https://oktelugu.com/

ప్ర‌దీప్ రెమ్యూనరేషన్ పై క్రేజీ రూమర్స్ !

’30 రోజుల్లో ప్రేమించ‌టం ఎలా’ అనే రొమాంటిక్ ఎంట‌ర్‌టైన‌ర్‌ తో ప్ర‌దీప్ మాచిరాజు హీరోగా ప‌రిచ‌యం అయిన మొదటి సినిమాకు భారీ రెమ్యూనరేషన్ ను తీసుకున్నాడని ఎన్నో వార్తలు తెరపైకి వస్తున్నాయి. అయితే ప్రదీప్ ఈ సినిమాగానూ కేవలం రూ. 30 లక్షలు మాత్రమే తీసుకున్నాడని.. సినిమా హిట్ అయితే తర్వాత చూద్దాం అన్నట్లు ముందు మాట్లాడుకున్నారని.. ఇప్పుడు మళ్ళీ ప్రదీప్ మరో 50 లక్షలు ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. Also Read: ‘ఆచార్య’.. ట్రైలర్ చూసి ఆ […]

Written By:
  • admin
  • , Updated On : February 6, 2021 / 05:28 PM IST
    Follow us on


    ’30 రోజుల్లో ప్రేమించ‌టం ఎలా’ అనే రొమాంటిక్ ఎంట‌ర్‌టైన‌ర్‌ తో ప్ర‌దీప్ మాచిరాజు హీరోగా ప‌రిచ‌యం అయిన మొదటి సినిమాకు భారీ రెమ్యూనరేషన్ ను తీసుకున్నాడని ఎన్నో వార్తలు తెరపైకి వస్తున్నాయి. అయితే ప్రదీప్ ఈ సినిమాగానూ కేవలం రూ. 30 లక్షలు మాత్రమే తీసుకున్నాడని.. సినిమా హిట్ అయితే తర్వాత చూద్దాం అన్నట్లు ముందు మాట్లాడుకున్నారని.. ఇప్పుడు మళ్ళీ ప్రదీప్ మరో 50 లక్షలు ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది.

    Also Read: ‘ఆచార్య’.. ట్రైలర్ చూసి ఆ చానల్ వెనక్కి పోయిందా?

    నిజానికి షోల పరంగా చూసుకుంటే ప్రదీప్ ఒక్కో ఎపిసోడ్‌కు రూ. లక్షన్నర వరకూ వసూలు చేస్తున్నాడు. కాబట్టి అన్ని షోలతో కలిపి మొత్తంగా నెలకు నలభై నుంచి యాభై లక్షల రూపాయలు సంపాదిస్తాడు ప్రదీప్. ఇలా ఒక్క ఏడాది రూ. ఆరు కోట్ల వరకూ సంపాదిస్తున్నాడని టాక్. దాదాపు పదేళ్లుగా తనదైన శైలి యాంకరింగ్‌తో నెంబర్ వన్ హోస్టుగా వెలుగొందుతున్న ప్రదీప్ మాచిరాజు ఈ మాత్రం సంపాదించకపోతే ఎలా ? సుదీర్ఘమైన కెరీర్‌లో వరుస ఆఫర్లు అందుకుంటూ సత్తా చాటుతోన్న అతనకి ఫుల్ డిమాండ్ ఉంది.

    Also Read: చరణ్ తో నాని డైరెక్టర్ ‘కథాకహానీ’ !

    ఎలాగూ ’30 రోజుల్లో ప్రేమించడం ఎలా’తో హీరోగానూ ఎంట్రీ ఇచ్చాడు కాబట్టి.. ఇక నుండి రెమ్యూనరేషన్ ను కోట్లలో అడిగినా ఆశ్చర్యపొక్కర్లేదు. రేడియో జాకీగా కెరీర్‌ను ఆరంభించిన ప్రదీప్ మాచిరాజు, దాని ద్వారా చాలా మందికి సుపరిచితుడు అయి ఆ తర్వాత యాంకర్‌గానూ ఎంట్రీ ఇచ్చాడు. కెరీర్ ఆరంభంలోనే తనలోని టాలెంట్‌ను నిరూపించుకుని నంది అవార్డును కూడా అందుకున్నాడు. ఇప్పుడు హీరోగానూ రాణిస్తున్నాడు.

    మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్