Sri Lanka vs Zimbabwe : ఊహించని షాక్.. లంకను చిత్తుగా కొట్టిన జింబాబ్వే

కానీ శ్రీలంక బౌలర్లు జింబాబ్వే బ్యాట్స్మెన్స్ ని కట్టడి చేయడంలో చాలా వరకు ఫెయిల్ అయ్యారు అందుకే ఈ విజయం జింబాబ్వే టీమ్ సొంతమైంది...

Written By: NARESH, Updated On : January 17, 2024 5:54 pm
Follow us on

Sri Lanka vs Zimbabwe : జింబాబ్వే టూర్ ఆఫ్ శ్రీలంక గా సాగుతున్న ఈ టూర్ లో మూడు వన్డేలు, మూడు టి20 మ్యాచ్ లను ఆడడానికి ఈ రెండు టీంలు రెడీ అయ్యాయి. అందులో భాగంగానే మొదట వన్డే సిరీస్ ని ఆడారు. వన్డే మూడు వన్డే ల్లో మొదటి మ్యాచ్ రద్దు అవ్వగా, రెండు,మూడోవ మ్యాచ్ లను శ్రీలంక టీం గెలుచుకుంది.

ఇక మొదటి టీ20 మ్యాచ్ లో కూడా శ్రీలంక టీం తమ ఆధిపత్యాన్ని చూపిస్తూ మంచి విజయాన్ని అందుకుంది. అయితే రెండో టీ20 మ్యాచ్ లో మాత్రం జింబాబ్వే టీమ్ శ్రీలంకకు షాకిచ్చింది. ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన శ్రీలంక టీమ్ నిర్ణీత 20 ఓవర్లకు 173 పరుగులు చేసింది. ఇక దాంతో సెకండ్ బ్యాటింగ్ చేసిన జింబాబ్వే టీమ్ ఇంకా ఒక బాల్ మిగిలి ఉండగానే ఆరు వికెట్లు కోల్పోయి 178 పరుగులు చేసి భారీ విజయాన్ని అందుకుంది. ఇక దీంతో 3 టి 20 మ్యాచ్ ల్లో రెండు టీమ్ లు తలో విజయాన్ని అందుకొని సిరీస్ సమమైంది.

ఇంకొక మ్యాచ్ లో ఎవరు విజయం సాధిస్తే వాళ్ళకి టి20 సిరీస్ దక్కుతుంది. అయితే రెండవ టి20 మ్యాచ్ జింబాబ్వే ప్లేయర్ అయిన కరిగ్ ఏర్విన్ 70 పరుగులు చేసి శ్రీలంకన్ బౌలర్లను ఉతికి ఆరేసాడనే చెప్పాలి. ఇక ఆయన భారీ పరుగులు చేయడంతో ఇంతటి భారీ లక్ష్యాన్ని అందుకోవడంలో జింబాబ్వే టీమ్ ఎక్కడ కూడా తడబడకుండా ముందుకు సాగుతూ వచ్చింది. ఇక ఉత్కంఠభరితమైన పోరు లో ఒక్క బాలు మిగులి ఉండగానే జింబాబ్వే టీమ్ శ్రీలంక కి షాక్ ఇచ్చి గొప్ప విజయాన్ని అందుకుంది…

ఇక ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన శ్రీలంక టీమ్ ప్లేయర్లలో అసలంక, మాథ్యూస్ ఇద్దరు కూడా హాఫ్ సెంచరీ లు చేసి టీమ్ కు గౌరవప్రదమైన స్కోర్ అందించడంలో వాళ్ల వంతు పాత్రను పోషించారు. అయినప్పటికీ శ్రీలంక టీమ్ 173 పరుగులు సాధించింది. ఒక రకంగా చెప్పాలంటే జింబాబ్వే టీమ్ కిది భారీ లక్ష్యమనే చెప్పాలి. కానీ శ్రీలంక బౌలర్లు జింబాబ్వే బ్యాట్స్మెన్స్ ని కట్టడి చేయడంలో చాలా వరకు ఫెయిల్ అయ్యారు అందుకే ఈ విజయం జింబాబ్వే టీమ్ సొంతమైంది…