Lokesh Kanagaraj: ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో చాలామంది దర్శకులు వాళ్ళని వాళ్ళు స్టార్లుగా ఎలివేట్ చేసుకోవడానికి తీవ్రమైన ప్రయత్నం అయితే చేస్తున్నారు. రాజమౌళి లాంటి దర్శకుడు ఇప్పటివరకు ఒక్క ఫెయిల్యూర్ ని కూడా చవిచూడకుండా వరుస సక్సెస్ లను సాధిస్తూ ముందుకు దూసుకెళ్తుండటం విశేషం…మరి ఆయన లాంటి దర్శకుడు ఇండియన్ సినిమా ఇండస్ట్రీ మరొకరు లేరు అనేది వాస్తవం… ఇక ఆయనతోపాటుగా చాలామంది దర్శకులు సినిమా ఇండస్ట్రీలో సూపర్ సక్సెస్ లను సాధించడానికి తీవ్రమైన కసరత్తులను చేస్తున్నారు. పలు భాషల నుంచి చాలా మంది దర్శకులు సూపర్ హిట్స్ ను అందుకుంటూ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో చెరగని ముద్ర వేస్తున్నారు. ఇక ఇలాంటి క్రమంలోనే తమిళ్ సినిమా ఇండస్ట్రీకి చెందిన లోకేష్ కనకరాజు లాంటి దర్శకుడు సైతం చేసినవి తక్కువ సినిమాలే అయినా చాలా వైవిధ్యమైన కథాంశాలను ఎంచుకుంటూ ముందుకు తీసుకెళ్తూ ఉంటాడు… సినిమా కోసం ఆయన చాలా తక్కువ సమయాన్ని తీసుకొని వీలైనంత తొందరగా సినిమాని రిలీజ్ చేయాలనే ప్రణాళికలు రూపొందించుకుంటూ ఉంటాడు. అయితే ఖైదీ, మాస్టర్, విక్రమ్ లాంటి సినిమాలతో తన సత్తా చాటుకున్న ఆయన ఆ తర్వాత చేసిన లియో ఇప్పుడు రజనీకాంత్ తో చేసిన కూలీ సినిమాలతో ఏ మాత్రం తన సత్తాను చూపించలేకపోయాడు. నిజానికి లోకేష్ చాలా మంచి మేకర్ ఎలాంటి సబ్జెక్ట్ నైనా చాలా ఎఫెక్టివ్ గా స్క్రీన్ మీద ప్రజెంట్ చేయగలిగే దర్శకులలో లోకేష్ కనకరాజు కూడా ఒకరు కావడం విశేషం…
Also Read: ‘ప్యారడైజ్’ లో నాని ని వెన్నుపోటు పొడిచేది ఎవరో తెలుసా..?
మరి అలాంటి వ్యక్తి ఎందుకని సినిమాల మీద పెద్దగా ఫోకస్ చేయడం లేదు. వీలైనంత తొందరగా సినిమాని ఫినిష్ చేసి రిలీజ్ చేయాలని చూస్తున్నాడు. అలా కాకుండా ఇంకాస్త ఎక్కువ సమయం తీసుకున్న పర్లేదు కానీ సినిమాను బాగా చేసి అవుట్ పుట్ బాగా వచ్చేలా చేస్తే ప్రేక్షకులందరు ఆ సినిమాకి బ్రహ్మరథం పడతారు.
అలా కాకుండా వీలైనంత తొందరగా సినిమాను చుట్టేసి రిలీజ్ చేస్తే తక్కువ సమయంలో సినిమా తీశాడు అనే గుర్తింపైతే వస్తుంది కానీ సక్సెస్ మాత్రం రాదు. ఇలా చేయడం వల్ల లోకేష్ అభిమానులు కూడా తీవ్రమైన నిరాశ చెందే అవకాశం కూడా ఉంది…లోకేష్ కనకరాజు మంచి కథను ఎంచుకొని ఎఫెక్టివ్ గా సినిమాలను తీసి సక్సెస్ సాధిస్తే చూడాలని వాళ్ళ అభిమానులు కోరుకుంటున్నారు.
కూలీ సినిమా ఓకే అనిపించినప్పటికి అది లోకేష్ కనకరాజు స్టాండర్డ్ లో వచ్చిన సినిమా అయితే కాదని ఈ మధ్య ఆయన గాడి తప్పుతున్నాడని చాలామంది విమర్శకులు సైతం అతన్ని విమర్శిస్తున్నారు. మరి ఇకమీదట చేయబోయే సినిమాల విషయంలో ఎలాంటి తప్పులు జరగకుండా చూసుకుంటే మంచిదని మరి కొంతమంది సినిమా మేధావులు సైతం చెబుతుండటం విశేషం…