Homeఎంటర్టైన్మెంట్Couple Friendly Total Collections: మొదటిరోజు కంటే 9వ రోజు ఎక్కువ వసూళ్లు..'కపుల్ ఫ్రెండ్లీ' టోటల్...

Couple Friendly Total Collections: మొదటిరోజు కంటే 9వ రోజు ఎక్కువ వసూళ్లు..’కపుల్ ఫ్రెండ్లీ’ టోటల్ కలెక్షన్స్ ఎంతంటే!

Couple Friendly Total Collections: ఈ వాలెంటైన్స్ డే సందర్భంగా విడుదలైన సినిమాల్లో యూత్ ఆడియన్స్ నుండి మంచి పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకున్న చిత్రం ‘కపుల్ ఫ్రెండ్లీ'(Couple Friendly). కానీ టాక్ కి తగ్గ వసూళ్లు అవడం లేదని నిన్న మొన్నటి వరకు ట్రేడ్ విశ్లేషకులు కూడా కామెంట్స్ చేసేవారు. కానీ ఎప్పుడైతే మూవీ టీం ప్రభాస్ తో కలిసి ఇంటర్వ్యూ చేసిందో , అప్పటి నుండి ఈ సినిమాకు వసూళ్లు భారీ గా […]

Couple Friendly Total Collections: ఈ వాలెంటైన్స్ డే సందర్భంగా విడుదలైన సినిమాల్లో యూత్ ఆడియన్స్ నుండి మంచి పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకున్న చిత్రం ‘కపుల్ ఫ్రెండ్లీ'(Couple Friendly). కానీ టాక్ కి తగ్గ వసూళ్లు అవడం లేదని నిన్న మొన్నటి వరకు ట్రేడ్ విశ్లేషకులు కూడా కామెంట్స్ చేసేవారు. కానీ ఎప్పుడైతే మూవీ టీం ప్రభాస్ తో కలిసి ఇంటర్వ్యూ చేసిందో , అప్పటి నుండి ఈ సినిమాకు వసూళ్లు భారీ గా పెరిగాయి. శనివారం రోజున అనేక ప్రాంతాల్లో మొదటి రోజుకంటే ఎక్కువ వసూళ్లు వచ్చాయి. ఆదివారం రోజున (9వ రోజు) కూడా అదే రిపీట్ అయ్యింది. ఓవరాల్ గా ఈ చిత్రానికి 9 రోజులకు కలిపి ఎంత షేర్ వసూళ్లు వచ్చాయి అనేది వివరంగా చూద్దాం. బుక్ మై హౌ యాప్ లెక్కల ప్రకారం ఏ చిత్రానికి 9 వ రోజున 17 వేల టిక్కెట్లు అమ్ముడుపోయాయి.

8వ రోజున ఈ చిత్రానికి తెలుగు రాష్ట్రాల నుండి 55 లక్షల రూపాయిల హాఏ వసూళ్లు వచ్చాయి. ఇది మొదటి రోజు కంటే ఎక్కువ కావడం విశేషం. ఇక 9వ రోజున అయితే ఈ చిత్రానికి దాదాపుగా 60 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయట. కానీ ఓవర్సీస్ నుండి వసూళ్లు పెద్దగా నమోదు అవ్వలేదు. ఓవరాల్ గా ప్రాంతాల వారీగా 9 రోజుల్లో వచ్చిన వసూళ్లను ఒకసారి పరిశీలిస్తే నైజాం ప్రాంతం నుండి 2.1 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టిన ఈ చిత్రానికి , ఆంద్ర + సీడెడ్ ప్రాంతం నుండి 2.2 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయని , ఓవరాల్ గా రెండు తెలుగు రాష్ట్రాల నుండి 9 రోజుల్లో 4.3 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు , 8 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. అదే విధంగా కర్ణాటక + రెస్ట్ ఆఫ్ ఇండియా+ ఓవర్సీస్ ప్రాంతాలకు కలిపి ఈ చిత్రానికి కోటి రూపాయలకు పైగా షేర్ వసూళ్లు వచ్చాయని అంటున్నారు.

ఓవరాల్ వరల్డ్ వైడ్ గా ఈ చిత్రానికి 5.3 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు , 11 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. విడుదలకు ముందు ఈ చిత్రానికి 6.5 కోట్ల రూపాయిల ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ జరిగింది . అంటే బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకోవడానికి ఇక కేవలం కోటి రూపాయలకు పైగా షేర్ వసూళ్లను మాత్రమే రాబట్టాలి. రాబోయే రెండు మూడు రోజుల్లో ఈ మార్కుని అందుకుంటుందని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు . మొత్తం మీద ఈ చిత్రానికి ప్రభాస్ ఇంటర్వ్యూ చాలా బాగా కలిసొచ్చింది అనే చెప్పాలి.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper