Telangana Cabinet Expansion: తెలంగాణలో కూడా మంత్రివర్గ విస్తరణ జరిగే అవకాశాలున్నాయి. ఈ మేరకు కేసీఆర్ ప్రత్యేక దృష్టి సారించారు. శాసనసభ సమావేశాలు, యాదాద్రి ఆలయ ప్రారంభం తదితర కార్యక్రమాలుండటంతో మంత్రివర్గ విస్తరణ వాయిదా పడుతూ వచ్చింది. దీంతో ఇప్పుడు మంత్రివర్గ విస్తరణ చేపట్టాలని ముమ్మరంగా ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. మంత్రివర్గ విస్తరణకు శ్రీకారం చుట్టనున్నట్లు భావిస్తున్నారు.

ఇప్పటికే ఆశావహులు ప్రగతి భవన్ చుట్టూ ప్రదక్షిణలు కొడుతున్నారు. తెలంగాణ మంత్రివర్గంలో కొత్తగా నలుగురిని తీసుకునేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. మరోవైపు ఐదుగురు మంత్రులకు ఉద్వాసన పలకనున్నట్లు సమాచారం. అందరు ఎర్రవెల్లి ఫాంహౌస్ కు సైతం వెళుతూ అధినేత కేసీఆర్ ప్రాపకం కోసం వెళ్తున్నట్లు చెబుతున్నారు.
Also Read: AP High Court: బ్రేకింగ్: ఏపీలో 8మంది ఐఏఎస్ లకు జైలు శిక్ష
కేబినెట్ విస్తరణకు సీఎం ముహూర్తం ఖరారు చేసుకోవడంతో ఉగాది తరువాత ఏప్రిల్ మొదటి వారంలో కానీ రెండో వారంలో కానీ మంత్రివర్గ విస్తరణ చేపట్టే సూచనలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతమున్న మంత్రుల్లో ఐదుగురిని తొలగించి వారి స్థానంలో నలుగురికి అవకాశం ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే మంత్రులు వారి పనితీరు మార్చుకోవాలని సూచించినా వారు మారకపోవడంతో వారికి ఉద్వాసన పలికేందుకే నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.

ఉత్తర తెలంగాణ నుంచి ఇద్దరు, దక్షిణ తెలంగాణ నుంచి ఇద్దరికి మంత్రివర్గంలో చోటు దక్కనుంది. నగరానికి చెందిన ఇంకో మంత్రికి కూడా ఉద్వాసన తప్పదనిపిస్తోంది. మంత్రివర్గంలో మహిళలకు కూడా ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు సమాచారం. జోగు రామన్న, కడియం శ్రీహరి, పల్ల రాజేశ్వర్ రెడ్డి లేదా సండ్ర వెంకటవీరయ్య, దాస్యం వినయ్ భాస్కర్, దానం నాగేందర్ కు మంత్రులుగా తీసుకునే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. దీంతో మంత్రివర్గ విస్తరణపై కేసీఆర్ కసరత్తు చేస్తున్నారని చెబుతున్నారు.
Also Read: Senior NTR assets : సీనియర్ ఎన్టీఆర్ ఆస్తులెన్ని? అవి ఏమైపోయాయో తెలుసా?