https://oktelugu.com/

తొందరపడుతున్న రజనీకి కరోనా షాక్!

సూపర్ స్టార్ రజనీకాంత్ కి కరోనా సెగతాకింది. ఆయన లేటెస్ట్ మూవీ అన్నాత్తే షూటింగ్ కరోనా కారణంగా ఆగిపోయింది. మాస్ చిత్రాల దర్శకుడు శివ రజనీకాంత్ హీరోగా అన్నాత్తే చిత్రం తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. లాక్ డౌన్ ముందు వరకు ఈ చిత్ర షూటింగ్ నిరవధికంగా సాగింది. లాక్ డౌన్ ప్రకటన తరువాత దాదాపు ఏడు నెలలుగా షూటింగ్ కి బ్రేక్ పడింది. నిబంధల మధ్య షూటింగ్ జరుపుకునే అవకాశం ఉన్నప్పటికీ రజినీ కాంత్ వయసు రీత్యా […]

Written By: , Updated On : December 24, 2020 / 07:14 PM IST
Follow us on

Rajinikanth
సూపర్ స్టార్ రజనీకాంత్ కి కరోనా సెగతాకింది. ఆయన లేటెస్ట్ మూవీ అన్నాత్తే షూటింగ్ కరోనా కారణంగా ఆగిపోయింది. మాస్ చిత్రాల దర్శకుడు శివ రజనీకాంత్ హీరోగా అన్నాత్తే చిత్రం తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. లాక్ డౌన్ ముందు వరకు ఈ చిత్ర షూటింగ్ నిరవధికంగా సాగింది. లాక్ డౌన్ ప్రకటన తరువాత దాదాపు ఏడు నెలలుగా షూటింగ్ కి బ్రేక్ పడింది. నిబంధల మధ్య షూటింగ్ జరుపుకునే అవకాశం ఉన్నప్పటికీ రజినీ కాంత్ వయసు రీత్యా షూటింగ్ లో పాల్గొనడానికి ఆసక్తి చూపలేదు. ఈ మధ్యనే రజినీ కాంత్ షూటింగ్ కి హాజరవుతున్నారని సమాచారం.

Also Read: కొత్త రికార్డు క్రియేట్ చేసిన విజయ్ దేవరకొండ

దానికి కారణం ఆయన ప్రత్యక్ష రాజకీయాలలోకి వస్తున్నట్లు ప్రకటన చేశారు. పార్టీని ప్రకటించడంతో పాటు, వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో పోటీ చేస్తున్నట్లు ప్రకటించడం జరిగింది. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు కేవలం నెలల వ్యవధి మాత్రమే ఉంది. ఈ నేపథ్యంలో అన్నాత్తే షూటింగ్ పూర్తి చేసి, ఎన్నికల సమాయత్తం కావాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. కాగా రజినీ ఆశలపై కరోనా నీళ్లు చల్లింది.

Also Read: నాన్న అంటే జగపతి బాబే..

అన్నాత్తే షూటింగ్ లో పాల్గొన్న ఎనిమిది మంది సభ్యులకు కరోనా సోకినట్లు తెలుస్తుంది. కరోనా లక్షణాలతో బాధపడుతున్న వీరికి పరీక్షలు నిర్వహించగా కరోనా పాజిటివ్ అని తేలిందని సమాచారం. దీనితో చిత్ర యూనిట్ అప్రమత్తం అయ్యారు. షూటింగ్ లో పాల్గొన్న వారందరూ కరోనా టెస్ట్స్ చేయించుకున్నట్లు సమాచారం. ఇక అన్నాత్తే చిత్రంలో మీనా, కుష్బూ వంటి సీనియర్ హీరోయిన్స్ తో పాటు, కీర్తి సురేష్ కూడా నటిస్తున్నారు. ఈ చిత్రంపై రజినీ ఫ్యాన్స్ లో భారీ అంచనాలున్నాయి. ఈ సంఘటనతో అన్నాత్తే షూటింగ్ మరింత లేటయ్యే అవకాశం కలదు.

మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్