Shagufta Rafique Life: సినీ పరిశ్రమలో అవకాశాలు అంత ఈజీగా రావు. కొంతమందికి వైల్డ్ కార్డు ఎంట్రీ లభిస్తే.. మిగతా వారికి నానా తిప్పలు పడితే తప్ప అవకాశాలు లభించదు. అలా లభించిన అవకాశాలు స్థిరంగా ఉండవు. సినిమా పరిశ్రమలో ముఖ్యంగా హీరోయిన్ల విషయంలో అందానికే ప్రయారిటీ ఉంటుంది. ముసలి హీరోలు కూడా తమ కూతురు వయసు ఉన్న అమ్మాయిలతోనే ఆడి పాడేందుకు ఇష్టపడుతుంటారు. అలాంటి పరిశ్రమలోకి పడుపు వృత్తిని నమ్ముకున్న ఓ యువతి వచ్చింది.
Also Read: రజినీకాంత్ – కమల్ హాసన్ ప్రాజెక్ట్ కన్ఫర్మ్ అయిందా..? పట్టాలెక్కేది ఎప్పుడంటే..?
కుటుంబ పరిస్థితులు బాగా లేక 17 సంవత్సరాల లోనే ఆ వృత్తిలోకి వెళ్లాల్సి వచ్చింది. అప్పట్లో ఒక రాత్రికి 3000 దాకా తీసుకునేది. విటులు ఎవరూ రాకుంటే కొన్ని సందర్భాలలో బార్ డాన్సర్ గా కూడా అలరించేది.. అలా తన ఒళ్ళును అమ్ముకుంటూ.. జీవనానికి కొనసాగించేది. అయితే అనుకోకుండా వచ్చిన సినిమా అవకాశాలు ఆమె జీవితాన్ని పూర్తిగా మార్చేశాయి..
వో లమ్హే, ఆవారాపన్, దోఖా, రాజ్, మర్డర్ 2, జన్నత్ వంటి సినిమాలలో సంచలనం సృష్టించింది. ఆ సినిమాలలో మిగతా నటులు ఎలా ఉన్నప్పటికీ..ఆ సినిమాలు విజయవంతం కావడంలో ముఖ్యపాత్ర పోషించింది శగుప్తా రఫిక్.. ఈ సినిమాలకు శగుప్తా రఫిక్ స్క్రీన్ ప్లే, డైలాగ్స్ రాసింది. వాస్తవానికి ఇక్కడదాకా రావడానికి ఆమె చాలా ఇబ్బంది పడింది. రకరకాల కష్టాలు ఎదుర్కొంది.. వాస్తవానికి ఆమెకు తన తల్లిదండ్రులు ఎవరో తెలియదు.. నటి అన్వరీ బేగం వద్ద ఆమె పెరిగారు. అన్వర్ బేగానికి ఆమె మనవరాలని కొంతమంది చెబుతుంటారు. ఇంకొంతమంది ఏమో ఆమె రోడ్డు మీద దొరికిందని అంటుంటారు.. మహేష్ బెడ్ రూపంలో శగుప్తా రఫిక్ బాలీవుడ్ లో అవకాశం లభించింది.. 2006లో శగుప్తా రఫిక్ వో లమ్హే చిత్ర ద్వారా ఆమె తన ప్రయాణాన్ని మొదలుపెట్టారు. అనేక విజయవంతమైన సినిమాలకు కథలు రాశారు. భరించలేని పేదరికం వల్ల పడుపు వృత్తిలోకి శగుప్తా రఫిక్ వెళ్లాల్సి వచ్చింది. గత్యంతరం లేక ఆమె ప్రవేట్ పార్టీలో కూడా పాల్గొనాల్సి వచ్చింది. . నిండా 17 సంవత్సరాలు కూడా లేని వయసులో ఆమె ఈ నరకాన్ని అనుభవించింది. దుబాయిలో బార్ డాన్సర్ గా కూడా పనిచేసింది. అప్పట్లో ఆమెకు ఒక రోజుకు మూడు వేల దాకా ఇచ్చేవారు.
దుబాయ్ లో ఆమె డాన్సర్ గా పని చేస్తున్నప్పుడు ఓ 45 సంవత్సరాల వ్యక్తి పరిచయం అయ్యాడు. ఆమె డాన్స్ చేస్తుంటే బీభత్సంగా డబ్బులు కురిపించేవాడు. అలా వారిద్దరి మధ్య సాన్నిహిత్యం పెరిగింది. అయితే అది అక్కడితోనే ఆగిపోయింది. 2002లో మహేష్ భట్ పరిచయం కావడం శగుప్తా రఫిక్ జీవితాన్ని మార్చేసింది. 2006లో మోహిత్ సూర్య దర్శకత్వంలో వచ్చిన కలియుగ్ సినిమాలో శగుప్తా రఫిక్ కొన్ని సంభాషణలు రాశారు. ఆ తర్వాత వో లమ్హే, మర్డర్ -2, ఆషీకీ -2 వంటి సినిమాలకు పని చేశారు. శగుప్తా రఫిక్ చేతిలో ఇప్పుడు ఏ సినిమాలు ఉన్నాయో తెలియదు కానీ.. పురుషాధిక్యం ఉండే బాలీవుడ్లో తనకంటూ ఒక ట్రెండ్ సృష్టించుకుంది శగుప్తా రఫిక్.