Chiranjeevi Comments On Mission Impossible Producer: టాలెంటెడ్ బ్యూటీ తాప్సీ పన్ను తెలుగులో చాలా గ్యాప్ తర్వాత చేస్తోన్న తెలుగు సినిమా`మిషన్ ఇంపాజిబుల్`. కాగా ‘మిషన్ ఇంపాజిబుల్’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిన్న ఘనంగా జరిగింది. ఈ ఈవెంట్ కి మెగాస్టార్ చిరంజేవి ముఖ్య అతిధిగా వచ్చారు. ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ “నిర్మాత నిరంజన్ రెడ్డి ఒక పక్క ‘ఆచార్య’ చేస్తూ, మరో పక్క ‘మిషన్ ఇంపాజిబుల్’ సినిమా చేశారని తెలిసి నేను ఆశ్చర్యపోయాను.
నేను ఇప్పటికే ఈ సినిమాని చూడటం జరిగింది. నాకు అద్భుతంగా అనిపించింది. తాప్సి చాలా మంచి పాత్రలో కనిపించింది. దర్శకుడు స్వరూప్ ఇప్పటికే తన దర్శకత్వ పనితనాన్ని నిరూపించుకున్నారు. ఈ సినిమాతో మళ్ళీ తను ఘనంగా నిరూపించుకున్నాడు. ఇందులో చిన్న పిల్లలు ఉండొచ్చు.. కానీ, ఇది చిన్న సినిమా కాదు. నిర్మాతలు కథలోనూ, సినిమా ప్రయాణంలోనూ లీనం కావాలి.
Also Read: Megastar Chiranjeevi: చిరంజీవి పక్కన హీరోయిన్ గా, తల్లిగా నటించింది ఎవరో తెలుసా..?
నిర్మాత డబ్బు పెట్టే ఓ ఫైనాన్షియర్‌గా మారిపోతున్న రోజులివి. అశ్వనీదత్, అల్లు అరవింద్, కె. ఎస్.రామారావు, దేవీప్రసాద్… వీళ్లంతా సినిమాల్లో అన్నింట్లోనూ లీనమయ్యేవారు. అందుకే వాళ్లు అంత గొప్ప చిత్రాలు తీయగలిగారు. మేము చేయగలిగాము. మళ్లీ ఇన్నాళ్ల తర్వాత నిరంజన్ రూపంలో ఓ మంచి అభిరుచిగల నిర్మాతని నేను చూశాను.
పెద్ద మనసుతో ఈ సినిమా చూస్తే ఇందులో మంచి హృదయం కనిపిస్తుంది. నన్ను నమ్మి వెళితే నిరుత్సాహపడరనే భరోసా ఇస్తున్నా. ఇక ‘ఆర్. ఆర్.ఆర్’ భారతీయ పరిశ్రమ గర్వించే సినిమా అయ్యింది. ‘మిషన్ ఇంపాజిబుల్ తరహా సినిమాల్ని ఆదరిస్తే అందరిలోనూ ఉత్సాహం వస్తుంది” అంటూ చిరంజీవి చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈ స్పీచ్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది.
కాగా మిషన్ ఇంపాజిబుల్` చిన్న చిత్రమే అయినా.. సినిమాలో కంటెంట్ పరంగా గొప్ప సినిమా అని ఇప్పటికే ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది. అందుకే.. ‘మిషన్ ఇంపాజిబుల్` రిలీజ్ విషయంలో మేకర్స్ అస్సలు కాంప్రమైజ్ కావడం లేదు. ఇక ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ` చిత్రంతో మంచి హిట్ కొట్టిన టాలెంటెడ్ డైరెక్టర్ స్వరూప్ ఆర్.ఎస్.జె ఈ సినిమాని డైరెక్ట్ చేస్తున్నాడు.
తెలుగు ఇండస్ట్రీలో ప్రముఖ నిర్మాణ సంస్థల్లో ఒకటైన మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్స్ పై నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి సంయుక్తంగా ఈ సినిమాని నిర్మిస్తున్నారు. దీపక్ యరగర సినిమాటోగ్రాఫర్ గా చేస్తుంటే.. మార్క్ కె రాబిన్ సంగీతం అందిస్తున్నాడు.