
Daggubati Venkatesh: ఒక ప్రక్క రానా నాయుడు సిరీస్ ని తెలుగు జనాలు, ప్రముఖులు తిట్టిపోస్తున్నారు. వెంకటేష్ మాత్రం ఆనందం వ్యక్తం చేశారు. నటుడిగా కొత్త టర్న్ తీసుకున్నట్లు అభిప్రాయపడ్డారు. కెరీర్లో ఫస్ట్ టైం వెంకటేష్ వెబ్ సిరీస్ చేశారు. రానా నాయుడు టైటిల్ తో తెరకెక్కిన ఈ సిరీస్ నెట్ఫ్లిక్స్ లో మార్చి 10 నుండి స్ట్రీమ్ అవుతుంది. దగ్గుబాటి రానా మరో ప్రధాన పాత్ర చేశారు. రానా నాయుడు సిరీస్ కి పూర్తి నెగిటివ్ రివ్యూస్ పడ్డాయి. ముఖ్యంగా తెలుగు ఆడియన్స్ జీర్ణించుకోలేని కంటెంట్ అన్న అభిప్రాయం వెలువడింది.
బూతు పదాలు, బోల్డ్ సీన్స్ పిచ్చెక్కించాయి. వెంకటేష్ ఉన్నాడు కదా అని ఫ్యామిలీ ఆడియన్స్ ఎగబడేరు. పొరపాటున కూడా ఆ సాహసం చేయవద్దంటూ కామెంట్స్ వినిపించారు. సీనియర్ నటి విజయశాంతి రానా నాయుడు సిరీస్ మీద ఫైర్ అయ్యారు. అలాగే మరో సీనియర్ నటుడు శివ కృష్ణ తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేశారు. వెంకటేష్ కెరీర్లో ఎన్నడూ ఈ స్థాయి వ్యతిరేకత చూడలేదు. అయితే ఈ విమర్శలు వెంకటేష్ ని ప్రభావితం చేయలేదు. ఆయన రానా నాయుడు సిరీస్లో నటించడం పట్ల పాజిటివ్ గా స్పందిస్తున్నారు.

తాజాగా వెంకటేష్ మాట్లాడుతూ… వ్యక్తిగతంగా నాకు ఇది కొత్త విషయం. గతంలో ఎన్నడూ ఈ తరహా పాత్రలు చేయలేదు. నేను ఫ్యామిలీ చిత్రాలు హీరోగా మాత్రమే పరిచయం. రానా నాయుడుతో కొత్త టర్న్ తీసుకున్నాను. ఈ పాత్ర నేను చేయగలనని నమ్మిన దర్శక నిర్మాతలకు ధన్యవాదాలు… అని అన్నారు. వెంకటేష్ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. అనంతరం దగ్గుబాటి రానా మాట్లాడారు. బాబాయ్ తో కలిసి నటించడం గొప్ప అనుభూతి. ఒక విభిన్నమైన స్టోరీ చేద్దాం అనుకున్నాము. రానా నాయుడు డిఫరెంట్ ఫ్యామిలీ స్టోరీ… అని అన్నారు.
రానా నాయుడు సిరీస్ హాలీవుడ్ కి చెందిన రే డొనోవన్ సిరీస్ రీమేక్. తండ్రి కొడుకుల మధ్య జరిగే ఎమోషనల్ వార్. క్రైమ్ డ్రామా నేపథ్యంలో చెప్పే ప్రయత్నం జరిగింది. హాలీవుడ్ లో రే డొనోవన్ భారీ సక్సెస్ అయ్యింది. రానా నాయుడు సైతం నెట్ఫ్లిక్స్ లో టాప్ లో ట్రెండ్ అవుతుంది. కాగా వెంకటేష్ నెక్స్ట్ సైంధవ్ టైటిల్ తో మూవీ చేస్తున్నారు. దర్శకుడు శైలేష్ కొలను ఈ మూవీ తెరకెక్కిస్తున్నారు.