https://oktelugu.com/

Daaku Maharaj Movie : బెనిఫిట్ షోస్ గ్రాస్ లో ‘గేమ్ చేంజర్’ కి ధీటుగా నిల్చిన ‘డాకు మహారాజ్’..ఎంత గ్రాస్ వసూళ్లు వచ్చాయో చూస్తే ఆశ్చర్యపోతారు!

'గేమ్ చేంజర్' కి బెనిఫిట్ షోస్ కి ఈ ప్రాంతం లో ఏ రేంజ్ రెస్పాన్స్ వచ్చిందో, అదే రేంజ్ రెస్పాన్స్ 'డాకు మహారాజ్' చిత్రానికి కూడా వచ్చింది. ఫుల్ రన్ లో కూడా ఈ చిత్రానికి టాక్ పాజిటివ్ గా వచ్చింది కాబట్టి, 'గేమ్ చేంజర్' కంటే ఎక్కువ వసూళ్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఓవరాల్ గా మొదటి రోజు ఈ సినిమాకి 15 నుండి 20 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వస్తాయట

Written By:
  • Vicky
  • , Updated On : January 12, 2025 / 06:30 PM IST

    Benefit shows gross

    Follow us on

    Daaku Maharaj Movie :  వరుస హ్యాట్రిక్ హిట్స్ తో మంచి ఊపు మీద ఉన్న నందమూరి బాలకృష్ణ నటించిన లేటెస్ట్ చిత్రం ‘డాకు మహారాజ్’ నేడు ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ ప్రేక్షకుల ముందుకొచ్చిన సంగతి తెలిసిందే. మొదటి ఆట నుండే ఈ చిత్రానికి పాజిటివ్ టాక్ వచ్చింది. సినిమా రొటీన్ గానే ఉన్నప్పటికీ, బాలయ్య నుండి ఆయన అభిమానులు, మాస్ ఆడియన్స్ ఏవైతే కోరుకుంటారో, అవన్నీ ఈ సినిమాలో ఉన్నాయి. ఫస్ట్ హాఫ్ కి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. సెకండ్ హాఫ్ ఫ్లాష్ బ్యాక్ ఎందుకో బాగా సాగదీసినట్టు అనిపించింది. క్లైమాక్స్ కూడా అందరూ ఊహించినట్టు గానే ఉంది. ఓవరాల్ గా చూసుకుంటే యావరేజ్ రేంజ్ సినిమా అని చెప్పొచ్చు. కానీ సంక్రాంతికి ఆడియన్స్ ఇలాంటి సినిమాలను బాగా చూస్తారు కాబట్టి కమర్షియల్ గా హిట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.

    ఇకపోతే ఓపెనింగ్స్ కూడా అన్ని ప్రాంతాల్లో ఈ చిత్రానికి భారీగానే వచ్చే అవకాశాలు ఉన్నాయి. నార్త్ అమెరికా లో ఈ సినిమాకి ఏకంగా 7 లక్షల డాలర్స్ ప్రీమియర్ షోస్ నుండి వచ్చాయి అంటేనే అర్థం చేసుకోవచ్చు, బాలయ్య మాస్ బ్యాటింగ్ ఏ రేంజ్ లో ఉంది అనేది. గత మూడు సినిమాలు సూపర్ హిట్ ప్రభావం ఆడియన్స్ లో చాలా బలంగా ఉంది. ఆ కారణం చేతనే ఈ రేంజ్ ఓపెనింగ్స్ వచ్చాయని అంటున్నారు ట్రేడ్ పండితులు. ఇదంతా పక్కన పెడితే సీడెడ్ లో బాలయ్య బాబుకి ఎంతటి స్ట్రాంగ్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఒక విధంగా నందమూరి కుటుంబానికి సీడెడ్ లో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ రావడానికి బాలయ్యనే కారణం అని చెప్పొచ్చు. ప్రభుత్వం బెనిఫిట్ షోస్ క్యాన్సిల్ చేయడం తో నాలుగు గంటల ఆటలను బెనిఫిట్ షోస్ గా మార్చారు మేకర్స్. ఈ షోస్ నుండి అద్భుతమైన గ్రాస్ వసూళ్లు వచ్చాయి.

    ‘గేమ్ చేంజర్’ కి బెనిఫిట్ షోస్ కి ఈ ప్రాంతం లో ఏ రేంజ్ రెస్పాన్స్ వచ్చిందో, అదే రేంజ్ రెస్పాన్స్ ‘డాకు మహారాజ్’ చిత్రానికి కూడా వచ్చింది. ఫుల్ రన్ లో కూడా ఈ చిత్రానికి టాక్ పాజిటివ్ గా వచ్చింది కాబట్టి, ‘గేమ్ చేంజర్’ కంటే ఎక్కువ వసూళ్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఓవరాల్ గా మొదటి రోజు ఈ సినిమాకి 15 నుండి 20 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వస్తాయట. మ్యాట్నీ షోస్ నుండి రెండు తెలుగు రాష్ట్రాల్లో మంచి ఆక్యుపెన్సీ ని నమోదు చేసుకుంది ఈ చిత్రం. ఫుల్ రన్ లో ఈ సినిమా బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకోవాలంటే 75 కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లు రావాలి. అవలీల గా ఆ మార్కుని మొదటి వారం లోనే దాటేస్తుందని, బయ్యర్స్ కి భారీ లాభాలను తెచ్చిపెడుతుందని అంటున్నారు ట్రేడ్ పండితులు.