కరోనా దెబ్బకు ‘దసరా’ హౌస్ ఫుల్ !

కరోనా వైరస్ మహమ్మారి దెబ్బకు సమ్మర్ లో రావాల్సిన సినిమాలన్నీ పోస్టుపోన్ అయిపోయాయి. ఇక సమ్మర్ సీజన్ తరువాత ముఖ్యమైన సీజన్ అంటే దసరానే. విజయదశమి సెలవుల్ని టార్గెట్ చేసుకుని స్టార్ హీరోల సినిమాలు పోటీకి సిద్దమయ్యే అవకాశం ఉంది. అయితే కరోనా ప్రభావంతో ఇప్పుడు ఆ పోటీ రెట్టింపు అయ్యేలా కనిపిస్తోంది. దసరాకి భారీ చిత్రాలతో పాటు చిన్న సినిమాలు కూడా చాలానే ఉన్నాయి. చిరు ‘ఆచార్య’, రజనీ ‘అన్నాత్తే’, యాష్ ‘కె.జి.ఎఫ్ 2’ అలాగే […]

Written By: admin, Updated On : June 15, 2020 4:06 pm
Follow us on


కరోనా వైరస్ మహమ్మారి దెబ్బకు సమ్మర్ లో రావాల్సిన సినిమాలన్నీ పోస్టుపోన్ అయిపోయాయి. ఇక సమ్మర్ సీజన్ తరువాత ముఖ్యమైన సీజన్ అంటే దసరానే. విజయదశమి సెలవుల్ని టార్గెట్ చేసుకుని స్టార్ హీరోల సినిమాలు పోటీకి సిద్దమయ్యే అవకాశం ఉంది. అయితే కరోనా ప్రభావంతో ఇప్పుడు ఆ పోటీ రెట్టింపు అయ్యేలా కనిపిస్తోంది. దసరాకి భారీ చిత్రాలతో పాటు చిన్న సినిమాలు కూడా చాలానే ఉన్నాయి. చిరు ‘ఆచార్య’, రజనీ ‘అన్నాత్తే’, యాష్ ‘కె.జి.ఎఫ్ 2’ అలాగే కంగనా ‘తలైవి’, నితిన్ ‘రంగ్ దే’ వరుణ్ తేజ్ ‘బాక్సర్’ మూవీ ఇంకా అప్పటికీ కొన్ని సినిమాలు రేసులోకి వచ్చేలా ఉన్నాయి.

మొత్తానికి వచ్చే దసరా సీజన్ టాలీవుడ్ కి కీలకంగా మారిపోయింది. చిరంజీవిల ‘ఆచార్య’, రజనీ మూవీ అలాగే ‘కె.జి.ఎఫ్ 2’ దసరాకి వస్తే.. భారీ అంచనాలు ఉన్న ఆ సినిమాల ప్రభావంలో మిగిలిన మిడియమ్ రేంజ్ సినిమాలు, చిన్న సినిమాలు పరిస్థితి ఎంటనేదే ఆయా సినిమాల మేకర్స్ ఆలోచించుకోవాలి. పైగా ఈ దసరాకి భారీ సినిమాల మధ్య పోటీ రసవత్తరంగా మారనుంది. ఇక మరో పక్క సమ్మర్ సీజన్ లాగే, దసరా సీజన్ కూడా మిస్ అవుతుందేమో అనే టెన్షన్ కూడా ఉంది.

ఏమైనా అక్టోబర్ నాటికి కరోనా ప్రభావం పూర్తిగా తగ్గేలా కనిపించడం లేదు. ఒకవేళ తగ్గితే దసరాకి భారీ చిత్రాల దెబ్బకి చిన్న చిత్రాలు రిలీజ్ అయి నిలబడటం కష్టమే.