https://oktelugu.com/

సామాన్యులు గాంధీకి.. ప్రజాప్రతినిధులు ప్రైవేటుకు..!

కరోనా మహమ్మరికి చాలా ఆత్మగౌరవం ఎక్కువ.. అది పిలిస్తేనే మన ఇంటికి వస్తుందని.. ఈ వైరస్ పట్ల అప్రమత్తంగా ఉండాలని సీఎం కేసీఆర్ స్వయంగా చెప్పిన మాటలివి.. ఈ మహమ్మరి పేద, ధనిక, చిన్న, పెద్ద అనే తేడా చూపకుండా అందరి సమాన దృష్టితో చూస్తోంది. మనం నిర్లక్ష్యంగా ఉంటేనే దాడి చేస్తోంది. అలాంటి మహమ్మరికి చికిత్స అందించే విషయంలో మాత్రం ప్రభుత్వం తేడాలు చూపుతుండటం విమర్శలకు తావిస్తోంది. ప్రముఖులకు, సామాన్యులకు వేర్వురుగా చికిత్స అందిస్తుండటంపై ప్రభుత్వంపై […]

Written By:
  • Neelambaram
  • , Updated On : June 30, 2020 / 01:14 PM IST
    Follow us on


    కరోనా మహమ్మరికి చాలా ఆత్మగౌరవం ఎక్కువ.. అది పిలిస్తేనే మన ఇంటికి వస్తుందని.. ఈ వైరస్ పట్ల అప్రమత్తంగా ఉండాలని సీఎం కేసీఆర్ స్వయంగా చెప్పిన మాటలివి.. ఈ మహమ్మరి పేద, ధనిక, చిన్న, పెద్ద అనే తేడా చూపకుండా అందరి సమాన దృష్టితో చూస్తోంది. మనం నిర్లక్ష్యంగా ఉంటేనే దాడి చేస్తోంది. అలాంటి మహమ్మరికి చికిత్స అందించే విషయంలో మాత్రం ప్రభుత్వం తేడాలు చూపుతుండటం విమర్శలకు తావిస్తోంది. ప్రముఖులకు, సామాన్యులకు వేర్వురుగా చికిత్స అందిస్తుండటంపై ప్రభుత్వంపై తెలంగాణ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

    ఏపీలో దారుణం.. మహిళా ఉద్యోగిపై అధికారి దాడి…

    రాష్ట్రంలో కరోనా మహమ్మరి పంజా విసురుతోంది. దీంతో రోజురోజుకు పాజిటివ్ కేసుల సంఖ్య భారీగా పెరిగిపోతుంది. కరోనాకు సోకిన వారందరికీ గాంధీ ఆస్పత్రిలో చికిత్స చేస్తున్న సంగతి తెల్సిందే. అయితే ప్రజాప్రతినిధులు మాత్రం ప్రైవేట్ కు వెళ్లి చికిత్స చేయించుకుండటంతో ప్రభుత్వ ఆస్పత్రుల పనితీరుపై ఆరోపణలు వస్తున్నారు. ప్రభుత్వం అత్యాధునిక సదుపాయాలతో ప్రభుత్వ ఆసుపత్రుల్లో చికిత్స అందిస్తున్నప్పటికీ చెబుతుండగా అధికార పార్టీ ఎమ్మెల్యేలు, ప్రముఖులు ప్రైవేటుకు వెళ్లి చికిత్స చేయించుకుండటంపై పలు అనుమానాలు రేకెత్తుతోన్నాయి.

    కరోనా చికిత్స విషయంలో ప్రభుత్వం చెబుతున్న మాటలకు.. ఆచరణలో చేస్తున్న దానికి పొంతన ఉండటంలేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ప్రభుత్వం ఉన్నవారికి ఈ విషయం తెలుసు గనుకగానే ఇటీవల ప్రయివేట్ ఆస్పత్రుల్లో కరోనా చికిత్స, టెస్టులకు ప్రభుత్వం అనుమతి ఇచ్చిందనే ఆరోపణలున్నాయి. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు కరోనా బారిన పడిన తర్వాతే ప్రయివేట్ కు అనుమతి ఇవ్వడంతో ప్రతిపక్షాలు సైతం విమర్శలు గుప్పిస్తున్నాయి. అయితే ప్రజాప్రతినిధులు మాత్రంపై సర్కార్ దావాఖానాలను నమ్ముకోకుండా ప్రైవేట్ కే మొగ్గుచూపుతున్నారు. అయితే ప్రభుత్వం మాత్రం ప్రభుత్వ ఆస్పత్రుల్లో అన్నిరకాల వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయనే కావాలనే కొందరు దుష్పచారం చేస్తున్నారని విమర్శలను తిప్పికొడుతోంది.

    కేసీఆర్ కు కరోనా మరక.. వదిలేలా లేదుగా?

    డబ్బులున్న ప్రముఖులు, ప్రజాప్రతినిధులు కార్పొరోట్ ఆస్పత్రుల్లో చికిత్స చేయించుకుంటూ ప్రాణాలను కాపాడుకుంటున్నారు. డబ్బుల్లేని పేద, మధ్యతరగతి ప్రజలు మాత్రం అరకొర వసతులు ఉన్న ప్రభుత్వ ఆస్పత్రుల్లో చికిత్స చేయించుకుంటున్నారు. దేవుడిపై భారంవేసి సామాన్యులు ప్రభుత్వ ఆస్పత్రుల్లో చికిత్స చేయించుకుంటున్నారు. వీరిలో కొంతమంది కరోనా నుంచి కోలుకోని ఇంటిముఖం పట్టగా మరేకొందరు ప్రాణాలను పొగొట్టుకుంటున్నారు. కరోనా రోగులందరికీ గాంధీలోనే చికిత్స అందిస్తామని సర్కార్ తొలినాళ్లలో చెప్పి నేడు ప్లేట్ ఫిరాయించడంపై సామాన్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ప్రభుత్వ ఆస్పత్రుల్లో సామాన్యులకు వైద్యం సరిగా అందడం లేదని విమర్శలు ఇటీవలీ కాలంలో వెల్లువెత్తుతోన్నాయి.

    అయితే ప్రభుత్వం ఈ విమర్శలను పెద్దగా పట్టించుకున్నట్లు కన్పించడం లేదు. ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ స్వయంగా దీనిని ఖండించారు. కావాలనే కొందరు ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారని చెబుతున్నారు. ప్రైవేట్ కు ధీటుగా ప్రభుత్వ ఆసుప్రతుల్లో వైద్యం అందిస్తున్నట్లు చెప్పుకొచ్చారు. అంత బాగుంటే టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, మంత్రులు ప్రైవేట్లోకి ఎందుకు వెళ్లారో చెప్పడానికి ఆయన నానా ఇబ్బందులు పడుతోన్నాయి. ప్రజాప్రతినిధులందరికీ ఫ్యామిలీ డాక్టర్స్ ఉన్నారని.. వారికి ఆసుప్రతులున్నాయని.. అందుచేతనే వారు అక్కడ చికిత్స చేయించుకుంటున్నారని చెబుతున్నాయి. అలాంటి వారిని బలవంతంగా ప్రభుత్వ ఆస్పత్రుల్లో చేర్పించలేమంటూ చెప్పుకొచ్చారు. సామాన్యులు మాత్రం ప్రజాప్రతినిధులు ఎక్కడ చికిత్స చేయించుకున్నా తమకు అభ్యంతరం లేదని.. ప్రభుత్వ ఆస్పతుల్లో మెరుగైన వైద్యం అందిస్తే చాలంటూ వాపోతున్నారు.