https://oktelugu.com/

Daku Maharaj : ‘డాకు మహారాజ్’ 4 రోజుల వరల్డ్ వైడ్ వసూళ్లు..4వ రోజు అనేక ప్రాంతాల్లో అర్థరాత్రి షోస్..ఇది మామూలు మాస్ ర్యాంపేజ్ కాదండోయ్!

నందమూరి బాలకృష్ణ నటించిన లేటెస్ట్ చిత్రం 'డాకు మహారాజ్' ఇటీవలే భారీ అంచనాల నడుమ విడుదలై బాక్స్ ఆఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ టాక్ ని సొంతం చేసుకొని రికార్డు స్థాయి వసూళ్లను రాబడుతూ ముందుకు దూసుకుపోతున్న సంగతి తెలిసిందే.

Written By:
  • Vicky
  • , Updated On : January 16, 2025 / 11:53 AM IST

    Daku Maharaj

    Follow us on

    Daku Maharaj : నందమూరి బాలకృష్ణ నటించిన లేటెస్ట్ చిత్రం ‘డాకు మహారాజ్’ ఇటీవలే భారీ అంచనాల నడుమ విడుదలై బాక్స్ ఆఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ టాక్ ని సొంతం చేసుకొని రికార్డు స్థాయి వసూళ్లను రాబడుతూ ముందుకు దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. మొదటి రోజు 50 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టి బాలయ్య కెరీర్ లోనే బిగ్గెస్ట్ ఓపెనర్ గా నిల్చిన ఈ చిత్రం, రెండవ రోజు నుండి కూడా అదే తరహా ఊపుని మైంటైన్ చేస్తుంది. విచిత్రం ఏమిటంటే మొదటి రోజు అర్థరాత్రి షోస్ పడడం ఇది వరకు మనం చూసాము. కానీ నాల్గవ రోజు కూడా ఈ చిత్రానికి అర్థ రాత్రి షోస్ పడ్డాయి. ఉభయ గోదావరి జిల్లాలు, సీడెడ్ ప్రాంతాల్లో ఎక్కువగా ఇలాంటి షోస్ పడ్డాయి. ఓవరాల్ గా ఆరు రోజులకు ఈ చిత్రం వరల్డ్ వైడ్ గా ఎంత వసూళ్లు రాబట్టింది అనేది ఇప్పుడు మనం చూడబోతున్నాం.

    ట్రేడ్ పండితులు అందిస్తున్న సమాచారం ప్రకారం ఈ చిత్రానికి నాల్గవ రోజు దాదాపుగా 9 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. ఉభయ గోదావరి జిల్లాలతో పాటు ఉత్తరాంధ్ర, సీడెడ్ ప్రాంతాల్లో కూడా ఈ చిత్రానికి సంక్రాంతి రోజున ఎలాంటి ఆక్యుపెన్సీలు నమోదు అయ్యాయో, అలాంటి ఆక్యుపెన్సీలు నమోదు అయ్యాయి. మిగిలిన ప్రాంతాల్లో యావరేజ్ రేంజ్ ని సొంతం చేసుకుంది. కానీ ఓవర్సీస్ లో మాత్రం వసూళ్లు దారుణంగా పడిపోయాయి. ముఖ్యంగా నార్త్ అమెరికా లో ప్రీమియర్స్ + మొదటి రోజుకి కలిపి 1.1 మిలియన్ డాలర్ల గ్రాస్ వసూళ్లు మాత్రమే వచ్చాయి. ఆ తర్వాత కేవలం లక్ష డాలర్లు మాత్రమే పెరిగి ప్రస్తుతానికి 1.2 మిలియన్ డాలర్స్ కి చేరుకుంది. బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకోవాలంటే కచ్చితంగా రెండు మిలియన్ డాలర్ల గ్రాస్ రావాల్సిందే. కానీ అది ప్రస్తుతానికి అసాధ్యం అని తెలుస్తుంది.

    డాకు మహారాజ్ ట్రెండ్ చూస్తుంటే కేవలం ఈ వారం వరకే మంచి వసూళ్లు వచ్చేలా అనిపిస్తుంది. వచ్చే సోమవారం నుండి వసూళ్లు బాగా పడిపోవచ్చు. అయితే ఈరోజు రేపటి తో ఈ సినిమా బ్రేక్ ఈవెన్ మార్కుని దాటే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటి వరకు ఈ సినిమాకి ప్రపంచవ్యాప్తంగా 65 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. నేడు రేపు చెరో 5 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వేసుకున్నా బ్రేక్ ఈవెన్ మార్కు ని దాటేస్తుంది. ఓవరాల్ గా ఫుల్ రన్ లో చిత్రం 90 కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లను రాబట్టే అవకాశాలు ఉన్నాయి. ‘గేమ్ చేంజర్’ చిత్రానికి నెగటివ్ టాక్ రావడంతో, ‘సంక్రాంతికి వస్తున్నాం’ చిత్రం తర్వాత ఆడియన్స్ కి ‘డాకు మహారాజ్’ చిత్రం రెండవ ఛాయస్ గా మారిపోయింది. అందుకే ఈ రేంజ్ వసూళ్లు వస్తుందని అనుకోవచ్చు.