Volkswagen : భారత మార్కెట్ నుండి నిష్క్రమిస్తుందనే ఊహాగానాల మధ్య జర్మనీకి చెందిన కార్ల తయారీ సంస్థ ఫోక్స్ వ్యాగన్ సోమవారం ఒక అద్భుతమైన SUV ని విడుదల చేసింది. టయోటా ఫార్చ్యూనర్ కి గట్టి పోటీనిచ్చే ఈ కారు కోసం చాలా కాలంగా ఎదురుచూస్తున్నారు. కంపెనీ దీనిని అనేక రంగులలో , ఆకర్షణీయమైన ధరలో విడుదల చేసింది. ఫోక్స్ వ్యాగన్ విడుదల చేసిన ఈ కారు VW టిగువాన్ R-లైన్. ఇది కంపెనీ అదే పేరు గల మునుపటి కారు అప్ డేటెడ్ వెర్షన్. విడుదల సమయంలో కంపెనీ దీనికి 48.99 లక్షల రూపాయల ప్రారంభ ధరను (ఎక్స్-షోరూమ్) నిర్ణయించింది. రాబోయే రోజుల్లో దీని ధర మరింత పెరిగే అవకాశం ఉంది.
Also Read : రెండు నెలల్లోనే 5 స్టార్ రేటింగ్.. టాటాకు కియా సవాల్
పవర్ ఫుల్ ఇంజన్, అద్భుతమైన ఫీచర్లు
ఈ కారులో కంపెనీ 2.0 లీటర్ల నాలుగు సిలిండర్ల టర్బో పెట్రోల్ ఇంజన్‌ను అందిస్తోంది. ఇది 204 PS గరిష్ట శక్తిని, 320 Nm పీక్ టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. ఈ కారు ఆల్-వీల్ డ్రైవ్‌తో వస్తుంది. ఇందులో 7-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ కూడా ఉంది. పొడవు, వెడల్పు గురించి మాట్లాడితే.. ఇది 4 మీటర్ల కంటే పొడవైన SUV. దీని పొడవు 4,539mm, వెడల్పు 1,859mm, ఎత్తు 1,656mm, వీల్‌బేస్ 2,680mm. ఈ కారును ‘కంప్లీట్ బిల్ట్ యూనిట్’ గా భారతదేశానికి తీసుకురానున్నట్లు కంపెనీ తెలిపింది. అంటే, ఈ కారు యూరప్ నుండి తయారై, షిప్‌లో భారతదేశానికి వస్తుంది. ఈ కారుకు భారీ పన్ను చెల్లించాల్సి ఉంటుంది.
ఈ కారు ఫీచర్ల గురించి మాట్లాడితే.. ఇది కాక్‌పిట్ లుక్ లో ఉంటుంది. ఇందులో 26.04 సెంటీమీటర్ల డిజిటల్ స్క్రీన్ ఉంటుంది. దీనిని డ్రైవర్ అవసరాలకు అనుగుణంగా మార్చుకోవచ్చు. కారులో 38.1 సెంటీమీటర్ల ఇన్ఫోటైన్‌మెంట్ టచ్‌స్క్రీన్ ఉంటుంది. దీని యూజర్ ఇంటర్‌ఫేస్ మునుపటి కంటే మెరుగుపడింది. కారులో హెడ్-అప్ డిస్‌ప్లే కూడా ఉంటుంది. ఈ కారును సిప్రెస్సినో గ్రీన్ మెటాలిక్, గ్రెనాడిల్లా బ్లాక్ మెటాలిక్, నైట్‌షేడ్ బ్లూ మెటాలిక్, ఓరిక్స్ వైట్ పెర్ల్, ఔస్టర్ సిల్వర్ మెటాలిక్, పెర్సిమోన్ రెడ్ మెటాలిక్ రంగులలో విడుదల చేశారు.
ఇంటీరియర్ నుండి ఎక్స్‌టీరియర్ వరకు R-లైన్ థీమ్
ఈ కారులో LED లైటింగ్ ఉంటుంది. కారు ఎక్స్‌టీరియర్ నుండి ఇంటీరియర్ వరకు R-లైన్ థీమ్ కంప్లీట్ లుక్ కనిపిస్తుంది. కారులో 19 ఇంచుల పెద్ద డైమండ్ కట్ అల్లాయ్ వీల్స్ ఉన్నాయి. కారులో 8-స్పీకర్లు, 30 రంగుల యాంబియెన్స్ లైటింగ్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, పనోరమిక్ సన్‌రూఫ్ కూడా ఉన్నాయి. మార్కెట్‌లో ఈ కారు టయోటా ఫార్చ్యూనర్, స్కోడా కోడియాక్, MG గ్లోస్టర్ వంటి కార్లతో పోటీపడుతుంది.
Also Read : కలలో కూడా ఈ ఆఫర్ ఊహించలేం.. మహీంద్రా ఆ మోడల్ పై రూ.1.15లక్షలు ఆదా