Dance Ikon 2 : బుల్లితెర పై ఓంకార్(Omkar) నిర్వహించే ఎంటర్టైన్మెంట్ షోస్ కి ఆడియన్స్ నుండి ఎంత మంచి రెస్పాన్స్ వస్తూ ఉంటుందో మనమంతా చూస్తూనే ఉన్నాం. చిన్నప్పటి నుండి ఆయన షోస్ కి ఆడియన్స్ బాగా అలవాటు పడిపోయారు. రీసెంట్ గానే ఆయన ‘ఇస్మార్ట్ జోడి సీజన్ 3′(Ismart Jodi 3) ని స్టార్ మా ఛానల్ లో విజయవంతంగా నిర్వహించి భారీ హిట్ ని మరోసారి తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ షో నడుస్తున్న సమయంలోనే ఆహా మీడియా లో ‘డ్యాన్స్ ఐకాన్ 2′(Dance Ikon 2) షో ని మొదలు పెట్టాడు. దీనికి కూడా ఆడియన్స్ నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. బిగ్ బాస్ షోలో ఎలా అయితే గొడవలు ఉంటాయో, ఈ షోలో కూడా అలాంటి గొడవలు ఉంటాయి. ఇందులో కూడా నామినేషన్స్ ప్రక్రియ ఉంటుంది. జనాలు వేసే ఓట్ల ద్వారా కంటెస్టెంట్స్ సేవ్ అవ్వడం, లేదా ఎలిమినేట్ అవ్వడం జరుగుతూ ఉంటుంది.
Also Read : పాన్ ఇండియన్ డైరెక్టర్ తో వెంకటేష్ తదుపరి మూవీ ఫిక్స్!
అలా ఈ షోలో ఎలిమినేట్ అయిన మానస్, రాబోయే ఎపిసోడ్ లో మళ్ళీ వైల్డ్ కార్డు ద్వారా ఎంట్రీ ఇచ్చాడు. ఈసారి కొత్త కంటెస్టెంట్ తో ఆయన అడుగుపెట్టాడు. కాసేపటి క్రితమే ఈ ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమో ఒకటి విడుదలైంది. ఈ ప్రోమో చూస్తుంటే ఈ ఎపిసోడ్ లో కూడా కంటెస్టెంట్స్ అందరూ డ్యాన్స్ ఇరగకొట్టేసారు అనిపిస్తుంది. అంతే కాకుండా ప్రియదర్శి హీరో గా నటించిన లేటెస్ట్ చిత్రం ‘సారంగపాణి జాతకం’ వచ్చే వారం విడుదల అవుతున్న సందర్భంగా, నా సినిమా ప్రొమోషన్స్ కోసం హీరో ప్రియదర్శి, హీరోయిన్ అలాగే ఇంద్రగంటి మోహన్ కృష్ణ ముఖ్య అతిథులుగా విచ్చేసారు. కాసేపు వీళ్ళు చేసిన సందడి ఎపిసోడ్ కి హైలైట్ గా నిల్చింది. అయితే ప్రోమో చివర్లో మానస్, ప్రకృతి మధ్య పెద్ద మాటల యుద్ధమే నడిచింది. షో ప్రారంభం నుండి వీళ్లిద్దరికీ ఒకరంటే ఒకరికి పడడం లేదు.
ఇప్పుడు వైల్డ్ కార్డు ఎంట్రీ ఇచ్చిన తర్వాత కూడా వీళ్ళ మధ్య వార్ నడుస్తూనే ఉంది. ప్రకృతి మరెవరో కాదు, బిగ్ బాస్ సీజన్ 8(Bigg Boss Telugu 8) టాప్ 5 కంటెస్టెంట్స్ లో ఒకరైన ప్రేరణకు(Prerana Kambam) సోదరి. అయితే ఈ ప్రోమోలో జరిగిన గొడవ విషయానికి వస్తే ప్రతీ ఎపిసోడ్ లాగానే ఈ ఎపిసోడ్ లో కూడా నామినేషన్ ప్రక్రియ జరుగుతుంది. ఇదే ఈ సీజన్ కి చివరి నామినేషన్ అని ఓంకార్ చెప్తాడు. ఈ నామినేషన్ లో ప్రకృతి(Prakruthi Kambam) మానస్ ని నామినేట్ చేస్తుంది. ఆ తర్వాత ఆమె మాట్లాడుతూ ‘మరో నిన్ను బయటకు గెంటేయాలని అనుకుంటున్నాను’ అని అంటుంది. ‘నన్ను ఇక్కడ బయటకి గెంటేయడానికి ఎవరికీ అర్హత లేదు..దయచేసి మాటలు చక్కగా రానివ్వండి(ఇంగ్లీష్ లో)’ అని అంటాడు మానస్. అప్పుడు ప్రకృతి ‘మీరు దీనికన్నా నన్ను గతంలో ఎంతో అగౌరవపరిచారు, కానీ నేను మిమ్మల్ని కేవలం నామినేట్ చేస్తే తప్పు అయిపోయిందా?’ అని అంటుంది. అప్పుడు మానస్ ఓంకార్ ని ప్రశ్నిస్తూ అసలు నన్ను ఎందుకు పిలిచారు షోకి, గెంటేయడానికే పిలిచారా అని అడుగుతాడు. ఓంకార్ సమాధానం చెప్పకుండా తెల్లమొహం వేస్తాడు. ఈ ప్రోమో వీడియోని మీరు కూడా చూసి మీ అభిప్రాయాన్ని వ్యక్తం చేయండి.
