మాస్క్‌ పెట్టుకో సిన్నప్పా : నారప్ప

సైబరాబాద్‌ పోలీసులు ఎప్పుడూ వినూత్నంగా ఆలోచిస్తూ ప్రజలను ఎడ్యుకేట్ చేస్తూ ఉంటారు. ముఖ్యంగా ట్రాఫిక్‌ రూల్స్‌ సహా కరోనాపై ప్రజలకు అవగాహన కల్పించే కార్యక్రమాలను చాలా కొత్తగా చేస్తున్నారు. అయితే, ఇందుకోసం తాజాగా నారప్ప సినిమాని వాడుకున్న విధానం నవ్వులను పూయిస్తోంది. తాజాగా కరోనా పై అవగాహన పెంచేందుకు ‘నారప్ప’సినిమా డైలాగ్‌ ని పేరడీ చేశారు సైబరాబాద్‌ పోలీసులు. నారప్ప పోస్టర్‌ లోని వెంకటేష్ పేస్ కి ఒక మాస్క్ పెట్టి, ‘ఒక్క విషయం చెబుతాను బాగా […]

Written By: admin, Updated On : July 23, 2021 4:58 pm
Follow us on

సైబరాబాద్‌ పోలీసులు ఎప్పుడూ వినూత్నంగా ఆలోచిస్తూ ప్రజలను ఎడ్యుకేట్ చేస్తూ ఉంటారు. ముఖ్యంగా ట్రాఫిక్‌ రూల్స్‌ సహా కరోనాపై ప్రజలకు అవగాహన కల్పించే కార్యక్రమాలను చాలా కొత్తగా చేస్తున్నారు. అయితే, ఇందుకోసం తాజాగా నారప్ప సినిమాని వాడుకున్న విధానం నవ్వులను పూయిస్తోంది.

తాజాగా కరోనా పై అవగాహన పెంచేందుకు ‘నారప్ప’సినిమా డైలాగ్‌ ని పేరడీ చేశారు సైబరాబాద్‌ పోలీసులు. నారప్ప పోస్టర్‌ లోని వెంకటేష్ పేస్ కి ఒక మాస్క్ పెట్టి, ‘ఒక్క విషయం చెబుతాను బాగా గుర్తుపెట్టుకో సిన్నప్ప.. మాస్క్‌ పెట్టుకో సిన్నప్పా, కరోనా ఇంకా ముగిసిపోలేదు’ అంటూ మీమ్‌ క్రియేట్‌ చేసి వదలడంతో.. మొత్తానికి సోషల్‌ మీడియాలో ఈ పోస్టర్ బాగా వైరల్ అవుతుంది.

ఇలాంటి విషయాల్లో సైబరాబాద్‌ పోలీసులు ఎప్పుడూ ముందుంటారనే చెప్పాలి. స్టార్‌ హీరోల సినిమా పోస్టర్‌లను, అలాగే వారు పలికిన ఫేమస్‌ డైలాగులను ఫన్నీగా ఎడిట్ చేసి.. వాటినే తమకు తగ్గట్టు మారుస్తూ మొత్తానికి జనానికి చెప్పాలనుకున్న అంశాన్ని చాలా స్పష్టంగా చెబుతున్నారు.

అయినా ఇలా ట్రెండ్‌ ని ఫాలో అవుతూ తమదైన శైలీలో పోలీసులు ఇలా సినిమాటిక్ గా ఆలోచించడం గొప్ప విషయమే. అయినా ఇది హైదరాబాద్ పోలీసులకు కొత్తేమి కాదులేండి. గతంలోనూ ఆర్ఆర్ఆర్ పోస్టర్ ను ఇలాగే ఫన్నీగా వదిలారు. బైక్‌ పై ఉన్న ఎన్టీఆర్, రామ్ చ‌ర‌ణ్‌ ల స్టిల్స్ కి హెల్మెట్ అమర్చి, ట్రాఫిక్‌ రూల్స్‌ పై అవగాహన కల్పించిన సంగతి తెలిసిందే.