పవన్ సినిమాకి అప్పుడే 100 కోట్ల బిజినెస్ !

టాలీవుడ్ లో పవన్ కళ్యాణ్ సినిమా అంటే ఆ క్రేజే వేరు. పవన్ నటించే ఫ్లాప్ సినిమా సునాయాసంగా 100కోట్లు వసూలు చేస్తాయి. పవర్ స్టార్ ఛరిష్మాని దృష్టిలో పెట్టుకునే నిర్మాతలు ఆయన చుట్టూ తిరుగుతారు. ఇక ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్… ఒక వైపు రాజకీయం చేస్తూనే మరో వైపు బ్యాక్‌ టు బ్యాక్‌ మూవీస్‌ అనౌన్స్‌మెంట్స్‌తో అభిమానుల్ని సర్‌ప్రైజ్ చేస్తున్నాడు. ఇప్పటికే వేణుశ్రీరాం దర్శకత్వంలో ‘వకీల్‌ సాబ్’ మూవీ షూటింగ్ కంప్లీట్ చేసి […]

Written By: admin, Updated On : February 6, 2021 5:39 pm
Follow us on


టాలీవుడ్ లో పవన్ కళ్యాణ్ సినిమా అంటే ఆ క్రేజే వేరు. పవన్ నటించే ఫ్లాప్ సినిమా సునాయాసంగా 100కోట్లు వసూలు చేస్తాయి. పవర్ స్టార్ ఛరిష్మాని దృష్టిలో పెట్టుకునే నిర్మాతలు ఆయన చుట్టూ తిరుగుతారు. ఇక ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్… ఒక వైపు రాజకీయం చేస్తూనే మరో వైపు బ్యాక్‌ టు బ్యాక్‌ మూవీస్‌ అనౌన్స్‌మెంట్స్‌తో అభిమానుల్ని సర్‌ప్రైజ్ చేస్తున్నాడు. ఇప్పటికే వేణుశ్రీరాం దర్శకత్వంలో ‘వకీల్‌ సాబ్’ మూవీ షూటింగ్ కంప్లీట్ చేసి ప్రస్తుతం రిలీజ్ చేసే ప్లాన్ లో ఉన్నారు. అయితే ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ అప్పుడే 100కోట్లు దాటినట్లు తెలుస్తోంది.

Also Read: ‘ఆచార్య’.. ట్రైలర్ చూసి ఆ చానల్ వెనక్కి పోయిందా?

పైగా ఇంకా ఏరియాల వైజ్ గా బిజినెస్ చాలా వరకు పూర్తవ్వాల్సి ఉందట. కరోనా ఉన్నా కూడా మార్కెట్ పై కొంత ప్రభావం కూడా కనిపించడం లేదు అంటే పవన్ రేంజే కారణం. కాగా వకీల్‌ సాబ్ సినిమాను ఏప్రిల్ 9న విడుద‌ల చేస్తున్నట్లు ప్రకటించి మెగా అభిమానుల ఎదురు చూపులకు శుభం కార్డు వేశారు. అయితే రిలీజ్ “ఏప్రిల్” నెలలో అనేసరికి పవన్ అభిమానుల్లో కొత్త అనుమానం ఒకటి వచ్చింది. పవన్ కెరీర్ లో బద్రి, ఖుషి, జానీ, జల్సా, సర్దార్ గబ్బర్ సింగ్ సినిమాలు యాదృచ్చికంగా ఏప్రిల్ నెలలోనే విడుదలయ్యాయి.

Also Read: చరణ్ తో నాని డైరెక్టర్ ‘కథాకహానీ’ !

కాగా ఇందులో మూడు సినిమాలు హిట్ అవ్వగా రెండు సినిమాలు దారుణ ఫలితాన్ని చూశాయి. దాంతో కొందరేమో వకీల్‌ సాబ్ కి తిరుగులేదు, హిట్ ఖాయం అంటుండగా… మరికొందరు ఏమౌతుందో అని కామెంట్స్ చేస్తున్నారు. ఈ చిత్రంలో శ్రుతి హాస‌న్‌ హీరోయిన్‌గా నటించగా.. నివేదా థామ‌స్‌, అంజ‌లి, అన‌న్య నాగ‌ళ్ల కీలక పాత్రలు పోషించారు. ప్రముఖ బాలీవుడ్‌ నిర్మాత బోనీ కపూర్‌ సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్సన్‌ బ్యానర్‌పై దిల్‌రాజు, శిరీష్ లు ఈ మూవీని ప్రొడ్యూస్ చేశారు. టాలీవుడ్ ఇండస్ట్రీలో ఫ్లాప్ టాక్ తో పెట్టిన పెట్టుబడి వెనక్కి తీసుకురాగల సత్తా ఉన్న హీరో పవర్ స్టార్, మరి చూడాలి ఈ సినిమా ఏ రేంజ్ హిట్ అవుతుందో.

మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్