
టాలీవుడ్ లో ఇప్పుడు ఎవర్ని కదిలించినా వచ్చే నెల నుండి షూటింగ్ అనే మాటే వినిపిస్తోంది. కానీ మరోపక్క కరోనా మహమ్మారి తీవ్రత ఇంకా రోజురోజుకు విచ్చలవిడిగా పెరుగుతూనే ఉంది. సినిమా రంగంలోని పేదలు కరోనాతో తీవ్ర ఇబ్బందులు ఎదురుకుంటూనే ఉన్నారు. అయితే షూటింగ్ లు ఇప్పటికిప్పుడు స్టార్ట్ చేస్తే రాబోయే రోజుల్లో ఎలా ఉంటుందో.. ఒకవేళ సినీ కార్మికులకు కరోనా వస్తే..? రాకుండా పెద్ద నిర్మాతల దగ్గర నుండి చిన్న నిర్మాతల వరకూ ఎక్కువ జాగ్రతలు తీసుకోవాలి. తీసుకున్నా కరోనాను ఆపగలమా ? దీనికి తోడు ప్రొడక్షన్ కాస్ట్ కూడా ఎక్కువ అవుతుంది.
Also Read: రెమ్యునిరేషన్ పెంచితే న్యూడ్ సీన్స్ కైనా రెడీ !
అసలు ఇంత ఖర్చు పెట్టి సినిమా తీసినా సినిమా రిలీజ్ ఇప్పట్లో కాదు కదా.. మరి షూటింగ్ ఎందుకు చేయడం. పైగా షూటింగ్స్ అంటే వందలమందితో చేయాల్సిన పని. కరోనా రాకుండా అరికట్టే మార్గదర్శకాలను షూటింగ్ స్పాట్లో తప్పనిసరిగా పాటించాలని ప్రభుత్వాలు స్పష్టం చేసినా.. అది అసాధ్యం. షూటింగ్స్ లో భౌతికదూరం పాటించడం కుదరదు. ఈ క్రమంలో సినీ కార్మికులకు ఒకవేళ కరోనా సోకితే.. సినిమా పక్షులు కృష్ణ నగర్ కష్టాలతో పాటు కరోనా కష్టాలు కూడా అనుభవించాల్సి వస్తోంది. మరి షూటింగ్స్ తెగ తాపత్రయం పడుతున్న హీరోలు, దర్శకనిర్మాతలు సినీ కార్మికులకు కరోనా సోకితే ఆదుకుంటారా ?
Also Read: కరోనా – బాలయ్య మధ్యలో బోయపాటి !
ఏమో.. అప్పుడు ఎవ్వరూ కనిపించకపోతే.. చివరికీ బలి అయ్యేది సినీకార్మికులే కదా. హీరోలకు దర్శకనిర్మాతలకు కరోనా వచ్చినా వారు సేఫ్ గానే ఉంటారు. అదే పేదలకు వస్తే.. అది తీవ్రంగా వస్తే.. చావును ఆపడం పేదల వల్ల కాదు కదా. మరి షూటింగ్ లను మొదలు పెట్టాలనుకుంటున్న హీరోలు నిర్మాతలు సినీ కార్మికులకు ఎలాంటి భరోసాని ఇస్తారో కరోనా విషయంలో వాళ్ళు ముందుగానే ఆలోచించుకుని షూటింగ్స్ ను స్టార్ట్ చేసుకుంటే బెటర్.