Coolie Movie Public Talk: సూపర్ స్టార్ రజినీకాంత్(Superstar Rajinikanth) హీరో గా నటించిన ‘కూలీ'(Coolie Movie) నేడు కనీవినీ ఎరుగని భారీ అంచనాల నడుమ అన్ని ప్రాంతీయ భాషల్లో గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది. తెలుగు లో ఒక స్టార్ హీరో సినిమాకు ఎదురు చూసినంతగా ఈ సినిమా కోసం ఎదురు చూశారు. సూపర్ స్టార్ రజినీకాంత్ కెరీర్ లో నేటి తరం ఆడియన్స్ భారీ అంచనాల నడుమ విడుదలైంది అనే ఫీలింగ్ ని కలిగించిన చిత్రం ‘కబాలి’. ఈ సినిమాకు అప్పట్లో ఎలాంటి అంచనాలు ఉండేవి అంటే, ఫ్లాప్ టాక్ వచ్చినా కూడా తమిళనాడు లో ఇండస్ట్రీ హిట్ అయిపోయింది. ఇప్పుడు కూలీ కూడా ఆ రేంజ్ అంచనాల నడుమ విడుదలైంది. సోషల్ మీడియా లో మొదటి ఆటల నుండి కాస్త డివైడ్ టాక్ వచ్చింది. కొంతమంది బాగుందని, మరికొంతమంది యావరేజ్ అని, మరికొంతమంది అంచనాలను అందుకోలేదని అన్నారు.
Also Read: ‘కూలీ’ ట్విట్టర్ రివ్యూస్..లోకేష్ కనకరాజ్ అంచనాలను అందుకున్నాడా?
కానీ బయట మాత్రం ఈ చిత్రానికి చాలా పాజిటివ్ టాక్ ఉంది అనేది వాస్తవం. ఫస్ట్ హాఫ్ కాస్త స్లో స్క్రీన్ ప్లే తో సాగినా, సెకండ్ హాఫ్ మాత్రం అదిరిపోయిందని, ముఖ్యంగా చివరి 45 నిమిషాలు చాలా బాగుందని అంటున్నారు. ఓవరాల్ గా జైలర్ తర్వాత రజినీకాంత్ కి సరైన సినిమా పడిందని అందరూ అంటున్నారు. కచ్చితంగా డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ గత చిత్రం ‘లియో’ కంటే ఇది బెటర్ సినిమా. లియో కి అప్పట్లో సెకండ్ హాఫ్ కి చాలా చెత్త టాక్ వచ్చింది. అయినప్పటికీ కూడా భారీ అంచనాల కారణంగా ఆ సినిమా కమర్షియల్ గా పెద్ద హిట్ అయ్యింది. బాక్స్ ఆఫీస్ వద్ద దాదాపుగా 650 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. ఇప్పుడు కూలీ కి కూడా అదే రేంజ్ హైప్ ఉంది, లియో కంటే బెటర్ టాక్ వచ్చింది, కాబట్టి ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతాలు నెలకొల్పుతుంది అంటూ విశ్లేషకులు అంటున్నారు.
Also Read: ‘వార్ 2’ ఫుల్ మూవీ రివ్యూ… హిట్టా..? ఫట్టా..?
కోలీవుడ్ లో ఈ ఏడాది విడుదలైన తమిళ సినిమాల్లో చిన్న సినిమాలు మాత్రమే కాస్త ఊపిరి పోశాయి. అజిత్ ఏడాది ప్రారంభం లో ‘విడాముయార్చి’ తో ఫ్లాప్ అందుకున్నప్పటికీ, ఏప్రిల్ లో ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ తో సూపర్ హిట్ ని అందుకున్నాడు. ఇక మిగిలిన స్టార్ హీరోలంతా బాక్స్ ఆఫీస్ కి గాయాలు చేశారు. ఆకలి తో ఎదురు చూస్తున్న తమిళ మూవీ లవర్స్ కి కూలీ ఇచ్చే కిక్ మామూలుగా ఉండదు. కచ్చితంగా ఇది జైలర్ రేంజ్ సినిమా కాదు కానీ, రజినీకాంత్ గత రెండు చిత్రాలతో పోల్చి చూస్తే సెన్సేషనల్ సినిమా అనుకోవచ్చు. ఇక ఆయన బాక్స్ ఆఫీస్ మ్యాజిక్ ఏ మేరకు పని చేస్తుందో చూడాలి. వీకెండ్ కే 400 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు అవలీలగా వస్తుందని అంటున్నారు.