Coolie First Day Collections: 1000 కోట్లు..ఇండియన్ బాక్స్ ఆఫీస్ సూపర్ స్టార్స్ అందరికీ ఇప్పుడు ఇదే టార్గెట్. కానీ వెయ్యి కోట్ల మార్కు ని అందుకోవడం అంత సులువైన విషయం కాదు. కచ్చితంగా పాన్ ఇండియా మార్కెట్ ఉండాలి, లేదా కంటెంట్ వేరే లెవెల్ లో ఉండాలి. ఇప్పటి వరకు ఈ మార్కుని ప్రభాస్, అల్లు అర్జున్, రామ్ చరణ్(#RRR), ఎన్టీఆర్ (#RRR),షారుఖ్ ఖాన్, రాకింగ్ స్టార్ యాష్ (KGF 2) వంటి వారు మాత్రమే అందుకున్నారు. కోలీవుడ్ మన టాలీవుడ్ కంటే పెద్ద మార్కెట్ అయినప్పటికీ ఈ మార్కుని ఇంకా అందుకోలేదు. విజయ్(Thalapathy Vijay) లియో చిత్రానికి పాజిటివ్ టాక్ వచ్చి ఉండుంటే కచ్చితంగా ఆ సినిమా అందుకునేది ఏమో , కానీ యావరేజ్ రేంజ్ టాక్ రావడం తో 650 కోట్ల మార్కు వద్దనే ఆగిపోయింది. దీంతో తమిళ సినిమా ఇండస్ట్రీ ఆశలన్నీ సూపర్ స్టార్ రజినీకాంత్(Superstar Rajinikanth) కూలీ(Coolie Movie) చిత్రం పైనే పెట్టుకున్నాయి.
విడుదలకు ముందే ఈ సినిమాపై అంచనాలు భారీ రేంజ్ లో ఏర్పడ్డాయి. ఈమధ్య కాలం లో ఏ సూపర్ స్టార్ సినిమాకు కూడా ఈ రేంజ్ అంచనాలు లేవనే చెప్పాలి. అలాంటి అంచనాలు ఏర్పాటు చేసుకున్న సినిమా కచ్చితంగా వాటిని అందుకోవడం లో విఫలం అవుతుందని చాలా మంది అనుకున్నారు. కానీ ఎవ్వరూ ఊహించని విధంగా ఈ సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చింది. ఇక రజినీకాంత్ బాక్స్ ఆఫీస్ వద్ద శివ తాండవమే ఆడేస్తాడని అందరు అంటున్నారు. తెలుగు లో ఆయనకు ఎలాగో భారీ రేంజ్ మార్కెట్ ఉంది. హిందీ, కేరళ, కన్నడ కూడా ఈసారి కలిసొచ్చాయి, కాబట్టి ఈ వీకెండ్ హిస్టరీ కనీవినీ ఎరుగని భారీ వసూళ్లను మనం చూడొచ్చు. అన్నీ కలిసి వస్తే ఈ వీకెండ్ కే ఈ చిత్రం 500 కోట్ల గ్రాస్ మార్కుని అందుకునే అవకాశాలు ఉన్నాయి.
Also Read: ‘కూలీ’ ఓవరాల్ పబ్లిక్ టాక్ ఇదే..బాక్స్ ఆఫీస్ రేంజ్ ఎక్కడ దాకా వెళ్తుందో చూడాలి!
సోమవారం నుండి కాస్త హోల్డ్ చేసుకోగలిగితే సెకండ్ వీకెండ్ లో మరోసారి భారీగా కొట్టే అవకాశాలు ఉన్నాయి. మొత్తం మీద పది రోజుల్లో ఈ చిత్రానికి 800 కోట్ల రూపాయిల గ్రాస్ వస్తుందని, లాంగ్ రన్ కూడా వర్కౌట్ అయితే కచ్చితంగా ఈ చిత్రం వెయ్యి కోట్ల రూపాయిల మార్కుని అందుకుంటుందని అంటున్నారు. ఇదే జరిగితే కోలీవుడ్ చిరకాల కల నెరవేరినట్టే. మొదటి నుండి తమిళం లో రికార్డ్స్ కి కేర్ ఆఫ్ అడ్రస్ సూపర్ స్టార్ రజినీకాంత్. తమిళ సినిమాకు ఎవ్వరూ చూడని బెంచ్ మార్క్స్ ని సెట్ చేసింది ఆయనే,ఓవర్సీస్ మార్కెట్ ని క్రియేట్ చేసింది ఆయనే, ఇప్పుడు వెయ్యి కోట్ల మార్కెట్ ని కూడా అందించబోతుంది ఆయనే. ప్రస్తుతం ఉన్న ట్రెండ్ ప్రకారం చూస్తే ఈ చిత్రానికి మొదటి రోజు 180 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వస్తుందని అంటున్నారు.