https://oktelugu.com/

బాలయ్య సినిమా పై కరోనా ప్రభావం !

కరోనా మహమ్మారి దెబ్బకు దేశ వ్యాప్తంగా సినీ లోకం స్తంభించిపోయి.. మళ్ళీ షూటింగ్ లు మొదలుపెట్టడానికి నానా కష్టాలు పడాల్సి వస్తోంది. అయితే ప్రస్తుతం కరోనా ప్రభావం ఉన్నప్పటికీ చిత్ర నిర్మాతలు షూటింగులను తిరిగి ప్రారంభించడానికి ప్లాన్ చేసుకుంటున్నారు. కానీ చాలా మంది చిత్ర నిర్మాతలు ఈ సంవత్సరం చివరి వరకు అవుట్ డోర్ షెడ్యూల్స్ ను మరియు విదేశీ షెడ్యూల్‌ లను రద్దు చేసుకోవాల్సిన పరిస్థితి. కాగా బాలయ్య – బోయపాటి సినిమాలో ఓ ముఖ్యమైన […]

Written By: , Updated On : June 6, 2020 / 06:47 PM IST
Follow us on


కరోనా మహమ్మారి దెబ్బకు దేశ వ్యాప్తంగా సినీ లోకం స్తంభించిపోయి.. మళ్ళీ షూటింగ్ లు మొదలుపెట్టడానికి నానా కష్టాలు పడాల్సి వస్తోంది. అయితే ప్రస్తుతం కరోనా ప్రభావం ఉన్నప్పటికీ చిత్ర నిర్మాతలు షూటింగులను తిరిగి ప్రారంభించడానికి ప్లాన్ చేసుకుంటున్నారు. కానీ చాలా మంది చిత్ర నిర్మాతలు ఈ సంవత్సరం చివరి వరకు అవుట్ డోర్ షెడ్యూల్స్ ను మరియు విదేశీ షెడ్యూల్‌ లను రద్దు చేసుకోవాల్సిన పరిస్థితి. కాగా బాలయ్య – బోయపాటి సినిమాలో ఓ ముఖ్యమైన సీక్వెన్స్ ను వారణాసి మరియు హిమాలయాలలో విస్తృతంగా షూట్ చేయాలి.

కాగా ఆ సీక్వెన్స్ లు కథకు చాలా కీలకమైనవి అట. అందుకే ఎట్టి పరిస్థితుల్లో అక్కడే షూట్ చేయాలి. స్టూడియోల్లో సెట్ వేయడం సాధ్యం కాదు. కానీ అక్కడ షూటింగ్ చేయడం అసాధ్యం. మరి ఇప్పుడు బాలయ్య బృందం ఏమి చేస్తోందో చూడాలి. మొత్తానికి కరోనా ఎఫెక్ట్ బాలయ్య సినిమా పై బాగానే పడింది. ఇక ఈ సినిమాతో ఓ కొత్త హీరోయిన్ ను పరిచయం చేయబోతున్నామని బోయపాటి రీసెంట్ గా ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. ఆ హీరోయిన్ ఎలా ఉండబోతుందో చూడాలి.

ఇక ఈ సినిమాని మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మించనుండగా తమన్ సంగీతం సమకూరుస్తున్నారు. బాలయ్యకు ‘సింహ’ రూపంలో పెద్ద హిట్ ఇచ్చిన బోయపాటి ఆ తర్వాత దాన్ని మించి ‘లెజెండ్’ విజయాన్ని అందించారు. కాబట్టి ఈసారి ‘లెజెండ్’ను మించిన హిట్ పడాలని బాలయ్య ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. మరి బాలయ్యకు హిట్ వస్తోందా అనేదే ఇక్కడ ప్రశ్న.