Damarukam Movie Villain Wife Details: గణేష్ వెంకట్రామన్ కూడా టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో విలన్ పాత్రలలో నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నాడు. ఇతను తెలుగుతోపాటు తమిళ్లో కూడా పలు సినిమాలలో నటించి ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యాడు. సినిమాలలో కేవలం విలన్ గా మాత్రమే కాకుండా క్యారెక్టర్ ఆర్టిస్టుగా కూడా నటిస్తున్నాడు. ప్రస్తుతం గణేష్ కోలీవుడ్లో బుల్లితెరపై పలు సీరియల్స్ లో నటిస్తూ బిజీగా ఉన్నాడు. ఈ నటుడి భార్య కూడా తెలుగులో ఒక తోపు హీరోయిన్ అన్న సంగతి చాలామందికి తెలియకపోవచ్చు. గణేష్ వెంకట్రామన్ అక్కినేని నాగార్జున హీరోగా నటించిన డమరుకం సినిమాతో తెలుగులో బాగా ఫేమస్ అయ్యాడు. డమరుకం సినిమాలో విలన్ పాత్రలో గణేష్ తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. ఈ సినిమాలో హ్యాండ్సమ్ లుక్ లో కనిపిస్తూనే విలన్ గా చాలా అద్భుతంగా ప్రేక్షకులను భయపెట్టాడు. ఇతను తెలుగుతోపాటు తమిళంలో కూడా సినిమాలలో నటిస్తుంటాడు. ఈనాడు అనే సినిమాతో 2009లో సినిమా ఇండస్ట్రీలో తన కెరియర్ మొదలు పెట్టాడు. ఈనాడు సినిమాలో ఇన్స్పెక్టర్ ఆరిఫ్ ఖాన్ పాత్రలో గణేష్ తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు.
ఇక తర్వాత డమరుకం సినిమాతో బాగా గుర్తింపు తెచ్చుకున్నాడు. డమరుకం సినిమాలో తన అద్భుతమైన నటనతో తెలుగులో వరుస అవకాశాలను దక్కించుకున్నాడు.త్రిష ప్రధాన పాత్రలో నటించిన నాయకి సినిమాలో కూడా గణేష్ నటించాడు. నటుడిగా ఇతనికి మంచి ప్రశంసలు వస్తున్నప్పటికీ తెలుగులో మాత్రం అనుకున్న స్థాయిలో అవకాశాలు అందుకోలేకపోయాడు. తెలుగులో గణేష్ రాగల 24 గంటల్లో, అంతిమ తీర్పు, శబరి వంటి సినిమాలలో కనిపించాడు. తమిళ్లో ఇతను బుల్లితెర మీద సీరియల్స్ లో కూడా నటిస్తున్నాడు. బుల్లితెర మీద పలు రియాలిటీ షో లలో కూడా సందడి చేస్తూ ఉంటాడు. బిగ్ బాస్ సీజన్ వన్ తమిళ్ లో పాల్గొని గణేష్ మూడవ రన్నరప్ గా నిలిచాడు.
అయితే చాలామందికి తెలియని విషయం ఏమిటంటే గణేష్ భార్య కూడా తెలుగులో హీరోయిన్. గణేష్ భార్య పేరు నిషా కృష్ణ. ఈమె విశాల్ హీరోగా నటించిన ఇంద్రుడు సినిమాలో హీరోయిన్ గా నటించింది. కృష్ణుడికి వారసుడు అనే సినిమాలో కూడా నిషా కృష్ణన్ నటించడం జరిగింది. తెలుగులో నిషా కృష్ణన్ శ్రీమంతుడు అనే సీరియల్ లో ప్రధాన పాత్రలో కనిపించింది. ఈ సీరియల్ ద్వారా ఆమె తెలుగులో బాగా ఫాలోయింగ్ తెచ్చుకుంది. మహాభారతం అనే తమిళ్ సినిమాలో ద్రౌపది పాత్రలో కూడా తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. గణేష్, నిషా కృష్ణన్ దంపతులకు ఒక పాప మరియు ఒక బాబు ఉన్నారు.
View this post on Instagram