https://oktelugu.com/

Allu Arjun : జానీ మాస్టర్ విషయంలో ఒక న్యాయం.. పుష్ప’కేశవ’ విషయంలో మరో న్యాయం..హద్దులు దాటేస్తున్న అల్లు అర్జున్!

మెగా ఫ్యామిలీ కి బాగా దగ్గర అయిన జానీ మాస్టర్ కి వ్యతిరేకంగా వెళ్తున్నట్టుగా జనాల్లోకి సిగ్నల్స్ పంపేందుకే అల్లు అర్జున్ ఈ వ్యవహారం లో తలదూర్చడాని అంటున్నారు, మరో విశేషం ఏమిటంటే ఆయనే శ్రేష్టి వర్మ చేత కేసు వేయించాడు అని కూడా ఇండస్ట్రీ లో ఒక టాక్ తెగ ప్రచారం సాగుతుంది.

Written By:
  • Vicky
  • , Updated On : September 18, 2024 / 07:33 PM IST

    Allu Arjun's handling of the Johnny Master case

    Follow us on

    ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈమధ్య కాలం లో చాలా తేడాగా ప్రవర్తిస్తున్నాడని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అతను వేస్తున్న ప్రతీ అడుగు మెగా ఫ్యామిలీ ని టార్గెట్ చేస్తున్నట్టుగానే అనిపిస్తున్నాయి. ఇంతలా అతను మెగా ఫ్యామిలీ పై పగ పెంచుకోవడానికి కారణం ఏమిటి?, నీడని ఇచ్చిన చెట్టుని నరికే ప్రయత్నం ఎందుకు చేస్తున్నాడు అంటూ అల్లు అర్జున్ అభిమానులు సైతం సోషల్ మీడియా లో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నంద్యాల లో వైసీపీ పార్టీ కి చెందిన ఎమ్మెల్యే, తన మిత్రుడు శిల్పా రవి కి సపోర్టుగా సరిగ్గా ఎన్నికల ప్రచారానికి చివరి రోజున వెళ్లి సపోర్ట్ చేసి పెద్ద దుమారమే రేపాడు అల్లు అర్జున్. ఇదేంటి అని అడగగా, నేను పార్టీ కి సపోర్ట్ చేయడానికి రాలేదు, నేను ఏ పార్టీ కి చెందిన వాడిని కాదు, కేవలం నా మిత్రుడు కోసమే వచ్చాను, ఆయన పిలవకపోయినా పనిగట్టుకొని మరీ వచ్చాను అని మీడియా ముందు చెప్పుకున్నాడు. దీనిపై సోషల్ మీడియా లో గత మూడు నెలల నుండి పెద్ద ఎత్తున చర్చలు నడుస్తూనే ఉన్నాయి.

    నాగబాబు సైతం దీనిపై పరోక్షంగా తన అసంతృప్తి ని వ్యక్తం చేసాడు. మళ్ళీ దీనిపై ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్ లో అల్లు అర్జున్ కౌంటర్లు ఇవ్వడం, ఆయన మామయ్య సైతం లైవ్ డిబేట్స్ లో కూర్చొని పవన్ కళ్యాణ్ పై విమర్శలు చేయడం. దీనికి జనసేన పార్టీ ఎమ్మెల్యేల నుండి చాలా తీవ్ర స్థాయిలో అల్లు అర్జున్ కి కౌంటర్లు ఇవ్వడం, ఇలాంటి ఘటనలు మొత్తం మనం ఎన్నో చూసాము. ఇప్పుడు లేటెస్ట్ గా అల్లు అర్జున్ జానీ మాస్టర్ వ్యవహారం లో కూడా తలదూర్చడం ఉద్దేశపూర్వకంగా చేసిందే అని అభిమానులు భావిస్తున్నారు. ఇటీవలే శ్రేష్టి వర్మ అనే అమ్మాయి జానీ మాస్టర్ పై లైంగిక వేధింపుల కేసుని పెట్టిన సంగతి మన అందరికీ తెలిసిందే. ఈ క్రమంలో జానీ మాస్టర్ తనకు సినిమా అవకాశాలు రానివ్వకుండా చేస్తాను అంటూ బెదరించినట్టు గా ఆమె చెప్పుకొచ్చింది. దీనిపై అల్లు అర్జున్ వెంటనే స్పందిస్తూ, ఆ అమ్మాయికి అండగా ఉంటానని, తన తదుపరి చిత్రాలలో ఆ అమ్మాయికి కొరియోగ్రఫీ ఛాన్స్ ఇస్తానని ఫిలిం ఛాంబర్ కి తన మ్యానేజర్ చేత చెప్పించాడు.

    జానీ మాస్టర్ జనసేన పార్టీ కి సంబంధించిన నాయకుడు. అంతే కాకుండా మెగా ఫ్యామిలీ కి బాగా దగ్గరైన వాడు. ఆయనని జనసేన పార్టీ నుండి సస్పెండ్ చేసినప్పటికీ కూడా ఇప్పటికీ వైసీపీ పార్టీ జానీ మాస్టర్ విషయం లో జనసేన పై విమర్శలు చేస్తూనే ఉంది. ఇలాంటి సమయంలో అల్లు అర్జున్ ఆ అమ్మాయికి అండగా నిలబడుతున్నాను అంటూ ముందుకు రావడం వెనుక కచ్చితంగా చెడు ఉద్దేశ్యం ఉంది అని మెగా ఫ్యాన్స్ అంటున్నారు. ఎందుకంటే ప్రస్తుతం ‘పుష్ప 2’ లో జగదీశ్(కేశవ) అనే వ్యక్తిపై కూడా ఇలాంటి లైంగిక వేధింపుల కేసులు ఉన్నాయి. అతనిని అల్లు అర్జున్ & టీం బెయిల్ మీద బయటకి తీసుకొచ్చి షూటింగ్ చేయిస్తున్నాడు. అన్యాయం పై స్పందించే గొప్ప మనసు ఉన్న అల్లు అర్జున్ ,జగదీశ్ ని తన సినిమాలో ఎందుకు తీసుకున్నాడు అనేది ఇప్పుడు పెద్ద ప్రశ్న. కేవలం వార్తల్లో నిలిచేందుకు, మెగా ఫ్యామిలీ కి బాగా దగ్గర అయిన జానీ మాస్టర్ కి వ్యతిరేకంగా వెళ్తున్నట్టుగా జనాల్లోకి సిగ్నల్స్ పంపేందుకే అల్లు అర్జున్ ఈ వ్యవహారం లో తలదూర్చడాని అంటున్నారు, మరో విశేషం ఏమిటంటే ఆయనే శ్రేష్టి వర్మ చేత కేసు వేయించాడు అని కూడా ఇండస్ట్రీ లో ఒక టాక్ తెగ ప్రచారం సాగుతుంది.