Pawan Kalyan OG
Pawan Kalyan OG: ప్రస్తుతానికి పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో బిజీ. మరో మూడు నెలల్లో ఏపీలో సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. తెలుగుదేశం పార్టీతో పొత్తులో ఉన్న జనసేనాని ఉమ్మడి కార్యాచరణలో భాగంగా రాజకీయ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఈ క్రమంలో ఆయన నటిస్తున్న సినిమాలు తాత్కాలికంగా ఆగాయి. హరి హర వీరమల్లు, ఉస్తాద్ భగత్ సింగ్, ఓజీ సెట్స్ పై ఉన్న విషయం తెలిసిందే. కాగా ఈ మూడు ప్రాజెక్ట్స్ లో ఓజీ పై విపరీతమైన అంచనాలు ఉన్నాయి. యంగ్ డైరెక్టర్ సుజీత్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.
ఆ మధ్య విడుదలైన ప్రోమో ఇండస్ట్రీని షేక్ చేసింది. కత్తితో ఊచ కోస్తున్న గ్యాంగ్ స్టర్ గా పవన్ కళ్యాణ్ గూస్ బంప్స్ లేపాడు. పీరియాడిక్ యాక్షన్ గ్యాంగ్ స్టర్ డ్రామాగా ఓజీ తెరకెక్కుతుంది. కాగా ఈ సినిమా గురించి ఓ క్రేజీ న్యూస్ ఇండస్ట్రీ లో చక్కర్లు కొడుతుంది. పవన్ కళ్యాణ్ నటుడే కాదు. ఆయన దర్శకుడు, స్టంట్ కొరియోగ్రాఫర్ కూడాను. పవన్ కళ్యాణ్ లో ఉన్న మరో టాలెంట్ సింగింగ్. చాలా సినిమాల్లో పవన్ కళ్యాణ్ పాటలు పాడారు.
తెలుగు జానపదాలను ఆయన తన సినిమాల్లో స్వయంగా పాడుతూ ఉంటారు. తమ్ముడు, ఖుషి, జానీ, గుడుంబా శంకర్ తో పాటు పలు చిత్రాల్లో పవన్ కళ్యాణ్ సాంగ్స్ పాడారు. అత్తారింటికి దారేది మూవీలో పవన్ కళ్యాణ్ పాడిన ‘కాటమరాయుడా కదిరీ నరసింహుడా’ సాంగ్ వెరీ ఫేమస్. కాగా పవన్ కళ్యాణ్ మరోసారి తన గొంతు సవరించనున్నారట. ఓజీ మూవీలో ఆయన ఇదే తరహాలో ఓ పాట పాడనున్నారట. కథలో భాగంగా వచ్చే ఓ సన్నివేశంలో పవన్ కళ్యాణ్ పాట పాడతారట.
ఈ మేరకు ఓ న్యూస్ వైరల్ అవుతుంది. మరి ఇదే నిజం అయితే థియేటర్స్ దద్దరిల్లడం ఖాయం. ఫ్యాన్స్ రచ్చ మామూలుగా ఉండదు. ఓజీ మూవీని ఆర్ ఆర్ ఆర్ ప్రొడ్యూసర్ దానయ్య నిర్మిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ చేతులు మారనుందనే పుకార్లు వినిపించాయి. కాదని నిర్మాతలు క్లారిటీ ఇచ్చారు. ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్. థమన్ సంగీతం అందిస్తున్నారు. ఈ ఏడాది విడుదల కానుంది.