Coolie Movie Story: సినిమా విడుదలకు ముందు విపరీతమైన హైప్ పెంచే దర్శకులలో ఒకరు లోకేష్ కనకరాజ్(Lokesh Kanakaraj). తన సినిమాలకు సంబంధించిన ప్రమోషనల్ కంటెంట్ తోనే 70 శాతం చిత్రాన్ని సూపర్ హిట్ చేసేస్తాడు. మిగిలిన 30 శాతం కేవలం యావరేజ్ టాక్ వస్తే చాలు, కనీవినీ ఎరుగని రేంజ్ బాక్స్ ఆఫీస్ వసూళ్లను కళ్ళముందు పెడుతాడు. ఆయన గత చిత్రం ‘లియో’ కి అదే జరిగింది. ఈ చిత్రం తర్వాత ఆయన సూపర్ స్టార్ రజనీకాంత్(Superstar Rajinikanth) తో చేసిన ‘కూలీ'(Coolie Movie) ఈ నెల 14 న ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదల కాబోతుంది. ఈ సినిమాని ప్రకటించిన రోజు నుండే మార్కెట్ లో విపరీతమైన క్రేజ్ ఉండేది. కానీ ఎప్పుడైతే ఈ చిత్రం నుండి పాటలు విడుదల అయ్యాయో, అప్పటి నుండి అంచనాలు ఎవ్వరూ ఊహించని రేంజ్ కి చేరుకున్నాయి. రేపు ఈ చిత్రానికి సంబంధించిన థియేట్రికల్ ట్రైలర్ ని విడుదల చేయబోతున్నారు.
Also Read: డైరెక్టర్ సుజిత్ కి ప్రాంక్ కాల్ చేసి హడలు కొట్టిన థమన్..వీడియో వైరల్!
ఈ ట్రైలర్ సంగతి కాసేపు పక్కన పెడితే, ఈ సినిమాకు సంబంధించిన స్టోరీ లైన్ మొత్తం పూర్తిగా సోషల్ మీడియా లో లీక్ అయ్యింది. స్టోరీ ఏంటో చూద్దాం. రహస్యంగా సాగే అక్రమ రవాణా ముఠా ఒకటి ఉంటుంది. ఈ ముఠా ఎంతో విలువైన వస్తువులను స్మగ్లింగ్ చేసి విదేశాలకు కూలీల ద్వారా తరలిస్తూ ఉంటుంది. ఇక్కడ ముఠా కూలీలను మనుషులు లాగా చూడరు. పశువులు లాగా చూస్తుంటారు. వారి పట్ల అత్యంత కిరాతకంగా వ్యవహరిస్తూ ఉంటాడు. అలాంటి ముఠాకి ఎదురు తిరిగి ఒక ధైర్యవంతుడి కథనే ఈ సినిమా. తన శక్తి, తెలివి, ఆత్మవిశ్వాసంతో తనదైన శైలిలో పోరాటం చేయడంతో పాటు, కార్మికుల గౌరవాన్ని కాపాడే సాటి కార్మికుడిగా రజనీకాంత్ ఇందులో కనిపించబోతున్నాడు. స్టోరీ వింటుంటే చాలా బాగా అనిపిస్తుంది కదూ. దీనిని రజనీకాంత్ స్టైల్ లో, లోకేష్ కనకరాజ్ సరైన టేకింగ్ తో ఈ చిత్రాన్ని తెరకెక్కించి ఉండుంటే బాక్స్ ఆఫీస్ రికార్డ్స్ ఎవ్వరూ ఊహించని రేంజ్ లో ఉంటుంది.
Also Read: పవన్ కళ్యాణ్ ‘ఓజీ’ అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభం తేదీ వచ్చేసింది..!
మన ఇండియా లో బాలీవుడ్, టాలీవుడ్, శాండిల్ వుడ్ ఇండస్ట్రీస్ కి వెయ్యి కోట్ల సినిమాలు ఉన్నాయి. కానీ కోలీవుడ్ కి మాత్రం ఇప్పటి వరకు వెయ్యి కోట్ల సినిమా లేదు. కూలీ చిత్రం లో సరైన హీరోయిజం తో పాటు, ఎమోషన్స్ ని కూడా పర్ఫెక్ట్ గా మ్యానేజ్ చేసి తెరకెక్కించి ఉండుంటే మాత్రం కోలీవుడ్ కి ఇది మొట్టమొదటి వెయ్యి కోట్ల సినిమా అవుతుంది. ఇకపోతే ఈ చిత్రం లో అక్కినేని నాగార్జున విలన్ గా నటించిన సంగతి తెలిసిందే. ఈయన షూటింగ్ కి సంబంధించి ఒక వీడియో కూడా లీక్ అయ్యింది. అందులో నాగార్జున ఒక కార్మికుడిని అత్యంత క్రూరంగా కొట్టి చంపుతుంటాడు. అలాంటి క్రూరత్వం తో నిండిన నాగార్జున ఆటలను రజనీకాంత్ ఎలా అరికట్టించాడో తెలియాలంటే మరో 12 రోజులు ఆగాల్సిందే.