ఫన్నీ థింగ్ అని చెప్పింది. ఇక రాధేశ్యామ్ ఎంతో అద్భుతమైన ప్రేమ కథ అని.. దీనిని ఆస్వాదించాలంటే సినిమాను చూడాల్సిందేనని భాగ్యశ్రీ తెలిపింది.
‘రాధేశ్యామ్’ యూనిట్ తనను ఎంతో బాగో చూసుకుంటున్నారని.. హైదరాబాద్ స్వీట్లను కూడా బహుమతి ఇచ్చినట్లు చెప్పింది. గతంలోనూ ఈ వెటరన్ భామ ప్రభాస్ పై ప్రశంసలు కురిపించిన సంగతి తెల్సిందే. ప్రభాస్ సెట్లో డౌట్ టు ఎర్త్ ఉంటాడని.. అతడి వినయపూర్వక ప్రవర్తనకు ఫిదా అయినట్లు చెప్పింది.
ఇక ప్రభాస్ పెద్దగా ఎవరితో అంతగా త్వరగా కలువడనేది అందరికీ తెల్సిందే. అయితే భాగ్యశ్రీతో క్రష్ కారణంగానే ఆమెతో ప్రభాస్ అంత చనువుగా ఉంటున్నాడా? అనే సందేహాలు కలుగుతున్నాయి. ఏదిఏమైనా సీనియర్ నటితో ప్రభాస్ క్రష్ ను అతడే స్వయంగా భాగ్యశ్రీకి చెప్పడంపై డార్లింగ్ ఫ్యాన్స్ కూడా ఖుషీ అవుతున్నారు.