https://oktelugu.com/

Vastu Tips: ఇంట్లో లక్ష్మీదేవి నిలవాలంటే చేయకూడని వాస్తు తప్పులు ఇవే?

Vastu Tips: మనం నిత్య జీవితంలో చేసే ప్రతి పని డబ్బుతో ముడి పడి ఉంటుందనే విషయం తెలిసిందే. అయితే కొంతమంది ఎంత డబ్బు సంపాదించినా ఆ డబ్బు ఇంట్లో నిలవదు. కొన్ని వాస్తు తప్పుల వల్ల కూడా ఇంట్లో డబ్బు నిలవదు. వాస్తు ప్రకారం ఇంటి నిర్మాణం లేని పక్షంలో ఆ ఇంట్లో నివశించే వాళ్లను అనేక ఆరోగ్య సమస్యలు వేధించే అవకాశం ఉంటుంది. ఇల్లు లేదా కార్యాలయం మురికిగా ఉంటే లక్ష్మీదేవి కటాక్షం లభించదు. […]

Written By: , Updated On : November 29, 2021 / 07:44 AM IST
vasthu-tips-telugu
Follow us on

Vastu Tips: మనం నిత్య జీవితంలో చేసే ప్రతి పని డబ్బుతో ముడి పడి ఉంటుందనే విషయం తెలిసిందే. అయితే కొంతమంది ఎంత డబ్బు సంపాదించినా ఆ డబ్బు ఇంట్లో నిలవదు. కొన్ని వాస్తు తప్పుల వల్ల కూడా ఇంట్లో డబ్బు నిలవదు. వాస్తు ప్రకారం ఇంటి నిర్మాణం లేని పక్షంలో ఆ ఇంట్లో నివశించే వాళ్లను అనేక ఆరోగ్య సమస్యలు వేధించే అవకాశం ఉంటుంది. ఇల్లు లేదా కార్యాలయం మురికిగా ఉంటే లక్ష్మీదేవి కటాక్షం లభించదు.

Vastu Tips

Vastu Tips

లక్ష్మీదేవి చెడు ప్రదేశాలకు దూరంగా ఉంటుందని గుర్తుంచుకోవాలి. లక్ష్మీదేవి ఎల్లప్పుడూ శుభ్రమైన ప్రదేశాలలో మాత్రమే నివశిస్తుంది. వాస్తు ప్రకారం చెప్పులను సరైన ప్రదేశాలలో మాత్రమే ఉంచాలి. పూజ గది దగ్గర లేదా ఇంట్లో చెప్పులు విడవకూడదు. ఎల్లవేళలా చెప్పులను సరైన స్థలంలో ఉంచితే మంచిది. బహిరంగ ప్రదేశంలో చీపురును ఉంచకూడదు. ఎవరు పడితే వాళ్లు చీపురును తాకకూడదు.

Also Read: Vastu Shastra Tips for Home: ఇంటి ముంగిట ఈ తొమ్మిది చెట్లను నాటితే ధనప్రాప్తి.. అవేంటంటే?

ఎల్లప్పుడూ చీపురును ఇంట్లో దాచి ఉంచితే మంచిది. పాడైన కుళాయిలు, గడియారాలను ఇంట్లో ఉంచకూడదు. పాడైన గడియారాలు, కుళాయిలు పెద్దపెద్ద వాస్తు దోషాలను సృష్టించే అవకాశం ఉంటుంది. ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి కోపంతో వెళ్లిపోతుందని గుర్తుంచుకోవాలి. మనిషి బయటకు వెళ్లి ఇంటికి తిరిగి వచ్చే సమయంలో అతని చేతిలో ఏదో ఒకటి ఉండాలి. ఇలా చేయకపోతే సంపద పెరగడానికి బదులుగా తరుగుతుంది.

Goddesses Lakshmi Devi

Goddesses Lakshmi Devi

పూజ చేసే సమయంలో ఇతరులపై ఎట్టి పరిస్థితుల్లోనూ కోపగించకూడదు. ఎవరైతే ఇతరుల పట్ల చెడుగా ప్రవర్తిస్తారో వాళ్లకు లక్ష్మీదేవి దూరంగా ఉంటుందని గుర్తుంచుకోవాలి. ఈ జాగ్రత్తలు తీసుకున్నా లక్ష్మీదేవి నిలవకపోతే వాస్తు నిపుణుల సలహాలు, సూచనలు పాటిస్తే మంచిది.

Read More: ఇంట్లో నల్లాలు లీక్ అయితే మనీ ప్రాబ్లమ్స్ తప్పవా?