కాగా ఇటలీలో ఉన్న టాలీవుడ్ లేడీ సింగర్ శ్వేతా పండిట్ ఇటలీ పరిస్థితులను అభివర్ణిస్తూ పంపిన వీడియో ఇప్పుడు సంచలనం రేపుతోంది. సింగర్ శ్వేతా పండిట్ చెప్పిన ప్రకారం ఇటలీలోని పరిస్థితులు చాలా భయంకరంగా ఉన్నాయి. ఇపుడు పరిశీలిస్తే ప్రపంచంలో భారీగా ఎఫెక్ట్ అయిన దేశంగా ఇటలీ మొదటి స్థానంలో ఉంది.
“ప్రతీ రోజు ఉదయమే అంబులెన్స్ల సైరన్లతో నిద్రలేస్తున్నా. కళ్లేదుటే మరణాలు సంభవిస్తున్నాయి … నేను ఇక్కడ క్వారంటైన్లో ఉన్నాను. ఈ వైరస్ భారీ నుంచి నన్ను నేను కాపాడుకోవడానికి ఇలా చేస్తున్నాను. ఎప్పుడైతే కరోనా వచ్చిందో అప్పట్నుంచి నేను ఇంటి నుంచి బయటకు రాలేదు.. ఇప్పటికీ ఇంట్లోనే ఉంటున్నాను.” అని వీడియోలో శ్వేతా తెలిపింది.
‘మీరందరూ ఈ వ్యాధితో పోరాడి ఓడించాలని నేను కోరుకుంటున్నాను. ప్రాణాంతక వ్యాధిని మనమంతా ఓడించాలంటే.. ఇంటి వద్దనే కదలకుండా ఉండాలి ” అని శ్వేతా పండిట్ సూచనలు చేసింది. కాగా శ్వేతా పండిట్ చెప్పిన ఇటలీ పరిస్థితులు వీడియోలో చూసిన వారంతా ఆమె క్షేమంగా ఉండాలని కోరుతూ సందేశాలు పంపుతున్నారు.
ఇంతకీ శ్వేతా పండిట్ ఎవరంటే ఇండియన్ క్లాసిక్ స్వర పితామహుడు , పద్మభూషణ్ జస్రాజ్ గారికి ముని మేనకోడలు. నాలుగేళ్ళ చిరు ప్రాయంలోనే మణిరత్నం ” అంజలి ” చిత్రం యొక్క హిందీ వెర్షన్ లో బాల గాయనిగా పాటలు పాడటం తో పాటు, అంజలి పాత్రధారి “షామిలి ” కి డబ్బింగ్ చెప్పి రికార్డు సృష్టించింది .
ఆ తరువాత గాయనిగా మారి హిందీ , తెలుగు , తమిళం తో పాటు పలు భాషల్లో పాటలు పాడింది. ఇక శ్వేతా పండిట్ తెలుగులో పాడిన పాటల్లో ‘కొత్త బంగారు లోకం’ చిత్రం లోని ‘నేనని నీవని’.,’సైజు జీరో ‘సినిమాలో ‘మెల్ల మెల్లగా , . ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’లో సమంత సోలో సాంగ్ ‘ఇంకా చెప్పాలంటే ‘, పాటతో పాటు ‘ముకుంద’ చిత్రం లోని ‘ గోపికమ్మా చాలును లేమ్మా’ వంటి పాటలతో పాటు ఇంకా చాలా చిత్రాల్లో పాటలు పాడి తనదైన ముద్ర వేసింది .అలా పాటలు పాడి రాణిస్తున్న టైమ్ లో ఇటాలియన్ సినీ నిర్మాత ఇవానో ఫుసిసిని పెళ్ళాడి ఇటలీలో సెటిలైపోయింది.