Chiranjeevi Bobby: మెగాస్టార్ చిరంజీవి హీరోగా చాలా సినిమాలు చేశాడు. ఇప్పటివరకు ఆయన సాధించని విజయం లేదు. ఆయన అందుకోని అవార్డు లేదు. ఆయనకు రాని గుర్తింపు లేదు. మరి ఇలాంటి సందర్భంలోనే పాలిటిక్స్ లోకి వెళ్లి అక్కడ తను ఇమడలేనని తెలుసుకున్న చిరంజీవి ఇండస్ట్రీ కి వచ్చేసి సెకండ్ ఇన్నింగ్స్ ను స్టార్ట్ చేసి సినిమాలు చేస్తున్న విషయం మనకు తెలిసిందే. ఇక ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాలన్నీ అతనికి గొప్ప గుర్తింపును సంపాదించి పెట్టాయి. ఇకమీదట కూడా ఆయన చేయబోతున్న సినిమాల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలని చూస్తున్నాడు. ఇప్పటికే ఆయన వశిష్ట డైరెక్షన్లో విశ్వంభర అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా రిలీజ్ కి రెడీ అవుతున్న నేపథ్యంలో అనిల్ రావిపూడి దర్శకత్వంలో చేస్తున్న సినిమా కూడా 2026 సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. మరి ఈ రెండు సినిమాల తర్వాత ఆయన బాబీ డైరెక్షన్లో ఒక సినిమా చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నాడు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. అయితే ఈ సినిమా నెక్స్ట్ లెవల్లో ఉండబోతుందనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. బాబీ ఫస్ట్ టైం పాన్ ఇండియా సినిమాని చేస్తున్నాడు. ఇక దానికి తగ్గట్టుగానే ఈ సినిమా చాలా ఎక్స్ట్రాడినరీగా ఉండబోతుందనే వార్తలు వినిపిస్తున్నాయి. చిరంజీవి ఇందులో కౌబాయ్ గా కనిపించబోతున్నాడట… చిరంజీవి చేసిన కొదమ సింహం మాదిరిగానే ఈ సినిమా కూడా ఉంటుందట. మరి ఈ సినిమాలో చిరంజీవి కొన్ని యాక్షన్ అడ్వెంచర్ సన్నివేశాలను కూడా చేయబోతున్నారట.
Also Read: పవన్ కళ్యాణ్ ‘ఓజీ’ అడ్వాన్స్ బుకింగ్స్ మొదలు..నార్త్ అమెరికా లో ఫైర్ స్ట్రోమ్!
ఒక గూడానికి సంబంధించిన వ్యక్తుల దగ్గర నుంచి అత్యంత విలువైన బంగారాన్ని ఒక వ్యక్తి తీసుకుపోతాడట… దాన్ని తిరిగి తీసుకురావడానికి చిరంజీవి వెళ్ళి వాళ్ళతో ఫైట్ చేస్తాడట…ఈ ఫైట్ లో చిరంజీవితో పాటు ఉన్న తన ప్రాణ స్నేహితుడు సైతం చనిపోవాల్సి వస్తుందట. అయినప్పటికి తను పట్టు వదలని విక్రమార్కుడిలా వాళ్ళందరినీ ఖతం చేసి తనకు కావాల్సిన దానిని తీసుకొచ్చి గూడెం ప్రజలకు అప్పజెప్తాడట. కథ రొటీన్ గా అనిపించిన కూడా బాబీ దీనిని చాలా ఇంట్రెస్టింగ్ గా మలిచినట్టుగా తెలుస్తోంది.
భారీ ట్విస్ట్ లతో పాటు చిరంజీవిని నెక్స్ట్ లెవెల్లో చూపించే ప్రయత్నం కూడా చేయబోతున్నాడు. ఇక ఇప్పటివరకు చిరంజీవి సెకండ్ ఇన్నింగ్స్ లో డిఫరెంట్ క్యారెక్టర్లు అయితే ట్రై చేయలేదు. సైరా సినిమాతో బయోపిక్ ట్రై చేసినప్పటికి ఆ సినిమా ఆశించిన మేరకు అంత పెద్దగా వర్కౌట్ కాలేదు. దాంతో ఆయన రెగ్యూలర్ కమర్షియల్ సినిమాలను చేస్తున్నాడు.
ఇక బాబీ తో చేసే సినిలో కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్నప్పటికి అదొక డిఫరెంట్ జానర్ లో రాబోతోంది. కాబట్టి ఈ సినిమా మీద ప్రతి ఒక్క ప్రేక్షకుడు భారీ అంచనాలైతే పెట్టుకున్నట్టుగా తెలుస్తోంది. మరి చిరంజీవి అభిమానులు సైతం ఈ సినిమాతో కాలర్ ఎగిరేసుకునే విధంగా ఈ సినిమా ఉండబోతుందని తను క్లారిటీగా చెబుతున్నాడు. ఈ సినిమా కథ తెలుసుకున్న చాలా మంది ఈ సినిమా నెక్స్ట్ లెవల్లో ఉంటుంది అంటూ ఒక అంచానకైతే వచ్చారు…