Suhani Bhatnagar: దంగల్ సినిమాలో అమీర్ ఖాన్ చిన్న కూతురు బబిత పాత్రను పోషించిన నటి సుహానీ భట్నాగర్ కన్నుమూశారు. కేవలం 19 ఏళ్ల వయసులో సుహానీ భట్నాగర్ ప్రపంచానికి వీడ్కోలు పలికింది. ఫరీదాబాద్ నివాసి అయిన సుహాని భట్నాగర్ మరణానికి కారణం ఆమె శరీరం మొత్తం నీరు నిండడమే అని తెలుస్తోంది. కొంతకాలం క్రితం సుహానీ భట్నాగర్ ప్రమాదానికి గురైంది. దీంతో ఆమె కాలుకు ఫ్రాక్చర్ అయింది. సుహాని ట్రీట్మెంట్ కోసం తీసుకున్న మెడిసన్స్ వల్ల సైడ్ ఎఫెక్స్ రావడంతో శరీరంలో మార్పులు వచ్చాయట.
ఈమె చాలా కాలంగా ఢిల్లీలోని ఎయిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందింది. సుహానీ భట్నాగర్ బాలీవుడ్ లో సుప్రసిద్ధ చైల్డ్ ఆర్టిస్ట్. ఆమె అమీర్ ఖాన్ బ్లాక్ బస్టర్ సినిమా దంగల్ లో నటించి ప్రేక్షకుల ప్రశంసలు అందుకుంది. ఈ సినిమాలో ఆమె జూనియర్ బబితా ఫోగట్ పాత్రను పోషించింది. చాలా టీవీ యాడ్స్ లో కూడా కనిపించింది సుహాని. అయితే ఈమె సినిమాలకు దూరంగా ఎందుకు అయింది అని సెర్చ్ చేస్తున్నారు ఈమె అభిమానులు.
దంగల్, తర్వాత సుహానీ భట్నాగర్ కు సినిమా ఆఫర్లు క్యూ కట్టాయి. కానీ ఈమె సినిమాకు పూర్తిగా బ్రేక్ ఇవ్వాలని నిర్ణియించుకుందట. దీనికి కారణం చదువు మాత్రమే అని టాక్. అయితే ముందు చదువుపై దృష్టి పెట్టాలనుకుందట. ఆ తర్వాత మళ్లీ సినిమాల్లోకి రావాలని ఓ ఇంటర్వ్యూలో తానే స్వయంగా చెప్పింది. దీంతో ఆమె అభిమానులు కూడా ఒకింత ఆందోళన వ్యక్తం చేశారు. కానీ మంచి నిర్ణయం అని కొనియాడారు.
సోహాని భట్నాగర్ సినిమాలకు దూరంగా ఉన్నా.. సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ యాక్టివ్ గా ఉండేది. 25 నవంబర్ 2021 నుంచి ఇన్ స్టాగ్రామ్ లో యాక్టివ్ గా లేదు. కానీ ఆ తర్వాత ఆమె లుక్స్ ను చూసిన నెటిజన్లు ఆశ్యర్యపోయారు. ముందుకంటే చాలా అందంగా తయారైంది భట్నాగర్. హీరోయిన్ కు ఏ మాత్రం తీసిపోని అందం సుహానీలో ఉందని అనుకునేవారు. కానీ ఈమె మరణించింది అనే వార్త తెలిసిన తర్వాత ఆందోళన చెందుతున్నారు అభిమానులు.