Lokesh Kanagaraj Coolie Movie: పాన్ ఇండియా లెవెల్ లో ప్రస్తుతం టాప్ మోస్ట్ డైరెక్టర్స్ లిస్ట్ తీస్తే అందులో లోకేష్ కనకరాజ్(Lokesh Kanakaraj) పేరు కచ్చితంగా ఉంటుంది. అంతకు ముందు ఒక్క సినిమా అవకాశం కోసం హీరోల చుట్టూ తిరిగిన లోకేష్ కనకరాజ్, ఇప్పుడు పాన్ ఇండియన్ సూపర్ స్టార్స్ అందరూ తన కోసం ఎదురు చూసే స్థాయికి ఎదిగాడు. ‘ఖైదీ’ చిత్రం నుండి లోకేష్ టైం మొదలైంది, విక్రమ్ తో ఎక్కడికో వెళ్ళిపోయింది. ప్రస్తుతం ఆయన సూపర్ స్టార్ రజనీకాంత్(Super Star Rajinikanth) తో తీసిన ‘కూలీ'(Coolie Movie) చిత్రం ఆగష్టు 14 న ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదల కాబోతుంది. ఇప్పటి వరకు ఈ సినిమా నుండి సరైన కంటెంట్ రాలేదు, అయినప్పటికీ ఈ రేంజ్ క్రేజ్ ఉందంటే అందుకు కారణం లోకేష్ కనకరాజ్ డైరెక్టర్ అవ్వడం వల్లే అని అనడం లో ఎలాంటి సందేహం లేదు.
Also Read: కాంతార చాప్టర్ 1 మూవీ పోస్టర్ వేరేలేవల్ ఉందిగా… రిషబ్ శెట్టి మరో హిట్ కొట్టబోతున్నాడా..?
రీసెంట్ గా జరిగిన ఒక ఇంటర్వ్యూ లో లోకేష్ కనకరాజ్ కూలీ కోసం తాను పడిన కష్టం గురించి చెప్పుకొచ్చాడు. ఆయన మాట్లాడుతూ ‘గత రెండేళ్లుగా నేను సమస్తం కూలీ సినిమా కోసమే కేటాయించాను. నా ప్రపంచం మొత్తం కూలీ ప్రపంచమే అయ్యింది. ఫ్యామిలీ లేదు, స్నేహితులు లేరు,విందు వినోదాలు లాంటివి ఏమి లేవు. నా 36, 37 వ సంవత్సరాలు నా జీవితం లో ఎంతో ముఖ్యమైనవి. నా వైపు నుండి ఎంత బెస్ట్ ఇవ్వగలనో అదంతా ఈ సినిమా కోసం ఇచ్చేశాను’ అంటూ చెప్పుకొచ్చాడు లోకేష్. ఇప్పటి వరకు లోకేష్ ఎన్నో సూపర్ హిట్ సినిమాలను తెరకెక్కించాడు కానీ, ఈ సినిమాకు ఆయన ఉన్నంత కాన్ఫిడెంట్ గా ఏ సినిమాకి కూడా లేడు అని అనిపించింది. కొడితే కుంభస్థలం బద్దలు అవ్వుధి అనే రేంజ్ లో చెప్తున్నాడు. మరి ఇది ఎంత వరకు నిజం అవుతుందో చూడాలి మరి. ఈ సినిమాకు ప్రాంతాల వారీగా జరిగిన బిజినెస్ మాత్రం వేరే లెవెల్ అనొచ్చు.
Also Read: హరిహర వీరమల్లు మీద నెగెటివ్ ప్రచారం చేస్తుందేవరు..?
తెలుగు రాష్ట్రాల థియేట్రికల్ రైట్స్ దాదాపుగా 50 కోట్ల రూపాయలకు ఏషియన్ సునీల్ దక్కించుకున్నాడు. అదే విధంగా ఓవర్సీస్ థియేట్రికల్ రైట్స్ కమీషన్ బేసిస్ మీద 80 కోట్ల రూపాయలకు అమ్ముడుపోయింది. ఓవరాల్ గా ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 250 కోట్ల రూపాయలకు పైగా థియేట్రికల్ బిజినెస్ ని జరుపుకుంది. సూపర్ హిట్ టాక్ ని సొంతం చేసుకుంటే మాత్రమే కేవలం వీకెండ్ కి 70 శాతానికి పైగా రికవరీ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇకపోతే ఈ చిత్రం లో విలన్ గా అక్కినేని నాగార్జున నటించిన సంగతి తెలిసిందే. ఉపేంద్ర కూడా ఒక కీలక పాత్ర పోషించాడు. ఇక బాలీవుడ్ సూపర్ స్టార్ అమీర్ ఖాన్ కూడా క్లైమాక్స్ లో స్పెషల్ రోల్ ద్వారా ఆడియన్స్ కి సర్ప్రైజ్ ఇవ్వబోతున్నాడు.