Shiva Shankar Master Passes Away: కరోనా కాటేసింది. దీనిదెబ్బకు ఇప్పటికే ఎస్పీ బాలు కన్నుమూయగా.. తాజాగా మరో సినీ దిగ్గజం నేలరాలిపోయారు. ప్రముఖ నృత్య దర్శకుడు, నటుడు శివశంకర్ మాస్టర్ ఇక లేరు. ఇటీవలే కరోనా బారినపడిన ఆయన హైదరాబాద్ లోని ఏఐజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.
-శివశంకర్ మాస్టర్ ప్రస్థానం
1975లో ‘పాట్టు భరతమమ్’ చిత్రానికి సహాయకుడిగా కెరీర్ ప్రారంభించారు. ‘కురువికూడు’ చిత్రంతో డ్యాన్స్ మాస్టర్ గా మారారు. కొరియోగ్రాఫర్ గానే కాదు.. నటుడిగా వెండితెరపై తనదైన ముద్రవేశాడు.
– శివశంకర్ మాస్టర్ తెలుగు, తమిళం సహా 10 భాషల్లో 800కు పైగా చిత్రాల్లో పాటలకు కొరియోగ్రాఫర్ గా చేశారు. అత్యధికంగా దక్షిణాది భాష చిత్రాలు పనిచేశారు.
-2003లో ‘అలయ్’ చిత్రంతో నటుడిగా మారారు. దాదాపు 30కిపైగా చిత్రాల్లో వైవిధ్యనటనతో నవ్వులు పంచారు.
-బుల్లితెరపైన తనదైన ముద్రవేశారు. పలు డ్యాన్స్ షోలకు జడ్జిగా చేశారు. ఈయన కింద శిష్యరికం చేసిన ఎంతో మంది కొరియోగ్రాఫర్ లు ఇప్పుడు దక్షిణాదిన టాప్ డ్యాన్స్ మాస్టర్ లుగా కొనసాగుతున్నారు.
Also Read: శివ శంకర్ మాస్టర్ జీవితంలో పెద్ద డ్రామానే ఉంది !
శివశంకర్ మాస్టర్ కు ఇద్దరు కుమారులు విజయ్, అజయ్.. ఇద్దరూ డ్యాన్స్ మాస్టర్లే. వీరి ఫ్యామిలీ మొత్తం కరోనా బారినపడింది. భార్య, కుమారుడు క్వారంటైన్ లో ఉన్నారు. శివశంకర్ మాస్టర్ మృతితో సినీ ఇండస్ట్రీ శోకసంద్రంలో మునిగింది. ఆయనకు సినీ ప్రముఖులంతా ఘననివాళులర్పిస్తున్నారు.
ఇప్పటికే శివశంకర్ మాస్టర్ వైద్యఖర్చులకు డబ్బులు లేకపోతే తమిళ హీరో ధనుష్ రూ.10లక్షలు ఇచ్చారు. చిరంజీవి రూ.3 లక్షల ఆర్థికసాయం చేశారు. సోనూసూద్ సాయం చేస్తానని హామీ ఇచ్చారు. ఇంత మంది చేసినా శివశంకర్ మాస్టర్ ప్రాణాలు దక్కలేదు. మాయదారి కరోనా ఆయనను తీసుకెళ్లిపోయింది. సినీ ఇండస్ట్రీలో మరోసారి విషాదాన్ని మిగిల్చింది.
Also Read: సాయం చేయలేని సానుభూతి వల్ల ఉపయోగం ఏముంది ?