Daku Maharaj : ‘అఖండ’, ‘వీర సింహా రెడ్డి’, ‘భగవంత్ కేసరి’ వంటి హ్యాట్రిక్ హిట్ సినిమాల తర్వాత బాలయ్య డైరెక్టర్ బాబీ తో కలిసి చేసిన చిత్రం ‘డాకు మహారాజ్’. సూర్య దేవర నాగవంశీ సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మించాడు. ఎంత రిచ్ గా ఈ సినిమాని నిర్మించాడో మనం ట్రైలర్ ని చూసే అర్థం చేసుకోవచ్చు. ఈ చిత్రం జనవరి 12న ప్రపంచవ్యాప్తంగా భారీ లెవెల్ లో విడుదల కానుంది. ఇప్పటికే ఓవర్సీస్ లో అడ్వాన్స్ బుకింగ్స్ మొదలయ్యాయి, రెస్పాన్స్ ఆశించిన స్థాయిలో లేదు. ఈ చిత్రాన్ని కేవలం తెలుగు భాషలో మాత్రమే కాదు, హిందీ, తమిళం మరియు ఇతర ప్రాంతీయ భాషల్లో కూడా రానుంది. కానీ ఇతర భాషల్లో మాత్రం జనవరి 17 న విడుదల కాబోతున్నట్టు కాసేపటి క్రితమే నిర్మాత మీడియా కి సమాచారం అందించాడు.
ఇది ఇలా ఉండగా ఈ సినిమాకి సంబంధించిన ప్రివ్యూ షో రీసెంట్ గానే దుబాయి లో కొంతమంది మీడియా ప్రముఖులకు ప్రత్యేకంగా వేసి చూపించారు. వాళ్ళ నుండి ఈ సినిమాకి మంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. ఇనాళ్ళు బాలయ్య ని ఇంత కొత్తగా ఏ డైరెక్టర్ కూడా చూపించలేదని, ఆయనలోని కొత్త యాంగిల్ ని బయటకి తీసి అద్భుతంగా స్క్రీన్ మీద ప్రెజెంట్ చేసారని, ప్రీ ఇంటర్వెల్ నుండి ఇంటర్వెల్ వరకు అరిచి అరిచి మా గొంతు పోయిందని, అంత అద్భుతంగా ఉందని చెప్పుకొచ్చారట. ఇక సెకండ్ హాఫ్ లో బాలయ్య ఎనర్జీ అనంతం అనే రేంజ్ లో ఉందని, ఎమోషనల్ సన్నివేశాలు సైతం బాగా క్లిక్ అయ్యాయని, సంక్రాంతి ఈ మాత్రం కంటెంట్ ఉంటే చాలు, బాక్స్ ఆఫీస్ వద్ద బాలయ్య కి మరో భారీ హిట్ పడినట్టే అని అన్నారట. బాలయ్య కెరీర్ లో అత్యధిక వసూళ్లను రాబట్టిన చిత్రం ‘వీర సింహా రెడ్డి’.
2023 సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ సినిమా అప్పట్లో సూపర్ హిట్ టాక్ ని తెచ్చుకొని 89 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టింది. ‘డాకు మహారాజ్’ చిత్రానికి పాజిటివ్ టాక్ వస్తే అవలీల గా వంద కోట్ల రూపాయిల షేర్ మార్కుని అందుకుంటుందని, ఆయన కెరీర్ లో అత్యధిక వసూళ్లను రాబట్టిన సినిమాగా నిలుస్తుందని అంటున్నారు. ఇది ఎంత వరకు నిజం అవ్వబోతుందో చూడాలి. ఎందుకంటే ప్రస్తుతానికి ‘డాకు మహారాజ్’ చిత్రానికి ‘గేమ్ చేంజర్’, ‘సంక్రాంతికి వస్తున్నాం’ చిత్రాలకు ఉన్న హైప్, క్రేజ్ లేదు. ‘గేమ్ చేంజర్’ ఈ తరం స్టార్ హీరో అయిన రామ్ చరణ్ శంకర్ లాంటి సెన్సేషనల్ డైరెక్టర్ తో చేసిన భారీ బడ్జెట్ పాన్ ఇండియన్ సినిమా. అదే విధంగా ‘సంక్రాంతికి వస్తున్నాం’ చిత్రం పండగ జానర్ సినిమా. పైగా పాటలు కూడా సెన్సేషనల్ హిట్ అయ్యాయి. అందుకే జనాలు ఎక్కువగా ఈ రెండు సినిమాల కోసమే ఎక్కువగా ఎదురు చూస్తున్నారు.