https://oktelugu.com/

Dalita Bandhu: దళిత బంధు డబ్బులతో సినిమా తీస్తున్నాడు.. ఏ సినిమా? ఎవరు హీరో అంటే?

కరీంగనర్ జిల్లా హుజూరాబాద్ నియోజకవర్గంలో ఉన్న వీణవంక మండలం బేతిగల్ గ్రామానికి చెందిన కృష్ణ అనే వ్యక్తి దళిత బంధు డబ్బు రావడంతో తన ఇష్టాన్ని తీర్చుకునే పనిలో పడ్డాడు.

Written By: , Updated On : October 11, 2023 / 11:42 AM IST
Dalita Bandhu

Dalita Bandhu

Follow us on

Dalita Bandhu: కేసీఆర్ ప్రకటించిన దళిత బందు గురించి అందరికీ తెలిసిందే. ఈ డబ్బు గనుక వస్తే.. వ్యాపారం, చదువులు, ఇల్లు లేదా మరేవైనా ఇతర అవసరాల కోసం ఉపయోగించుకుంటారు. కానీ ఒక వ్యక్తి మాత్రం ఆ డబ్బులను తనకున్న పిచ్చిని తీర్చుకోవడం కోసం ఉపయోగించడాట. అయినా పిచ్చి కోసం డబ్బులు ఖర్చు చేయడం ఏంటి అనుకుంటున్నారా? అయితే ఆ వివరాలు మీకోసమే ఓ సారి చూసేయండి…

కరీంగనర్ జిల్లా హుజూరాబాద్ నియోజకవర్గంలో ఉన్న వీణవంక మండలం బేతిగల్ గ్రామానికి చెందిన కృష్ణ అనే వ్యక్తి దళిత బంధు డబ్బు రావడంతో తన ఇష్టాన్ని తీర్చుకునే పనిలో పడ్డాడు. ఈ డబ్బును సినిమా నిర్మాణానికి ఖర్చు చేస్తున్నాడు. ఏంటి దళిత బంధు డబ్బుతో సినిమానా అని ఆశ్యర్యపోయారు కదా.. అవును మీరు విన్నది నిజం. వచ్చిన కొంచెం డబ్బుతో సినిమానా అనుకుంటున్నారా? అది కూడా చేసి చూపిస్తాను అంటున్నాడు కృష్ణ. అందుకే అందరికన్నా భిన్నంగా ఆలోచించించి ఆ మనీతో సినిమా తీశాడు. అయితే ప్రస్తుతం నల్గొండ కలెక్టర్ ఏవీ కర్నర్.. కరీంనగర్ కలెక్టర్‌గా ఉన్న టైంలో గౌతమ్ కృష్ణ అనే వ్యక్తికి దళిత బంధు వచ్చింది.

సినిమాలంటే పిచ్చి ఉన్న కృష్ణ దగ్గర మంచి మంచి సినిమా కథలు ఉన్నాయట. కానీ చేతిలో డబ్బులు లేకపోవడంతో సినిమా తీసే అవకాశాన్ని విరమించుకున్నాడు. సినిమా తీయాలంటే కోట్లలో కావాలి. కనీసం చిన్న సినిమా చేయాలి అన్నా కూడా లక్షల్లో డబ్బు కావాల్సిందే. అదే సమయంలో దళిత బందు రావడంతో కాస్త భిన్నంగా ఆలోచించి ఈ డబ్బును సినిమా తీయడానికి ఉపయోగించాడు. అమ్మ ప్రొడక్షన్ పేరుతో నిర్మాణ సంస్థను మొదలు చేశాడు కృష్ణ. దీంట్లో భాగంగా ఇప్పుడు ది కాప్ అనే సినిమాను కూడా తెరకెక్కిస్తున్నారు ఈ నిర్మాత. అంతే కాదు ఇందులో సుమన్ ప్రధాన పాత్రలో నటిస్తున్నట్టు కూడా తెలుస్తోంది. దీన్ని స్వయంగా కృష్ణనే తెలిపారు.

కాగా ఈ మూవీకి సంబంధించిన పోస్టర్ ను కలెక్టర్ కర్జర్ చేతుల మీదుగా లాంచ్ చేశారు. దళితుల బంధు పథకాన్ని వినియోగించుకుని దళితులు ఆర్థికంగా ఎదగడానికి నిదర్శనమని కలెక్టర్ కర్ణన్ కృష్ణను కొనియాడారు. ఈ సినిమా మంచి స్థాయిలో ఆడుతుందని ఆశిస్తున్నాఅని చెప్పుకొచ్చారు. దళిత బందును పైలెట్ ప్రాజెక్టు కింద సీఎం కేసీఆర్ ప్రకటించగా ఇప్పటికే చాలామందికి దళిత బంధు పథకంతో లబ్ధి పొందుతున్నారు. ఈ డబ్బుతో చాలామంది వివిధ వ్యాపారాలు చేసుకుంటున్న నేపథ్యంలో చాలా మంది ఆర్థికంగా నిలదోక్కుకున్నారు.