Victory Venkatesh : ఈ ఏడాది విక్టరీ వెంకటేష్(Victory Venkatesh) ‘సంక్రాంతికి వస్తున్నాం'(Sankranthiki Vastunnam) చిత్రంతో ఏ రేంజ్ బ్లాక్ బస్టర్ హిట్ ని అందుకున్నాడో మనమంతా చూసాము. నేటి తరం స్టార్ హీరోలకు కూడా సాధ్యం అవ్వని రేంజ్ లో ఆయన కుంభస్థలం బద్దలు కొట్టి ఏకంగా 300 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టాడు. ఒక సీనియర్ హీరోకి 300 కోట్ల గ్రాస్ రావడమంటే సాధారణమైన విషయం కాదు. అంత రేంజ్ కి వెళ్లిన తర్వాత వెంకటేష్ మళ్ళీ క్రిందకి దిగి రావాలని అనుకోవడం లేదు. ఎందుకంటే ‘సంక్రాంతికి వస్తున్నాం’ చిత్రానికి ముందు ఆయన ఒప్పుకున్న కొన్ని సినిమాలను రద్దు చేశాడు. ఎందుకంటే అవి ఎందుకో అభిమానుల అంచనాలను అందుకోలేవని ఆయనకు అర్థమైంది కాబట్టి. అదే విధంగా ‘సంక్రాంతికి వస్తున్నాం’ తర్వాత వెంకటేష్ దాదాపుగా 20 కథలను విన్నాడు, కానీ ఒక్కటి కూడా ఆయనకు నచ్చలేదు.
Also Read : మొదట్లో డైరెక్టర్ వశిష్ఠ ను మోసం చేసిన ఇద్దరు స్టార్ హీరోలు…
అయితే రీసెంట్ గానే ఈయన ప్రముఖ స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్(Trivikram Srinivas) తో భేటీ అయ్యాడు. వీళ్లిద్దరి కాంబినేషన్ లో ఒక సినిమా ప్రకటించి 7 ఏళ్ళు దాటింది. కానీ ఎవరి ప్రాజెక్ట్స్ లో వాళ్ళు ఫుల్ బిజీ గా ఉండడం వల్ల, ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కలేదు. కానీ ఇప్పుడు మాత్రం ఈ సినిమాని సెట్స్ మీదకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారట. త్రివిక్రమ్ విక్టరీ వెంకటేష్ కోసం ‘నువ్వు నాకు నచ్చావ్’ లాంటి సబ్జెక్టు ని సిద్ధం చేసి పెట్టుకున్నాడు. స్క్రిప్ట్ కూడా రెడీ, కేవలం డైలాగ్ వెర్షన్ మాత్రమే రాయాల్సి ఉంది. త్రివిక్రమ్ శ్రీనివాస్ ముందుగా అల్లు అర్జున్ తో సినిమా చేద్దామని అనుకున్నాడు కానీ, స్క్రిప్ట్ చాలా వరకు పూర్తి అవ్వలేదు. అందుకే ముందుగా ఆయన అట్లీ సినిమాని మొదలు పెట్టబోతున్నాడు. ఆ చిత్రం పూర్తి అవ్వడానికి కనీసం సంవత్సరం అయినా పడుతుంది. ఈలోపు వెంకటేష్ తో సినిమా పూర్తి చేయడానికి ప్లానింగ్ చేస్తున్నాడట త్రివిక్రమ్.
ఇప్పటికే వీళ్లిద్దరు రెండు మూడు సార్లు స్టోరీ సిట్టింగ్స్ కూడా వేసారట. వెంకటేష్ నుండి ఆడియన్స్ ఎలాంటి వింటేజ్ ఎలిమెంట్స్ ని ఆశిస్తారో, అవన్నీ ఈ చిత్రంలో ఉండేలా ప్లాన్ చేసాడట త్రివిక్రమ్ శ్రీనివాస్. గతంలో వెంకటేష్ హీరో గా నటించిన నువ్వు నాకు నచ్చావ్, మల్లీశ్వరి వంటి చిత్రాలకు త్రివిక్రమ్ శ్రీనివాస్ స్టోరీ, స్క్రీన్ ప్లే అందించాడు. ఈ సినిమాలు ఎన్ని వందల సార్లు చూసిన బోర్ కొట్టవు. అలాంటి సబ్జెక్టు ని మరోసారి సిద్ధం చేసాడట త్రివిక్రమ్ శ్రీనివాస్. అనుకున్నది, అనుకున్నట్టు తీస్తే, వెంకటేష్ ఖాతాలో మరో 300 కోట్ల రూపాయిల సినిమా రాబోతుంది అనొచ్చు. త్వరలోనే దీనికి సంబంధించిన పూర్తి వివరాలు బయటకు రానుంది. ఈ చిత్రంలో ఒక యంగ్ హీరో కూడా నటించే అవకాశాలు ఉన్నాయట. గతంలో మహేష్ బాబు కోసం రాసుకున్న ఒక కథని, ఇప్పుడు వెంకటేష్ కోసం ఉపయోగిస్తున్నారు అనే టాక్ కూడా ఇండస్ట్రీ వర్గాల్లో నడుస్తుంది.
Also Read : ప్రశాంత్ వర్మ జై హనుమాన్ మూవీ మీద బజ్ తగ్గిందా..?