
యుక్త వయసులో ప్రతి ఒక్కరికీ ఒక క్రష్ అనేది ఉండటం సహజం. అది మామూలు కుర్రాళ్ళయినా, సెలబ్రిటీల కుటుంబాల్లో పుట్టిన పిల్లలైనా ఎవరైనా సరే ఆ వయసులో మానస్ పారేసుకోవడం కామన్. ఇక సినిమా హీరోయిన్లను ప్రేమించేసిన కుర్రాళ్ళ సంగతైతే చెప్పనక్కర్లేదు. ఇప్పటికీ అప్పట్లో మీ క్రష్ ఎవరు అనడిగితే మెలికలు తిరిగిపోతూ ఏదో ఒక హీరోయిన్ పేరు చెబుతుంటారు. అలా ప్రభాస్ కి కూడ ఒక క్రష్ ఉండేదట. ఒక సినిమా హీరోయిన్ మీద ఆయన మనసు పారేసుకున్నారట. అలా ప్రభాస్ ఇష్టపడిన ఒకప్పటి హీరోయినే ఇప్పుడు ఆయన సినిమాలో నటిస్తోంది.
Also Read: మహేష్ హీరోయిన్ కు మగబిడ్డ పుట్టాడు
ఇంతకీ ఎవరా హీరోయిన్ అనుకుంటున్నారా.. ఆమే భాగ్యశ్రీ . 90 ల దశకంలో బాలీవుడ్ పరిశ్రమలో కథానాయకిగా ఒక వెలుగు వెలిగింది ఈమె. తెలుగులో కూడ రెండు సినిమాలు చేసింది. అబ్బురపరిచే అందం ఈమె సొంతం. ఆ అందంతోనే అనేక మంది ప్రేక్షకుల మనసులు కొల్లగొట్టింది. వారిలో ప్రభాస్ కూడ ఉన్నారు. కుర్ర వయసులో భాగ్యశ్రీ అంటే ఇష్టం పెంచుకున్నారట ఆయన. ప్రస్తుతం ఈమె ప్రభాస్ కొత్త చిత్రం ‘రాధే శ్యామ్’లో నటిస్తోంది. దీంతో ప్రభాస్ ఒకప్పుడు తాను ఎంతగానో ఇష్టపడిన విషయాన్నీ నేరుగా వెళ్లి ఆమెకే చెప్పేశాడట.
Also Read: మెగా క్యాంపులో ఇరుక్కుపోయిన కొరటాల?
దాంతో భాగ్యశ్రీ సంతోషపడిపోయింది. ఒకప్పుడంటే ప్రభాస్ కుర్రాడు కావచ్చు. కానీ ఇప్పుడు పాన్ ఇండియా స్టార్. ఆ స్థాయిలో ఉన్న నటులు కలిసి మాట్లాడటం కూడ గగనం. కానీ ప్రభాస్ ఒకప్పుడు తాను ఎంత ఇష్టపడిందీ దగ్గరకెళ్ళి మరీ చెప్పడం, ఆమె పట్ల ప్రత్యేక శ్రద్ద తీసుకుని అన్ని సౌకర్యాలు కల్పించడం, ప్రత్యేకంగా చేయించిన హైదరాబాదీ స్వీట్లు ప్రేమతో అందించడంతో భాగ్యశ్రీ ఆశ్చర్యానికి లోనయ్యారు. ప్రభాస్ మంచితనం గురించి, అంత పెద్ద హీరో అయినప్పటికీ మామూలు అభిమానిలా దగ్గరకొచ్చి ఒకప్పుడు మీ మీద నాకు క్రష్ ఉండేది అంటూ చెప్పడం అయన సింప్లిసిటీకి నిదర్శనమని అంటోంది ఆమె.
మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్