Pushpa 2: సౌత్ సినిమాలు ఈమధ్య పాన్ ఇండియా లెవల్లో రికార్డులు సృష్టిస్తున్నాయి. ఇందులో తెలుగు నుంచి ‘పుష్ప’ బాక్సాపీస్ వద్ద బద్దలు కొట్టింది. అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్లో వచ్చిన ‘పుష్ప’ తెలుగులోనే కాకుండా హిందీలోనూ బ్లాక్ బస్టర్ మూవీల సరసన చేరింది. ఇక బన్నీ నటనకు బాలీవుడ్ నుంచి కూడా ఫ్యాన్స్ విపరీతంగా పెరిగాయి. అంతేకాకుండా ఈ సినిమా మాస్ యాంగిల్ హిందీ ప్రేక్షకులకు విపరీతంగా నచ్చింది. ఈ సినిమా ప్రారంభంలోనే పార్ట్ 2 ఉంటుందని సుక్కు అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే. దీంతో రెండో భాగం కోసం ఆడియన్స్ ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్నారు. అయితే ఇటీవల ‘పుష్ప ది రూల్’ షూటింగ్ స్ట్రాట్ అయింది. అందుకు సంబంధించిన అప్డేట్ ఫొటో ఫ్యాన్స్ కు గూస్ బంప్స్ తెప్పిస్తున్నాయి.

ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో ఎన్నో సినిమాలు వచ్చాయి. కానీ ‘పుష్ప’లో చూపించిన తీరు అందరినీ ఆకట్టుకుంది. ముఖ్యంగా బన్నీ కూలీగా కనిపించి పాత్రకు కొత్తదనాన్ని తెచ్చాడు. దీంతో ‘పుష్ప’ను తెలుగు ప్రేక్షకులే కాకుండా తమిళం, మలయాళం, హిందీ వాళ్లు ఆదరించారు. కేరళలో ఇప్పటికే ఫ్యాన్స్ ఉన్న బన్నీకి ‘పుష్ప’తో మరింత క్రేజ్ పెరిగింది. దీంతో నెక్ట్స్ ఫిలిం కోసం ఈగర్ ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. ఈ తరుణంలో చిత్రం యూనిట్ అల్లు అర్జున్ కు సంబంధించిన ఓ ఫొటోను రిలీజ్ చేసింది.
ఇందులో బన్నీ కొత్తగా కనిపిస్తున్నాడు. ‘పుష్ప’ పార్ట్ వన్ లో అల్లు అర్జున్ కూలీగా కనిపించాడు. చివరిలో వ్యాపారవేత్తగా మారిపోతాడు. అయితే ‘పుష్ప 2’లో బన్నీ ఫారెస్ట్ మొత్తం తన కంట్రోల్ లో పెట్టుకునే వ్యక్తిగా కనిపించే అవకాశం ఉంది. అంటే గడ్డం, చింపిరి జుట్టులోనే ఓ బడా నాయకుడిగా ఉంటాడనిపిస్తోంది. కొన్ని రోజుల కిందట అల్లు అర్జున్ తన ట్విట్టర్లో ఓ ఫొటోను పెట్టాడు. ఆ పిక్ తో ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అయ్యారు. ఇప్పుడు మరో ఫొటోను సినిమాటోగ్రాఫర్ మిరోస్లా బ్రోజెక్ షేర్ చేశాడు.

దీంతో పాన్ ఇండియా లెవల్లో ఎదురుచూస్తున్న ఫ్యాన్స్ కు మంచి అప్డేట్ ఇచ్చినట్లయింది. ‘పుష్ప ది రూల్’ చిత్రీకరణ పనులు అక్టోబర్ 30న ప్రారంభం కాగా.. తాజాగా ‘అడ్వెంజర్ మొదలైంది.. థ్యాంక్స్ టూ ఐకాన్ స్టార్’ అంటూ మిరోస్లా బ్రోజెక్ చేసిన ఫొటో వైరల్ గా మారింది. ఇక ‘పుష్ప’ మొదటి భాగం ఇప్పటికే ఎన్నో అవార్డులు గెలుచుకుంది. ఫిలింఫేర్ 67 ఫంక్షన్లో ఏకంగా 7 అవార్డులను సొంతం చేసుకుంది. అమెరికాలో గ్రాండ్ మార్సల్ గా బన్నీ వ్యవహరించాడు. ఇటీవలే ఇండియన్ ఆఫ్ ది ఇయర్ అవార్డును గెలుచుకుంది. దీంతో ‘పుష్ప 2’ పై కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి.