https://oktelugu.com/

Tiger Nageswara Rao Movie New Update: ‘టైగర్ నాగేశ్వరరావు’ నుంచి క్రేజీ అప్ డేట్

Tiger Nageswara Rao Movie New Update: ఇండియన్ రాబిన్ హుడ్ గా పేరుగాంచిన స్టువర్ట్‌ పురానికి చెందిన వ్యక్తి ‘టైగర్ నాగేశ్వరరావు’. 1980 – 90 దశకాల్లో స్టూవర్టుపురం గజదొంగగా నేషనల్ లెవల్లో పేరు తెచ్చుకున్నాడు. మరి అలాంటి టైగర్ నాగేశ్వరరావు బయోపిక్ లో మాస్ మహారాజ్ రవితేజ హీరోగా నటిస్తున్నాడు. కాగా ఈ సినిమా నుంచి లేటెస్ట్ అప్ డేట్ వచ్చింది. ఈ సినిమా ముహూర్తం, ప్రీలుక్ ఏప్రిల్ 2న మధ్యాహ్నం 12.06 గంటలకు […]

Written By:
  • Shiva
  • , Updated On : March 31, 2022 / 02:13 PM IST
    Follow us on

    Tiger Nageswara Rao Movie New Update: ఇండియన్ రాబిన్ హుడ్ గా పేరుగాంచిన స్టువర్ట్‌ పురానికి చెందిన వ్యక్తి ‘టైగర్ నాగేశ్వరరావు’. 1980 – 90 దశకాల్లో స్టూవర్టుపురం గజదొంగగా నేషనల్ లెవల్లో పేరు తెచ్చుకున్నాడు. మరి అలాంటి టైగర్ నాగేశ్వరరావు బయోపిక్ లో మాస్ మహారాజ్ రవితేజ హీరోగా నటిస్తున్నాడు. కాగా ఈ సినిమా నుంచి లేటెస్ట్ అప్ డేట్ వచ్చింది. ఈ సినిమా ముహూర్తం, ప్రీలుక్ ఏప్రిల్ 2న మధ్యాహ్నం 12.06 గంటలకు ఫిక్స్ చేశారు.

    Tiger Nageswara Rao Movie New Update

    ఏది ఏమైనా టైగర్ నాగేశ్వరరావు విషయాలు బాగా ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి. పైగా రవితేజ హీరో.. కాబట్టి ఈ సినిమా పై ప్రేక్షకుల్లో ఆసక్తి పెరగడం ఖాయం. ఇక ఈ బయోపిక్ లో రవితేజ సరసన బోల్డ్ హీరోయిన్ పాయల్ రాజ్ పుత్ హీరోయిన్ గా నటిస్తోందని ఇప్పటికే వార్తలు వచ్చాయి. అన్నట్టు ‘దొంగాట, కిట్టు ఉన్నాడు జాగ్రత్త’ లాంటి బిలౌవ్ ఏవరేజ్ సినిమాలు తీసిన డైరెక్టర్ ‘వంశీకృష్ణ’ ఈ సినిమాకి దర్శకత్వం వహించబోతున్నాడు.

    Also Read:Chiranjeevi Comments On Mission Impossible Producer: ఇన్నాళ్లకు ఓ మంచి నిర్మాతని చూశాను – మెగాస్టార్

    నిజానికి ఈ ‘టైగర్ నాగేశ్వర్రావు’ బయోపిక్ ఎప్పుడో మూడు సంవత్సరాల క్రితం మొదలవ్వాలి. మొదట ఈ సినిమాలో రానాని హీరోగా అనుకున్నారు. రానా కూడా సినిమా చేయడానికి అంగీకరించాడు. రానా పై కొన్ని సన్నివేశాలకు సంబంధించిన షూటింగ్ కూడా చేశారు. అయితే, షూట్ చేసిన తరువాత ఆ పార్ట్ రానాకీ నచ్చలేదు. దాంతో రానా ఈ సినిమా నుండి తప్పుకున్నాడు.

    Tiger Nageswara Rao Movie New Update

    ఆ తర్వాత బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా ఈ సినిమాను చేయాలనుకున్నారు. కాకపోతే, బెల్లంకొండ కూడా కథలో లోపాలు ఉన్నాయంటూ.. మొత్తానికి మధ్యలోనే ఈ సినిమా నుండి డ్రాప్ అయిపోయాడు. ఇక అప్పటి నుండి నేటి వరకు ఈ సినిమా హీరో పై అనేక రూమర్లు వినిపిస్తూనే ఉన్నాయి. మొత్తానికి రవితేజ ఈ సినిమాలో హీరోగా చేయడానికి ఒప్పుకున్నాడు.

    మరి రవితేజకు ఈ ‘టైగర్ నాగేశ్వర రావు’ ఎంతవరకూ హిట్ ని ఇస్తాడు అనేది చూడాలి. సినిమాలో అయితే, హీరో పాత్ర దొంగతనం చేసే సీన్స్ చాలా కామెడీగా ఉంటాయట. దర్శకుడు వంశీ ఈ సినిమాని ఔట్ అండ్ ఔట్ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ గా ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నాడు. తమిళ మ్యూజిక్ సెన్సేషన్ జివి.ప్రకాష్ ఈ చిత్రాన్ని సంగీతం అందిస్తున్నాడు.

    Also Read: Megastar Chiranjeevi: చిరంజీవి ప‌క్క‌న హీరోయిన్ గా, త‌ల్లిగా న‌టించింది ఎవ‌రో తెలుసా..?

    Tags