కరోనా పోరాటానికి కలిసొస్తున్న సెలబ్రెటీలు

కరోనా వైరస్ ప్రస్తుతం ప్రపంచాన్ని గజగజ వణికిస్తోంది. ఇండియాలోనూ కరోనా పాజిటివ్ కేసులు పెరిగిపోతుండటంతో ఆందోళన కలిగిస్తోంది. కరోనా నివారణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కఠిన చర్యలు అమలు చేస్తున్నాయి. ఇప్పటికే కేంద్రం దేశవ్యాప్తంగా 21రోజులపాటు లాక్డౌన్ చేపట్టింది. కరోనా నివారణ కోసం పోరాడుతున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు పలువురు సిని స్టార్లు విరాళాలను ప్రకటిస్తూ తమవంతు సహకారం అందజేస్తున్నారు. జనసేన అధినేత, ప్రముఖ నటుడు పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కరోనా నివారణ కోసం 2కోట్ల […]

Written By: Neelambaram, Updated On : March 26, 2020 1:00 pm
Follow us on

కరోనా వైరస్ ప్రస్తుతం ప్రపంచాన్ని గజగజ వణికిస్తోంది. ఇండియాలోనూ కరోనా పాజిటివ్ కేసులు పెరిగిపోతుండటంతో ఆందోళన కలిగిస్తోంది. కరోనా నివారణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కఠిన చర్యలు అమలు చేస్తున్నాయి. ఇప్పటికే కేంద్రం దేశవ్యాప్తంగా 21రోజులపాటు లాక్డౌన్ చేపట్టింది. కరోనా నివారణ కోసం పోరాడుతున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు పలువురు సిని స్టార్లు విరాళాలను ప్రకటిస్తూ తమవంతు సహకారం అందజేస్తున్నారు.

జనసేన అధినేత, ప్రముఖ నటుడు పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కరోనా నివారణ కోసం 2కోట్ల విరాళాన్ని ప్రకటించారు. రెండు తెలుగు రాష్ట్రాల సీఎం సహాయ నిధులకు 50లక్షల చొప్పున, ప్రధానమంత్రి సహాయనిధికి ఒక కోటి విరాళాన్ని అందజేయనున్నట్లు ట్వీటర్లో పేర్కొన్నారు. అదేవిధంగా మాటల మాంత్రికుడు రెండు తెలుగు రాష్ట్రాలకు 10లక్షల చొప్పున మొత్తం 20లక్షలకు ప్రకటించనున్నారని నిర్మాత సూర్యదేవర నాగవంశీ ట్వీటర్లో ప్రకటించారు.

అదేవిధంగా టాలీవుడ్ నటుడు నితిన్ ఏపీ, తెలంగాణకు 10లక్షల చొప్పున మొత్తం 20లక్షలు, కామెడియన్ అలీ తెలుగు రాష్ట్రాలకు లక్ష చొప్పున స్వచ్చంధంగా అందజేయనున్నట్లు ప్రకటించారు. అదేవిధంగా సీని కార్మికుల కోసం జీవిత రాజశేఖర్, మా మాజీ అధక్ష్యుడు శివాజీ రాజా నిత్యావసర సరుకులను పంపిణీ చేస్తున్నారు. తమిళనాడులోని సీనీ ప్రముఖుల కోసం సూపర్ స్టార్ రజనీ 50లక్షలు, విజయ్ సేతుపతి 50లక్షలు, సూర్య, కార్తీ 10లక్షల చొప్పున విరాళం ప్రకటించారు. వీరితోపాటు మరింత మంది సీఎం సహాయనిధికి విరాళాలు అందించేందుకు ముందుకొస్తున్నారు.