
సుక్కు అలియాస్ క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ ప్రస్తుతం అయోమయంలో ఉన్నాడట. పుష్ప సినిమాలో ఒక మంచి పవర్ ఫుల్ పోలీస్ పాత్ర ఒకటి రాసుకున్నాడు. ఒక విధంగా బన్నీ తరువాత ఆ రేంజ్ క్యారెక్టర్ అట ఆ పోలీస్ పాత్ర. అందుకే మొదటినుండి ఆ పాత్ర కోసం ఓ స్టార్ కావాలంటూ… మొత్తానికి విజయ్ సేతుపతిని ఒప్పించాడు. కానీ కరోనా దెబ్బకు ప్లాన్ తలక్రిందులైంది. కరోనా లేకపోయి ఉండి ఉంటే.. విజయ్ సేతుపతి ఈ సినిమాలో నటించేవాడే. కానీ డేట్స్ ఎడ్జెస్ట్ కాకనే పుష్ప సినిమా నుండి తప్పుకోవాల్సి వచ్చింది. దాంతో విజయ్ సేతుపతి రోల్ పై సుకుమార్ కి ఉన్న క్లారిటీ మిస్ అయిందట. కేవలం విజయ్ సేతుపతినే ఊహించుకుని ఆ పాత్రను రాసుకున్నాడట.
Also Read..షూటింగ్ కు రెడీ అవుతున్న పుష్ప..!
దాంతో కథ మళ్లీ మొదటికి వచ్చింది. అసలుకే సుక్కు ఒక పాత్రకు నటుడిని సెలెక్ట్ చేయడానికి బోలెడు టైం తీసుకుంటాడు. దానికితోడు కరోనా.. మరీ ఇప్పటికిప్పుడు విజయ్ సేతుపతి ప్లేస్ లో ఆ స్థాయి హీరోని ఎవర్ని ఒప్పించాలి. ఓ దశలో నారా రోహిత్ కోసం ప్రయత్నాలు చేశారు. కానీ, రోహిత్ పుష్ప సినిమాలో నటించడానికి పెద్దగా ఆసక్తి చూపించలేదు. రోహిత్ నే చేయడానికి ఇంట్రస్ట్ చూపించకపోతే ఇక ఏ హీరో చేయడానికి రెడీగా ఉంటాడు అనే మీమాంసలోనే సుక్కు గత కొన్ని రోజులుగా ఆలోచనలో పడ్డాడట. పైగా త్వరలో మొదలెట్టబోయే షెడ్యుల్ లో విజయ్ సేతుపతి రోల్ కి సంబధించిన సీన్స్ ఉన్నాయి కాబట్టి.. ఈ లోపే సాధ్యమైనంత త్వరగా ఆ పాత్రకు ఓ స్టార్ ను ఫిక్స్ చేసుకోవాలి.
Also Read..బన్నీని ఢీకొట్టడానికి వస్తున్న బాలీవుడ్ నటుడు..!
ఈ క్రమంలోనే సుకుమార్ చాలామందినే చూశాడు. అందులో భాగంగానే మాధవన్ ను తీసుకోబోతున్నారని వార్తలు వచ్చాయి. ఆ తరువాత ఈ పాత్రలో వివేక్ ఒబెరాయ్ ను తీసుకోవాలనుకున్నారు. అది కుదలేదు. మధ్యలో తమిళ హీరో ఆర్య కోసం ప్రయత్నాలు చేసినా.. ఆర్య నో చెప్పినట్లు తెలుస్తోంది
మొత్తంగా ఇప్పుడు ఒక హీరో కోసం ముమ్మరంగా చూస్తున్నారు సుకుమార్ అండ్ హిజ్ పుష్ప టీమ్. మరి వారికి ఏ హీరో దొరుకుతారో చూడాలి. ఇక ఈ చిత్రంలో బన్నీకి జోడీగా క్యూట్ బేబీ రష్మిక మందన్న నటిస్తోంది. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించనున్నారు.
మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్