Dacoit movie 10 days collections: అడివి శేష్(Adivi Sesh) హీరో గా నటించిన లేటెస్ట్ చిత్రం ‘డెకాయిట్'(Dacoit Movie) భారీ అంచనాల నడుమ విడుదలై మొదటి ఆట నుండే డివైడ్ టాక్ ని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. కానీ బాక్స్ ఆఫీస్ వద్ద ఓపెనింగ్ వసూళ్లు మాత్రం చాలా సాలిడ్ గా వచ్చాయి. ఈ వారం విడుదలైన కొత్త సినిమాలు ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోకపోవడం తో , ఆడియన్స్ కి ఈ సినిమానే మెయిన్ ఛాయస్ గా మారింది. ఫలితంగా రెండవ వీకెండ్ లో కూడా ఈ చిత్రానికి డీసెంట్ స్థాయి గ్రాస్ వసూళ్లు నమోదు అయ్యాయి. 10 రోజుల థియేట్రికల్ రన్ ని పూర్తి చేసుకున్న ఈ చిత్రానికి ప్రాంతాల వారీగా ఎంత వసూళ్లు వచ్చాయో ఒకసారి చూద్దాం.
నైజాం ప్రాంతం నుండి ఈ చిత్రానికి 7 కోట్ల 65 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు నమోదు అయ్యాయి. విడుదలకు ముందు ఈ సినిమాకు ఈ ప్రాంతంలో 7 కోట్ల రూపాయిల ప్రీ రిలీజ్ బిజినెస్ జరగ్గా, 10 రోజుల్లోనే 65 లక్షల రూపాయిల లాభాలు వచ్చాయి. అదే విధంగా సీడెడ్ లో ఈ చిత్రానికి కోటి రూపాయలకు పైగా షేర్ వసూళ్లు నమోదు అయ్యాయి. బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకోవాలంటే మరో 35 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు రావాలి, కానీ అది దాదాపుగా అసాధ్యం అని తెలుస్తోంది. ఇక ఆంధ్ర ప్రదేశ్ లో అయితే ఈ చిత్రానికి 4 కోట్ల 70 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు నమోదు అవ్వగా, ఓవరాల్ గా తెలుగు రాష్ట్రాల నుండి ఈ చిత్రానికి 10 రోజుల్లో 13 కోట్ల 35 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు , 24 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి.
ఇక కర్ణాటక + రెస్ట్ ఆఫ్ ఇండియా నుండి 2 కోట్ల 50 లక్షల రూపాయిల షేర్ వసూళ్లను నమోదు చేఉకోగా, హిందీ వెర్షన్ నుండి 4 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు నమోదు అయ్యాయి. ఇక ఓవర్సీస్ లో అయితే దాదాపుగా 6 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు నమోదు అవ్వగా, ఓవరాల్ వరల్డ్ వైడ్ గా ఈ చిత్రానికి 25 కోట్ల 85 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు , 53 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లు నమోదు అయ్యాయి. బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకొని క్లీన్ సూపర్ హిట్ స్టేటస్ కి చేరుకోవాలంటే ఇంకా 5 కోట్ల 15 లక్షల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టాల్సి ఉంటుంది. మరి ఆ రేంజ్ కి షేర్ వసూళ్లు రాబోయే రోజుల్లో రాబడుతుందా లేదా అనేది చూడాలి.