Coolie Movie Hindi Collection: ఎన్టీఆర్(Junior NTR),హృతిక్ రోషన్(Hrithik Roshan) కాంబినేషన్ లో తెరకెక్కిన ‘వార్ 2′(War 2 Movie) మూవీ రీసెంట్ గానే భారీ అంచనాల నడుమ విడుదలై మొదటి ఆట నుండే డివైడ్ టాక్ ని సొంతం చేసుకున్న సంగతి అందరికీ తెలిసిందే. ‘హరి హర వీరమల్లు’ కంటే బెటర్ టాక్ వచ్చింది కదా, ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఆడేస్తుందిలే అని అంతా అనుకున్నారు. కానీ చివరికి ఎన్టీఆర్ కెరీర్ లోనే దారుణమైన డిజాస్టర్ ఫ్లాప్ గా మిగిలింది. ఆయన కెరీర్ లో కనీసం ఓపెనింగ్స్ కూడా తెచ్చుకోలేక అట్టర్ ఫ్లాప్ అయిన సినిమా గతం లో ఏదైనా ఉందా అంటే అది ‘నరసింహుడు’ చిత్రం మాత్రమే. ఆ తర్వాత ఆ జాబితాలోకి ‘వార్ 2’ చేరింది. ఎన్టీఆర్ సినిమాలకు టాక్ ఎలా ఉన్నా ఓపెనింగ్స్ మాత్రం మినిమం గ్యారంటీ రేంజ్ లో ఉంటాయి, కానీ ఈ రెండు చిత్రాలే అభిమానులకు ఊహించని షాక్ ని ఇచ్చాయి.
Also Read: రజినీకాంత్ – కమల్ హాసన్ ప్రాజెక్ట్ కన్ఫర్మ్ అయిందా..? పట్టాలెక్కేది ఎప్పుడంటే..?
ఇదంతా పక్కన పెడితే ఈ సినిమా తెలుగు లోనే కాదు, హిందీ లో కూడా దారుణమైన ఫ్లాప్ గా నిల్చింది. కానీ డైరెక్ట్ హిందీ చిత్రం కాబట్టి హృతిక్ రోషన్ ఈ చిత్రాన్ని వీకెండ్ వరకు బాగానే లాగాడు. మన తెలుగు లో వచ్చినంత దారుణమైన ఓపెనింగ్ హిందీ లో మాత్రం రాలేదు. కానీ వర్కింగ్ డేస్ లో మాత్రం ఈ చిత్రం దారుణంగా పడిపోయింది. ప్రస్తుతం ఎలాంటి పరిస్థితి లో ఉందంటే ‘కూలీ'(Coolie Movie) హిందీ వెర్షన్ రోజు వారి కలెక్షన్స్ కంటే ఈ చిత్రానికే తక్కువ కలెక్షన్స్ నమోదు అవుతున్నాయి. బుక్ మై షో యాప్ లో ‘కూలీ’ మూవీ హిందీ కలెక్షన్స్ చాలా స్టడీ గా ఉన్నాయి. కానీ ‘వార్ 2’ కలెక్షన్స్ మాత్రం రోజురోజుకి పడిపోతున్నాయి. ట్రేడ్ పండితులు అందిస్తున్న సమాచారం ప్రకారం ఈ రోజు కూలీ చిత్రానికి రెండు కోట్ల 70 లక్షల రూపాయిల నెట్ వసూళ్లు నమోదు అయ్యాయట.
మరో పక్క వార్ 2 చిత్రానికి కేవలం 2 కోట్ల రూపాయిల నెట్ వసూళ్లు మాత్రమే నమోదు అయ్యాయి అని అంటున్నారు. ఇలా ఒక తమిళ డబ్బింగ్ సినిమా డైరెక్ట్ హిందీ చిత్రాన్ని డామినేట్ చేస్తుందంటే బాలీవుడ్ పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో అర్థం చేఉస్కోవచ్చు. మరో పక్క ఆ చిత్రం లో హీరో గా నటించిన హృతిక్ రోషన్ కి గత పదేళ్ల నుండి సరైన బ్లాక్ బస్టర్ హిట్ లేదు. ఇలాంటి సమయం లో ‘వార్ 2’ చిత్రం మరో డిజాస్టర్ గా నిల్చింది హృతిక్ రోషన్ కెరీర్ లో. ఇప్పుడు ఆయన నుండి మరో సినిమా రావాలంటే అభిమానులు రెండేళ్ల వరకు ఎదురు చూడాల్సిందే. ప్రస్తుతం ఆయన ‘క్రిష్ 4’ చిత్రం లో నటించబోతున్నాడు.