Paradise Nani: ప్రస్తుతం ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో చాలామంది టాలెంటెడ్ డైరెక్టర్లు మంచి కథలతో సినిమాలను చేసి సూపర్ సక్సెస్ లను సాధిస్తున్నారు. మరి ఇలాంటి సందర్భంలోనే చాలామంది దర్శకులు వాళ్ళని వాళ్ళు స్టార్ డైరెక్టర్లుగా ఎలివేట్ చేసుకోవాలనే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఇక నాని లాంటి స్టార్ హీరోతో సినిమాను చేసి సూపర్ సక్సెస్ లను సాధించిన దర్శకులు చాలామంది ఉన్నారు. అందులో శ్రీకాంత్ ఓదెల ఒకరు… దసర సినిమాతో నాని కి మాస్ ఇమేజ్ ని సంపాదించి పెట్టడమే కాకుండా ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో సైతం దర్శకుడిగా తనకంటూ ఒక ఐడెంటిటిని సంపాదించుకున్నాడు… ఇక ఇప్పటివరకు ఆయన చేసిన సినిమా అతనికి గొప్ప గుర్తింపును సంపాదించి పెట్టింది. మరి ఇలాంటి సందర్భంలోనే ఇక మీదట ఆయన చేయబోతున్న సినిమాలు ఎలాంటి సక్సెస్ లను సాధిస్తాయి. అనేదానిమీదనే సర్వత్రా ఆసక్తి అయితే నెలకొంది. ప్రస్తుతం ఆయన నానితో ‘ప్యారడైజ్ ‘ అనే సినిమా చేస్తున్నాడు. అయితే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన గ్లింప్స్ ప్రేక్షకులందరిని ఆకట్టుకుంది. ఒక గ్లింప్స్ తోనే పాన్ ఇండియాలో మంచి గుర్తింపును సంపాదించుకున్న ఈ సినిమా పెను ప్రభంజనాన్ని సృష్టించబోతుంది అనే విషయాన్ని చెప్పకనే చెప్పాడు. మరి ఈ సినిమాలో నాని క్యారెక్టర్ పేరు జడల్…ఆయన రెండు జడలు వేసుకుని ఉంటాడు. ఆ జడలు ఎవరైనా టచ్ చేస్తే మాత్రం విపరీతమైన కోపానికి వస్తారట.
Also Read: పవన్ కళ్యాణ్ ‘ఓజీ’ అడ్వాన్స్ బుకింగ్స్ మొదలు..నార్త్ అమెరికా లో ఫైర్ స్ట్రోమ్!
అయితే ఈ జడల్ క్యారెక్టర్ ను శ్రీకాంత్ ఓదెల ‘చెంచాల’ అనే ఒక నవలా నుంచి తీసుకున్నట్టుగా తెలుస్తోంది. అయితే హైదరాబాద్ లోని ప్యారడైజ్ అనే ఒక రెడ్ లైట్ ఏరియా ను బేస్ చేసుకొని ఈ సినిమాని తెరకెక్కిస్తున్నట్టుగా తెలుస్తోంది. అయితే చెంచాల అనే నవల లో రెండు జడల్ వేసుకున్న ఒక వ్యక్తి అతని జడలు ఎవరైనా టచ్ చేస్తే మాత్రం బీభత్సమైన కోపానికి వచ్చి వాళ్ళందరిని కొట్టేవాడట…
ఇక అక్కడి నుంచే శ్రీకాంత్ ఆ క్యారెక్టర్ ను తీసుకున్నట్టుగా తెలుస్తోంది… అయితే నిజంగానే ఆ క్యారెక్టర్ ను ఆ నవల నుంచి తీసుకున్నాడా? లేదంటే ఎక్కడి నుంచైనా తీసుకొని చేస్తున్నాడా అనేది తెలియాలంటే మాత్రం ఈ సినిమా రిలీజ్ అయ్యేంతవరకు వెయిట్ చేయాల్సిందే. మరి ఏది ఏమైనా కూడా ఇతర దర్శకులందరు వేరే సినిమాల నుంచి కొన్ని సీనులను కాపీ చేస్తున్నారు అంటూ కాపీ క్యాట్ అంటూ పేర్లు సంపాదించుకున్నారు.
ఇక ఇలాంటి క్రమంలోనే శ్రీకాంత్ ఓదెల సైతం కాపీ క్యాట్ అంటూ అతని మీద కొన్ని వార్తలైతే వస్తున్నాయి. మరి ఏది ఏమైనా కూడా ఆ క్యారెక్టర్ ఎలాంటిది? దానికి దీనికి సంబంధం ఏదైనా ఉందా? డిఫరెంట్ వేరియేషన్లో ఈ క్యారెక్టర్ ని ప్రెసెంట్ చేసే ప్రయత్నం చేస్తున్నాడా? అనేది తెలియాలంటే మాత్రం సినిమా రిలీజ్ అయ్యేంతవరకు వెయిట్ చేయాల్సిందే…