Homeఎంటర్టైన్మెంట్Tollywood Trends : టుడే వైరల్ అవుతున్న క్రేజీ అప్ డేట్స్

Tollywood Trends : టుడే వైరల్ అవుతున్న క్రేజీ అప్ డేట్స్

Tollywood Trends : టాలీవుడ్ ట్రెండ్స్ నుంచి ప్రజెంట్ క్రేజీ అప్ డేట్స్ విషయానికి వస్తే… త‌మిళ స్టార్ హీరో విశాల్‌కు మద్రాస్ హైకోర్టులో చుక్కెదురైంది. లైకా ప్రోడ‌క్షన్ సంస్థ నుంచి హీరో విశాల్ తీసుకున్న రుణానికి సంబంధించిన కేసుపై విచారణ జరిపిన హైకోర్టు.. లైకా సంస్థ‌కు మూడు వారాల్లోగా రూ. 15 కోట్లు డిపాజిట్ చేయాల‌ని నటుడు, నిర్మాత విశాల్‌ను మద్రాస్‌ హైకోర్టు ఆదేశించింది. ఈ కేసు తదుపరి విచార‌ణ‌ను ఈ నెల 22కు వాయిదా వేసింది.

actor vishal
actor vishal

ఇక మరో అప్ డేట్ ఏమిటంటే.. సినిమా రంగం ఒక కుటీర పరిశ్రమ దాన్ని ఒక పరిశ్రమగా గుర్తించాలని నందమూరి బాలకృష్ణ కోరారు ఇదే విషయంపై తాము చిత్ర పరిశ్రమ నుంచి చాలా సార్లు ప్రభుత్వాలను వేడుకున్నామన్నారు. సినిమా పరిశ్రమ చాలా గొప్పదన్నారు. అఖండ వంటి చిత్రాల ద్వారా సినీ ఇండస్ట్రీ చాలా గొప్పదనే విషయం

NBK
NBK

ఇక ఇంకో అప్ డేట్ ఏమిటంటే.. విడుదల దగ్గర పడుతున్న కొద్దీ RRR ప్రచారాలు జోరందుకుంటున్నాయి. ఈక్రమంలో రేపు ‘ఎత్తర జెండా’ పాట విడుదల కాబోతోంది. చాలామంది ఈ పాట ఏదో ఒక సీన్‌ తర్వాత వస్తుందనుకుంటున్నారు. అయితే ఈ పాట కథలో భాగం కాదు. కేవలం ప్రమోషన్‌ కోసం వాడుకుంటున్నారు. మగధీరలో ‘అనగనగా’ పాటలా, RRR ఎండ్‌ టైటిల్స్‌ అప్పుడు వస్తుందట. ఎలాగో అలియా భట్‌ పాత్ర నిడివి తక్కువ కాబట్టి ఇలా పాటలో నాలుగు స్టెప్పులు కూడా వేయించారు.

rrr
rrr

మరో అప్ డేట్ ఏమిటంటే.. తాను ప్రేమలో ఉన్నట్లు బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే ఓ ఇంటర్వ్యూలో చెప్పేసింది. కొన్నిరోజులుగా హీరో ఇషాన్ ఖట్టర్‌తో ఈ భామ సన్నిహితంగా ఉంటోంది. దానిపై తొలిసారిగా నోరు విప్పింది. అయితే అతడి పేరు మాత్రం చెప్పలేదు. ‘నా మీద అతడి ప్రభావం ఎక్కువగా ఉంది. అతనిది ప్రేమించే వ్యక్తిత్వం. నాకెప్పుడూ సహకరిస్తూ ఉంటాడు. అతడిని ప్రేమిస్తున్నా. నేను లక్కీ’ అని చెప్పింది.

Sekhar
Sekhar
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.
Exit mobile version