https://oktelugu.com/

సీఎం పేషీ సిబ్బందికి కరోనా..!

ఏపీ సచివాలయంలో కరోనా ఉధృతి పెరుగుతూనే ఉంది. వివిధ శాఖల్లో పని చేసే డిటిపి ఆపరేటర్లకు, అటెండర్లకు, పోలీసు సిబ్బందికి కరోనా నిర్థారణ అయ్యింది. ఇప్పటి వరకూ సీఎంఓ బ్లాక్ లో సాధారణ పరిపాలనా శాఖ (జిఎడి)కి పరిమితమైన కరోనా తాజాగా సీఎం పేషికి చేరింది. సీఎం పేషీలో పనిచేసే అధికారికి చెందిన డ్రైవర్ సహా ఐదుగురు ఉద్యోగులకు కరోనా పాజిటివ్‌గా నిర్దారణ అవడంతో సీఎంఓ అధికారుల్లో ఆందోళన మొదలైంది. ఇప్పటి వరకూ ఏపీ సచివాలయంలో 10 […]

Written By:
  • Neelambaram
  • , Updated On : June 6, 2020 / 06:15 PM IST
    Follow us on


    ఏపీ సచివాలయంలో కరోనా ఉధృతి పెరుగుతూనే ఉంది. వివిధ శాఖల్లో పని చేసే డిటిపి ఆపరేటర్లకు, అటెండర్లకు, పోలీసు సిబ్బందికి కరోనా నిర్థారణ అయ్యింది. ఇప్పటి వరకూ సీఎంఓ బ్లాక్ లో సాధారణ పరిపాలనా శాఖ (జిఎడి)కి పరిమితమైన కరోనా తాజాగా సీఎం పేషికి చేరింది. సీఎం పేషీలో పనిచేసే అధికారికి చెందిన డ్రైవర్ సహా ఐదుగురు ఉద్యోగులకు కరోనా పాజిటివ్‌గా నిర్దారణ అవడంతో సీఎంఓ అధికారుల్లో ఆందోళన మొదలైంది. ఇప్పటి వరకూ ఏపీ సచివాలయంలో 10 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది.

    తాజాగా పొరుగు సేవల ద్వారా కమాండ్ కంట్రోల్‌లో పనిచేసే ఒక ఉద్యోగికి, ప్రణాళిక విభాగం‌లో డ్రైవర్‌గా పనిచేస్తున్న వ్యక్తికి, పరిశ్రమల శాఖలో పనిచేసే మరో ఉద్యోగికి, సీఎం బ్లాక్‌లో ఆర్‌టీజీఎ‌స్‌లో పనిచేసే సర్వీస్ ప్రొవైడర్‌కు, సీఎం పేషీలో పనిచేసే అధికారి డ్రైవర్‌కు, విద్యాశాఖలో డేటా ఎంట్రీ ఆపరేటర్‌కు కరోనా నిర్దారణ అయ్యిందని వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా కరోనా కేసులు భారీగా నమోదు అవుతున్నాయి. గడచిన 24 గంటల్లో 161 కేసులు నమోదు అయ్యాయి. విదేశాల నుంచి వచ్చిన వారిలో 131 మందికి, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారిలో 41 మందికి కరోనా పాజిటివ్ గా తేలింది.