https://oktelugu.com/

Custody Collections : ‘కస్టడీ’ క్లోసింగ్ కలెక్షన్స్.. కొత్త హీరోకి కూడా ఇంతకంటే మంచి వసూళ్లు వస్తాయిగా!

ట్రేడ్ పండితుల అంచనా ప్రకారం ఈ చిత్రానికి ప్రపంచవ్యాప్తంగా అన్నీ ప్రాంతాలకు కలిపి 24 కోట్ల రూపాయిల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. అందులో ఈ చిత్రానికి కేవలం 6 కోట్ల 45 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు మాత్రమే వచ్చాయి.

Written By:
  • NARESH
  • , Updated On : May 23, 2023 / 10:10 PM IST

    Custody Collections

    Follow us on

    Custody Collections : వరుస ఫ్లాపులతో కొట్టుమిట్టాడుతున్న అక్కినేని ఫ్యామిలీ ని సక్సెస్ స్ట్రీక్ లోకి తీసుకొస్తాడని అభిమానులు నాగచైతన్య పై భారీగానే ఆశలు పెట్టుకున్నారు. కానీ ‘కస్టడీ’ చిత్రం తో వాళ్ళ ఆశలపై నీళ్లు చల్లాడు.విడుదలకు ముందు టీజర్ , ట్రైలర్ తో ప్రేక్షకులను ఎంతో ఆకట్టుకున్న ఈ చిత్రం, విడుదల తర్వాత డివైడ్ టాక్ మీద కనీస స్థాయి వసూళ్లను కూడా రాబట్టలేకపోయింది. ఈ చిత్రానికి తమిళం లో భారీ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన ‘మానాడు’ చిత్ర డైరెక్టర్ వెంకట్ ప్రభు దర్శకత్వం వహించడం తో కచ్చితంగా మినిమం గ్యారంటీ సినిమాగా నిలుస్తుందని ట్రేడ్ కూడా అంచనా వేసింది.

    వెంకట్ ప్రభు మినిమం గ్యారంటీ సినిమానే ఇచ్చాడు, కానీ పూర్తి స్థాయి టాక్ మాత్రం రాలేదు. అక్కినేని ఫ్యామిలీ కి వరుసగా డిజాస్టర్ ఫ్లాప్ సినిమాలు వసుంన్నాయని జనాల్లో నెగటివ్ ఒపీనియన్ ఉండడం వల్లో ఏమో తెలియదు కానీ, ఈ చిత్రం కనీస స్థాయి వసూళ్లను కూడా క్లోసింగ్ లో దక్కించుకోలేకపోయింది.

    ట్రేడ్ పండితుల అంచనా ప్రకారం ఈ చిత్రానికి ప్రపంచవ్యాప్తంగా అన్నీ ప్రాంతాలకు కలిపి 24 కోట్ల రూపాయిల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. అందులో ఈ చిత్రానికి కేవలం 6 కోట్ల 45 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు మాత్రమే వచ్చాయి. డిజాస్టర్ అయితే తప్ప మిగిలిన మీడియం రేంజ్ హీరో సినిమాలకు ఈ స్థాయి క్లోసింగ్ కలెక్షన్స్ అయితే రాదు,కనీసం యావరేజి రేంజ్ మార్క్ కి అయినా తీసుకెళ్ళేవాళ్ళు. కానీ ఒక డీసెంట్ సినిమాకి ఈ రేంజ్ డిజాస్టర్ ఫలితం రావడం అనేది కేవలం ఈ సినిమాకే జరిగింది.

    వరుసగా హిట్టు మీద హిట్టు కొడుతూ మంచి ఊపు మీదున్న నాగ చైతన్య కెరీర్ లో ‘థాంక్యూ’ అనే చిత్రం పెద్ద స్పీడ్ బ్రేకర్ గా నిల్చింది. ఆ చిత్రం తర్వాత వెంటనే ‘కస్టడీ’ చిత్రం కూడా పెద్ద డిజాస్టర్ అవ్వడం తో నాగ చైతన్య కెరీర్ ఇప్పుడు రిస్క్ లో పడింది. ఇప్పుడు ఆయనకీ అర్జంటుగా ఒక భారీ హిట్ కావాలి, ఆ భారీ హిట్ ఇచ్చే డైరెక్టర్ ఎవరో చూడాలి.