Electric SUV : భారతీయ వినియోగదారులలో ఎలక్ట్రిక్ కార్లకు డిమాండ్ వేగంగా పెరుగుతోంది. దీనిని దృష్టిలో ఉంచుకుని ప్రముఖ కార్ల తయారీ కంపెనీలైన హ్యుందాయ్, కియా భారతీయ మార్కెట్‌లోకి అనేక కొత్త ఎలక్ట్రిక్ మోడళ్లను విడుదల చేయడానికి రెడీ అవుతున్నాయి. వీటిలో బడ్జెట్ ఫ్రెండ్లీ సిటీ కార్ల నుంచి ప్రీమియం ఎలక్ట్రిక్ SUVల వరకు అందరికీ ఏదో ఒకటుంది. కంపెనీల నుంచి రాబోయే అలాంటి 4 ఎలక్ట్రిక్ మోడళ్లపై ఒక లుక్కేద్దాం.
Also Read : హ్యుందాయ్ క్రెటా ఈవీ vs మిగతా ఈవీలు.. ఏది బెస్ట్, బ్యాటరీ సామర్థ్యం ఎంత? ఫీచర్స్ ఇవీ
హ్యుందాయ్ ఇన్స్టర్ ఈవీ
హ్యుందాయ్ భారత ఆటోమొబైల్ మార్కెట్‌లోకి ఒక కొత్త ఎలక్ట్రిక్ మైక్రో SUVని ప్రవేశపెట్టాలని యోచిస్తోంది. రాబోయే ఈ ఈవీ కంపెనీ గ్లోబల్‌గా విక్రయిస్తున్న హ్యుందాయ్ ఇన్స్టర్‌పై ఆధారపడి ఉంటుంది. మీడియా నివేదికల ప్రకారం.. హ్యుందాయ్ ఈ ఈవీ వచ్చే ఏడాది (2026) ప్రారంభంలో రిలీజ్ కావొచ్చు. ఇది ఒకసారి ఛార్జ్ చేస్తే 450 కిమీ కంటే ఎక్కువ రేంజ్‌ను అందించగలదని భావిస్తున్నారు.
కియా కారెన్స్ ఈవీ
కియా తన ప్రజాదరణ పొందిన ఎంపీవీ కారెన్స్ ఎలక్ట్రిక్ వేరియంట్‌ను విడుదల చేయడానికి రెడీ అవుతుంది. కియా కారెన్స్ ఈవీని భారతీయ రోడ్లపై అనేకసార్లు టెస్టింగ్ సమయంలో గుర్తించారు. ఈ కియా కారెన్స్ ఈవీ ఒకసారి ఛార్జ్ చేస్తే 473 కిలోమీటర్ల వరకు రేంజ్‌ను అందించగలదు. దీనిని 2025 చివరి నాటికి లేదా 2026 ప్రారంభంలో మార్కెట్లోకి రిలీజ్ చేసే అవకాశం ఉంది.
కియా సైరోస్ ఈవీ
కియా ఇటీవల విడుదల చేసిన సైరోస్ బేస్డ్ ఎలక్ట్రిక్ SUVని విడుదల చేయడానికి ప్లాన్ చేస్తోంది. ఈ ఈవీ మార్కెట్లో టాటా పంచ్ ఈవీ, మహీంద్రా XUV 3XO ఈవీ వంటి కార్లతో పోటీపడుతుంది. ఇది ఒకసారి ఛార్జ్ చేస్తే దాదాపు 400-450 కిలోమీటర్లు ప్రయాణించగలదని చెబుతున్నారు. దీనిని 2026 మొదటి భాగంలో విడుదల చేసే అవకాశం ఉంది.
హ్యుందాయ్ అయోనిక్ 9
హ్యుందాయ్ భారత ర్కెట్‌లోకి ఫ్లాగ్‌షిప్ ఎలక్ట్రిక్ SUV అయోనిక్ 9ని విడుదల చేయడానికి సిద్ధమవుతోంది. ఈ EVలో 110.3 kWh పెద్ద బ్యాటరీని ఉపయోగించనున్నారు. ఇది పూర్తిగా ఛార్జ్ చేస్తే 620 కిమీ రేంజ్‌ను అందిస్తుంది. ఈ EV అల్ట్రా-ఫాస్ట్ 350 kW ఛార్జింగ్‌కు సపోర్టు చేస్తుంది. ఇది కేవలం 24 నిమిషాల్లో 10 నుంచి 80 శాతం వరకు ఛార్జ్ చేయగలదు. దీనిని 2026 ప్రారంభంలో విడుదల చేసే అవకాశం ఉంది.
Also Read : Mahindra నుంచి SUV ఎలక్ట్రిక్ కారు.. ఎలా ఉంటుందో తెలుసా?